< 1 తిమోతికి 5 >

1 వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
Старца не карај, него му говори као оцу; момцима као браћи;
2 యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
Старицама као матерама; младима као сестрама, са сваком чистотом.
3 నిజమైన వితంతువులను గౌరవించు.
Удовице поштуј, које су праве удовице.
4 అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.
Ако ли која удовица има децу или унучад, да се уче најпре свој дом поштовати, и зајам враћати родитељима; јер је ово угодно пред Богом.
5 నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.
А права удовица и усамљена узда се у Бога, и живи у молитвама и у мољењу дан и ноћ.
6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.
А која живи у сладостима, жива је умрла.
7 వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.
И ово заповедај, да буду без мане.
8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
Ако ли ко за своје, а особито за домаће, не промишља, одрекао се вере, и гори је од незнабошца.
9 అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి.
А удовица да се не прима млађа од шездесет година, и која је била једном мужу жена;
10 ౧౦ ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
И која има сведочанство у добрим делима, ако је децу одгајила, ако је гостољубива била, ако је светима ноге прала, ако је невољнима помагала, ако је ишла за сваким добрим делом.
11 ౧౧ పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
А младих удовица прођи се; јер кад побесне против Христа, хоће да се удају,
12 ౧౨ ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.
И имају грех што прву веру одбацише.
13 ౧౩ వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
А к томе и беспослене уче се скитати по кућама, не само пак беспослене, него и језичне и свезнале, па говоре шта не треба.
14 ౧౪ కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
Хоћу, дакле, да се младе удовице удају, децу рађају, кућу куће, а никакав узрок да не дају противнику за хуљење.
15 ౧౫ ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.
Јер се, ево, неке окренуше за сотоном.
16 ౧౬ ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.
Ако који верни или верна има удовице, нека се стара за њих, и да не досађују цркви да оне које су праве удовице може задовољити.
17 ౧౭ చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
А свештеницима који се добро старају да се даје двогуба част, а особито онима који се труде у речи и у науци.
18 ౧౮ ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.
Јер писмо говори: Волу који врше не завезуј уста, и: Радин је достојан своје плате.
19 ౧౯ ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.
На свештеника не примај тужбе, осим кад имају два или три сведока.
20 ౨౦ మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.
А који греше покарај их пред свима, да и други имају страх.
21 ౨౧ విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
Заклињем те пред Богом и Господом Исусом Христом и изабраним Његовим анђелима да ово држиш без лицемерја, не чинећи ништа по хатеру.
22 ౨౨ ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
Руку одмах не мећи ни на кога, нити пристај у туђе грехе. Држи себе чиста.
23 ౨౩ ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
Више не пиј воде, него пиј по мало вина, желуца ради свог и честих својих болести.
24 ౨౪ కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.
А неких су људи греси познати који напред воде на суд, а неких иду за њима.
25 ౨౫ అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.
Тако су и добра дела позната, и која су другачија не могу се сакрити.

< 1 తిమోతికి 5 >