< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 16 >

1 ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు.
Léta třidcátého šestého kralování Azova vytáhl Báza král Izraelský proti Judovi, a stavěl Ráma, aby nedal vyjíti ani jíti k Azovi králi Judskému.
2 ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు.
Tedy vzav Aza stříbro i zlato z pokladů domu Hospodinova i domu královského, poslal k Benadadovi králi Syrskému, kterýž bydlil v Damašku, řka:
3 “నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో” అని అడిగాడు.
Smlouva jest mezi mnou a mezi tebou, mezi otcem mým a mezi otcem tvým. Aj, posílámť teď stříbro a zlato, jdi, zruš smlouvu svou s Bázou králem Izraelským, ať odtrhne ode mne.
4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు.
I uposlechl Benadad krále Azy, a poslal knížata s vojsky svými proti městům Izraelským. I dobyli Jon a Dan, též Abelmaim i všech měst Neftalímových, v nichž měli sklady.
5 బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు.
To když uslyšel Báza, přestal stavěti Ráma, a zanechal díla svého.
6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.
V tom Aza král pojal všecken lid Judský, a pobrali kamení z Ráma i dříví, z něhož stavěl Báza, a vystavěl z něho Gabaa a Masfa.
7 ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.
V ten pak čas přišel Chanani prorok k Azovi králi Judskému, a řekl jemu: Že jsi zpolehl na krále Syrského, a nezpolehl jsi na Hospodina Boha svého, proto ušlo vojsko krále Syrského z ruky tvé.
8 ఇంతకు ముందు లెక్క లేనన్ని రథాలు, గుర్రపు రౌతులు గల ఇతియోపీయులు, లూబీయులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా? అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు.
Zdaliž jsou Chussimští a Lubimští neměli vojsk velmi velikých, s vozy a jezdci náramně mnohými? A když jsi zpolehl na Hospodina, vydal je v ruku tvou.
9 తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.”
Oči zajisté Hospodinovy spatřují všecku zemi, aby dokazoval síly své při těch, kteříž jsou k němu srdce upřímého. Bláznivě jsi učinil v té věci, protož od toho času budou proti tobě války.
10 ౧౦ ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.
Tedy rozhněvav se Aza na proroka, dal ho do vězení; nebo se byl rozhněval na něj pro tu věc. A utiskal Aza některé z lidu toho času.
11 ౧౧ ఆసా చేసిన పనులన్నిటిని గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.
O jiných pak věcech Azových, prvních i posledních, zapsáno jest v knize o králích Judských a Izraelských.
12 ౧౨ ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.
Potom léta třidcátého devátého kralování svého nemocen byl Aza na nohy své těžkou nemocí, a však v nemoci své nehledal Boha, ale lékařů.
13 ౧౩ ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41 వ సంవత్సరంలో చనిపోయాడు.
A tak usnul Aza s otci svými, a umřel léta čtyřidcátého prvního kralování svého.
14 ౧౪ ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ, పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడె మీద అతణ్ణి ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకొన్న సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు.
A pochovali jej v hrobě jeho, kterýž byl vytesal sobě v městě Davidově, a položili ho na lůžku, kteréž byl naplnil vonnými věcmi a mastmi dílem apatykářským připravenými. I pálili to jemu ohněm velmi velikým.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 16 >