< 1 తిమోతికి 1 >

1 విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు.
PAULUJ wanporon en Iejuj Krijtuj amen pan kujoned en Kot Jaunkamaur patail o Krijtuj Iejuj, me kitail kaporoporeki,
2 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
On Timoteuj nai jeri melel ni pojon mak o limpok, o popol jan ren Kot Jam o Krijtuj Iejuj atail Kaun.
3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి.
Duen ai poeki re om, en mimieta Epijuj ni ai pan kola Majetonien, pwe koe en kapun on akai, ren der wia padak toror.
4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు.
Pil der kamelele kajoi mal o padok en di to to, me kareda Akamai ap jota jauja koa dodok en Kot, me tapi jan pojon.
5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.
Pwe aude pan kujoned limpok jan nan monion makelekel, o injen mau, o pojon melel.
6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు.
Jan mepukat akai muei janer, rap wuki on poupoulap.
7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.
Re men wiala jaunpadak en kapun, ap jo weweki, me re inda, o me re kin men padaki kaualap.
8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
A kitail aja, kapun me mau, ma amen jo kajapune.
9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ
O je aja, me jota kapun en wiaui on me pun amen, a on me japun kan, o katiwo kan, o me doo jan Kot akan, o me dipan akan, o me jo jaraui kan, o me jan Kot akan, o me kin kaloke jam ar in ar, o me kamela aramaj akan.
10 ౧౦ వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.
O me nenek kan, o me madon jaut on ol oko, o me kin pirap aramaj akan, o me likam kan, o me kaula likam akan, o ma pil meakot mia, me jo kon on padak en kamour.
11 ౧౧ ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
Duen ronamau en linan en Kot iajanai me pan don ia.
12 ౧౨ నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి.
I ap danke Krijtuj Iejuj atail Kaun, me kotin kamane ia da o kamelel ia ni a kotin kajapwil ia dan dodok.
13 ౧౩ అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను.
pwe maj o nai lalaue amen, o kaloke jaulan kan, ao lolap amen, ari jo I diaradar mak o, pwe I wiadar mepukat ap jaja o ni ai jopojon.
14 ౧౪ మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు.
A mak en atail Kaun me lapalap alar kaualap ni pojon o limpok, me mi reh Krijtuj.
15 ౧౫ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.
Melel lepen kajoi lep, o me mau on kamelele: Krijtuj Iejuj pwara don jappa, pwen dorela me dipan akan; a nai me jued jan karoj.
16 ౧౬ అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. (aiōnios g166)
Ari jo, I diaradar mak o, pwe Iejuj Krijtuj en kotin kajaleda a kanonama lapalap re i, pwe men kaalemoni on me pan pojon, pwen maur joutuk. (aiōnios g166)
17 ౧౭ అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌. (aiōn g165)
A nanmarki potpot, me jo kak mor pajan, o jo janjal, I Kot eta. Wau o linan en ko on I potopoteta! Amen. (aiōn g165)
18 ౧౮ తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు.
Kujoned wet I men pan on uk, nai jeri Timoteuj, duen deideikop akan, me wiaui on uk er, pwe ren jauaju uk, en wia pei mau eu.
19 ౧౯ అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.
Ni om dadauata pojon o kanakanai on injen om mau, me akai pein kaje jan irail, ap peila jan nin pojon.
20 ౨౦ వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.
Amen irail Imenauj o amen Alekjander, me panalan Jatan, pwe ren lelapok ki kalokolok, ap jolar lalaue.

< 1 తిమోతికి 1 >