< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 19 >
1 ౧ యూదారాజు యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములోని తన ఇంటికి తిరిగి వచ్చాడు.
Giô-sa-phát, vua Giu-đa, trở về bình an nơi cung mình tại Giê-ru-sa-lem.
2 ౨ దీర్ఘ దర్శి, హనానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్లి, యెహోషాపాతు రాజుకు ఇలా తెలియచేశాడు. “నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది.
Giê-hu, con trai của Ha-na-ni, đấng tiên kiến, đi ra đón vua Giô-sa-phát, mà nói rằng: Vua há giúp đỡ kẻ hung ác, và thương mến kẻ ghen ghét Ðức Giê-hô-va sao? Bởi cớ đó, có cơn giận của Ðức Giê-hô-va đến trên vua.
3 ౩ అయితే, నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలోనుంచి నువ్వు అషేరా దేవతాస్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనస్సు నిలుపుకున్నావు.”
Nhưng trong vua có điều lành, vì vua có trừ diệt khỏi xứ những thần A-sê-ra, và rắp lòng tìm cầu Ðức Chúa Trời.
4 ౪ యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్లి, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాడు.
Giô-sa-phát ở tại Giê-ru-sa-lem. Ðoạn, người lại đi ra tuần soát dân sự, từ Bê -e-Sê-ba cho đến núi Ép-ra-im, dẫn dắt chúng trở về cùng Giê-hô-va Ðức Chúa Trời của tổ phụ họ.
5 ౫ యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరచాడు.
Người lập quan xét trong khắp nước, tại các thành bền vững của Giu-đa, thành nào cũng có.
6 ౬ అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.
Rồi người bảo các quan xét rằng: Hãy cẩn thận việc các người làm; vì chẳng phải vì loài người mà các ngươi xét đoán đâu, bèn là vì Ðức Giê-hô-va; Ngài sẽ ở cùng các ngươi trong việc xét đoán.
7 ౭ యెహోవా భయం మీమీద ఉండు గాక. తీర్పు తీర్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు.”
Vậy bây giờ, phải kính sợ Ðức Giê-hô-va, khá cẩn thận mà làm; vì Giê-hô-va Ðức Chúa Trời của chúng ta chẳng trái phép công bình, chẳng thiên vị người, chẳng nhận của hối lộ.
8 ౮ యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో యాజకుల్లో ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.
Lại Giô-sa-phát cũng chọn mấy người Lê-vi, thầy tế lễ và trưởng tộc của Y-sơ-ra-ên, đặt họ tại Giê-ru-sa-lem, đặng vì Ðức Giê-hô-va mà đoán xét và phân xử việc kiện cáo. Chúng đều trở về Giê-ru-sa-lem.
9 ౯ వారికి ఇలా ఆజ్ఞాపించాడు. “యెహోవా మీద భయభక్తులు కలిగి, నమ్మకంతో, యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి.
Người dạy biểu chúng rằng: Các ngươi phải kính sợ Ðức Giê-hô-va, lấy lòng trọn lành trung tín mà làm như vậy.
10 ౧౦ నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.
Hễ có anh em các ngươi ở trong các thành họ, đem đến trước mặt các ngươi việc tranh tụng nào, hoặc vì sự đổ huyết, hoặc vì phạm luật lệ và điều răn, giới mạng và pháp độ, thì các ngươi phải dạy bảo họ chớ phạm tội cùng Ðức Giê-hô-va, e có cơn giận nghịch cùng các ngươi và anh em các ngươi: các ngươi làm như vậy, ắt không gây cho mình mắc tội.
11 ౧౧ ప్రధానయాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతివారికి అధిపతి, ఇష్మాయేలు కొడుకు జెబద్యా, రాజు సంగతుల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి. మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు.”
Nầy thầy tế lễ cả A-ma-ria, sẽ quản lý những việc thuộc về Ðức Giê-hô-va, và Xê-ba-đia, con trai Ích-ma-ên, trưởng tộc chi phái Giu-đa, sẽ quản lý những việc thuộc về vua; trước mặt các ngươi cũng có những người Lê-vi làm quan cai. Các ngươi khác làm việc cách can đởm, và Ðức Giê-hô-va sẽ ở cùng người thiện.