< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 2 >
1 ౧ సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు.
撒羅滿決定為上主的名建造聖殿,為自己修築王宮。
2 ౨ అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు.
撒羅滿點派了七萬人作運夫,八萬人在山上鑿石,三千六百人作監工。
3 ౩ అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు.
撒羅滿遣使向提洛王希蘭說:「有如你怎樣對待了我父達味,給他運來了香柏木,建造他居住的宮殿,也請你如此對待我。
4 ౪ నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.
我現今要為上主我的天主的名,建造一座聖殿,奉獻給他,在他面前焚燒芬芳的香料,永遠獻上供餅,每日早晚、安息日、月朔,以及上主我們天主的節日,奉獻全燔祭:這為以色列人是永久的事。
5 ౫ మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది.
我建造的殿宇必須廣大,因為我們的天父大於諸神。
6 ౬ అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.
然而,誰有能力為他建造一座殿宇﹖天與諸天之天,尚容不下他。我是誰,竟能為他建造殿宇﹖不過只是為在他面前焚香罷了!
7 ౭ కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.
現在,請你給我派一位技師來,他要精於金、銀、銅、鐵,以及紫紅、朱紅、藍線等工作;並且還應會各種雕刻,好與我父親達味在猶大和耶路撒冷所準備的技術人員一同工作。
8 ౮ ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది.
請你由黎巴嫩給我運香柏、松柏和檀香木來,因為我知道你的僕人善於砍伐黎巴嫩的木材;我的僕人將與你的僕人一同工作。
9 ౯ కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు.
他們要為我大量預備木材,因為我要建造的殿宇極其廣大。
10 ౧౦ కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”
至於你那些伐木砍樹的僕人,我必供給他們食糧,小麥二萬「苛爾,」大麥二萬「苛爾,」酒兩萬「巴特,」油兩萬「巴特。」[提洛王應允合作]
11 ౧౧ దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు.
提洛王希蘭回信給撒羅滿說:「上主由於愛慕自己的百姓,所以立你作了他們的君王。」
12 ౧౨ యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక.
希蘭又說:「創造天地的上主以色列的天主應受讚美! 因為他賜給了達味王一個智慧的兒子,聰明機敏,可為上主建造殿宇,為自己修築無宮。
13 ౧౩ తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను.
我現在打發一個具有智慧和才學的人去,他名叫胡蘭阿彼,
14 ౧౪ అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.
是一丹支派女人的兒子,他父親是提洛人,他精於金、銀、銅、鐵、石、木紫色、紅色、藍色、細麻,以及朱紅線各種工作,善於各種雕刻,又能設計各種托於他的技工。這人可與你的技師和你父親我主達味的技師,一同工作。
15 ౧౫ ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.
我主談及的小麥、大麥、油和酒,請即運來分配給僕人。
16 ౧౬ మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.
我們必照你所需要的,在黎巴嫩砍伐樹木,編成木筏,由海上運到約培;以後你運到耶路撒冷。選派工匠
17 ౧౭ సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు.
撒羅滿按照他父親達味所統計過的數目,又統計了住在以色列境內的一切外方人,共計十五萬三千六百人,
18 ౧౮ వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు.
委派其中的七萬人作運夫,八萬人在山上鑿石,安千六百人作監工,督促人民工作。