< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 13 >
1 ౧ యరొబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరంలో అబీయా యూదావారి మీద రాజయ్యాడు.
I det attande styringsåret åt Jeroboam vart Abia konge yver Juda;
2 ౨ అతడు మూడు సంవత్సరాలు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా పట్టణానికి చెందిన ఊరియేలు కుమార్తె.
tri år styrde han i Jerusalem. Mor hans heitte Mikaja Urielsdotter og var frå Gibea. Det var ufred millom Abia og Jeroboam.
3 ౩ అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.
Abia byrja striden med ein her av djerve stridsmenner, fire hundrad tusund utvalde menner, men Jeroboam møtte honom med åtte hundrad tusund utvalde menner, som var djerve stridsmenner.
4 ౪ అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యంలోని సెమరాయిము కొండ మీద నిలబడి ఇలా ప్రకటించాడు, “యరొబాము, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా వినండి.
Men Abia gjekk upp på Semarajimberget i Efraimsfjelli og sagde: «Høyr meg Jeroboam og heile Israel!
5 ౫ ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా
De veit då vel at Herren, Israels Gud, hev gjeve kongedømet yver Israel for alle tider til David og hans søner ved ei ubrjotande semja.
6 ౬ అయినా దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడు, నెబాతు కొడుకు అయిన యరొబాము పనికిమాలిన దుష్టులతో చేతులు కలిపి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.
Men Jeroboam Nebatsson, trælen åt Salomo Davidsson, reiste seg og gjorde upprør mot herren sin.
7 ౭ సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడుగా, అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు.”
Og kring honom samla det seg lause karar, skamløysor, som tråssa Rehabeam, son åt Salomo, og Rehabeam var ung og veiklyndt og kunde ikkje halda seg imot deim.
8 ౮ “ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.
Og no trur de at de kann tråssa Herrens kongedøme, som ligg til Davids søner, for di det er ein stor hop av dykk, og det hev hjå dykk dei gullkalvarne som Jeroboam let gjera til gudar for dykk.
9 ౯ మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.
Hev de ikkje jaga burt Herrens prestar, sønerne åt Aron, og levitarne, og rådt dykk til prestar liksom hedningfolki? Kvar den som kom med ein ung ukse og sju verar til prestevigsla, han vert prest for u-gudarne.
10 ౧౦ అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.
Men Herren er vår Gud, og me hev ikkje vendt oss frå honom; sønerne åt Aron er prestar for Herren, og levitarne gjer tenesta.
11 ౧౧ వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.”
Kvar morgon og kvar kveld let dei brennofferi ganga upp i røyk med finangande røykjelse, skodebrødi ligg på gullbordet, og gull-ljosestaken med lamporne kveikjer dei kveld etter kveld; for me agtar på fyresegnerne åt Herren, vår Gud, men de hev vendt dykk frå honom.
12 ౧౨ “ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా, మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికీ బూరలు ఊదడానికీ మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీకు జయం కలగదు.”
Sjå, Gud er føraren hjå oss og me hev prestarne hans med alarmlurarne, og dei skal blåsa til strid mot dykk. Israels søner, gjev dykk ikkje i strid med Herren, vår fedregud, for då skal de ikkje hava lukka med dykk!»
13 ౧౩ అంతకుముందు యరొబాము యూదావారి వెనక భాగంలో కొందరు మాటుగాళ్ళను ఉంచదువు. యరోబాము సైన్యం యూదా వారికి ఎదుటా, మాటుగాళ్ళు వారికి వెనకా ఉండేలా చేశాడు.
Men Jeroboam hadde late deim som låg i baklur kringganga deim soleis at Juda-mennerne hadde deim fyre seg og baklur-mennerne i ryggen.
14 ౧౪ యూదా వారు, తమకు ముందూ వెనకా యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు ఊదారు.
Då no Juda-mennerne snudde seg rundt, og såg at åtaket truga deim både framantil og attantil, då ropa deim til Herren; men prestarne bles i lurarne.
15 ౧౫ అప్పుడు యూదా వారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరొబాము, ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుటా యూదావారి ఎదుటా నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బ తీశాడు.
Og Juda-mennerne sette i med herrop. Og då Juda-mennerne sette i med herropet, då slo Gud Jeroboam og heile Israel for augo på Abia og Juda.
16 ౧౬ ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించాడు.
Israels-sønerne rømde for Juda, og Gud gav deim i deira vald.
17 ౧౭ కాబట్టి అబీయా, అతని ప్రజలు వారిని ఘోరంగా హతమార్చారు. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది యుద్ధ వీరులు చనిపోయారు.
Og Abia og folket hans gjorde stort tjon på deim, so det fall fem hundrad tusund stridsmenner av Israel.
18 ౧౮ ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు.
På den tid vart Israels-sønerne audmjukte, men Juda-mennerne kom til magt, for dei studde seg til Herren, sin fedregud.
19 ౧౯ అబీయా యరొబామును తరిమి, బేతేలునూ దాని గ్రామాలనూ యెషానానూ దాని గ్రామాలనూ ఎఫ్రోనునూ దాని గ్రామాలనూ పట్టుకున్నాడు.
Og Abia forfylgde Jeroboam og tok ifrå honom nokre byar; det var Betel og grenderne kringum, Jesana og grenderne kringum og Efron og grenderne kringum.
20 ౨౦ అబీయా జీవించి ఉన్న కాలంలో యరొబాము మళ్ళీ బలపడలేదు, యెహోవా అతణ్ణి దెబ్బ తీయడం వలన అతడు చనిపోయాడు.
Jeroboam kom aldri til magt meir so lenge Abia livde, og Herren slo honom, so han døydde.
21 ౨౧ అబీయా అభివృద్ధి చెందాడు. అతనికి 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు.
Men Abia vart megtig. Han tok seg fire konor og vart far til tvo og tjugeto søner og sekstan døtter.
22 ౨౨ అబీయా చేసిన ఇతర కార్యాల గురించీ అతని నడవడి, అతని మాటలను గురించీ అతని కాలంలో జరిగిన సంగతుల గురించీ ప్రవక్త ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో రాసి వుంది.
Det som elles er å fortelja um Abia, um hans ferd og ord, er uppskrive i utleggjingi åt profeten Iddo.