< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 2 >

1 సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు.
所罗门定意要为耶和华的名建造殿宇,又为自己的国建造宫室。
2 అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు.
所罗门就挑选七万扛抬的,八万在山上凿石头的,三千六百督工的。
3 అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు.
所罗门差人去见泰尔王希兰,说:“你曾运香柏木与我父大卫建宫居住,求你也这样待我。
4 నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.
我要为耶和华—我 神的名建造殿宇,分别为圣献给他,在他面前焚烧美香,常摆陈设饼,每早晚、安息日、月朔,并耶和华—我们 神所定的节期献燔祭。这是以色列人永远的定例。
5 మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది.
我所要建造的殿宇甚大;因为我们的 神至大,超乎诸神。
6 అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.
天和天上的天,尚且不足他居住的,谁能为他建造殿宇呢?我是谁?能为他建造殿宇吗?不过在他面前烧香而已。
7 కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.
现在求你差一个巧匠来,就是善用金、银、铜、铁,和紫色、朱红色、蓝色线,并精于雕刻之工的巧匠,与我父大卫在犹大和耶路撒冷所预备的巧匠一同做工;
8 ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది.
又求你从黎巴嫩运些香柏木、松木、檀香木到我这里来,因我知道你的仆人善于砍伐黎巴嫩的树木。我的仆人也必与你的仆人同工。
9 కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు.
这样,可以给我预备许多的木料,因我要建造的殿宇高大出奇。
10 ౧౦ కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”
你的仆人砍伐树木,我必给他们打好了的小麦二万歌珥,大麦二万歌珥,酒二万罢特,油二万罢特。”
11 ౧౧ దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు.
泰尔王希兰写信回答所罗门说:“耶和华因为爱他的子民,所以立你作他们的王”;
12 ౧౨ యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక.
又说:“创造天地的耶和华—以色列的 神是应当称颂的!他赐给大卫王一个有智慧的儿子,使他有谋略聪明,可以为耶和华建造殿宇,又为自己的国建造宫室。
13 ౧౩ తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను.
“现在我打发一个精巧有聪明的人去,他是我父亲希兰所用的,
14 ౧౪ అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.
是但支派一个妇人的儿子。他父亲是泰尔人,他善用金、银、铜、铁、石、木,和紫色、蓝色、朱红色线与细麻制造各物,并精于雕刻,又能想出各样的巧工。请你派定这人,与你的巧匠和你父—我主大卫的巧匠一同做工。
15 ౧౫ ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.
我主所说的小麦、大麦、酒、油,愿我主运来给众仆人。
16 ౧౬ మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.
我们必照你所需用的,从黎巴嫩砍伐树木,扎成筏子,浮海运到约帕;你可以从那里运到耶路撒冷。”
17 ౧౭ సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు.
所罗门仿照他父大卫数点住在以色列地所有寄居的外邦人,共有十五万三千六百名;
18 ౧౮ వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు.
使七万人扛抬材料,八万人在山上凿石头,三千六百人督理工作。

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 2 >