< 1 తిమోతికి 5 >
1 ౧ వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
Da nanbi k manboli mani o jakpelo, ama ya pa andi u pali, nani biba yeni; ya paandi u nupaɔngu pala nani i nataani yeni.
2 ౨ యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
A puociana nani binaa nba yen, b puobidi nani t ninsiaba yeni, l papielem
3 ౩ నిజమైన వితంతువులను గౌరవించు.
Seln a pakuana yaab n ŋanbi k tie pakuana.
4 ౪ అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.
L ya tie k l pakuali pia t bidi lan yaka a yabila ban ñigni k ya pia t ŋandi b diogun, k gɔ ya tiendi b danba ban tund b yaali, k l ma l ŋani u tienu po
5 ౫ నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.
Yua tie pakual yeni mɔni, k tie yuan cuo li ba k ta u dindanlik cabi u Tienu k gɔ jaandi, k miadi u tiensugli yieni yen ñiɔgu.
6 ౬ అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.
Ama ya pakualo n kpaani dulña ne yenyienu kpe'u ba l ya tie ku fuo.
7 ౭ వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.
Tund'ba mani l bona k ban ji da pia jalgi ba.
8 ౮ ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
L ya tie k yua k nanbi k ŋanbi k ŋmagdi o nibi yaabi ŋanbi k tie u diogun ya yaabi, biani u mɔmɔnigaama, yu k bani u Tienu yaali su yen'o.
9 ౯ అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి.
K fidi ban yini pua k u tie pakualo wan mɔndik ya pia bina piiluobo k ya tie yua n den kunni ja yendo baba.
10 ౧౦ ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
K yua kul ya bani k u tuona den ŋani k den wlubi tu bidi, k den gaani b canba, k den ŋuudi b nuŋanba taana, k den todi b cicagdanba, k den tiendi tuoŋan buoli kul
11 ౧౧ పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
Ama ŋan yie t pakuabidi, k l ma ya yognu k u ja nianga paadi yenba yen Jesu b ji yi kpaani ban guani k kunni b jabi
12 ౧౨ ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.
K ji k cɔlni b cincin-puoni yaali k b den puoni Jesu yeni
13 ౧౩ వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
K baa ji pia tuonli ba yeni, b ji waa yiegi a ñiana ni. L gɔ k tie k b waa fanm - fanma mɔ ka b waa yeni t mayiyuodi yen i tuali, k maadi ya maama k laba.
14 ౧౪ కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
L po n cedi k n bua ya pakua bidi n da k kunni b jaba, k ban guani k kunnib jabak mali t bidi, k ŋanbi k kub'ba a dioguni, k da ŋa t ninnanda ya sugdi'ti.
15 ౧౫ ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.
k l ma pakɔtianba ŋa a sanu yo k ji ŋodi staanni
16 ౧౬ ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.
Kreso-yua diogun ya pia a pakuana wani n ji baa tod' ba k lan fidiyaali lan ji da tie tugkpiegli u jaandiogu po, k wani mɔndi fid k todi yaab nanbi k tie pakuana.
17 ౧౭ చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
Ya jaandiog liig yaaba nanbi k suani b tuonli k l ŋani b dagdi yeni ban ŋanbi k la b tuonlsel bonŋanli. l nam ŋanbi k nua yaab n tundib niba u Tienu maama
18 ౧౮ ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.
kl ma u Tienu Kadaɔgu yedi: ya nua taand' a ka pua i dii, a ji kan pibin u ñɔbu. k l tuonsɔnli dagidi yeni wan ga u tuonsɔn- ŋmapaɔgu.
19 ౧౯ ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.
Nul ya ba yeni u jaandiogliig yua maama, ŋan da gaa, l ya k tie b lie, b ta yaa ka
20 ౨౦ మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.
Yaab tundi k biidi nan fu yeb'ba b lieb kul nungn k yaab sieni n ji ya jie.
21 ౨౧ విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
n maad'a hal u tienu ne po, hal Yesu kreso po, yeni u tienu malek po, ya cɔnlni min yed'a uaal ne kul, k ba lugdm ba n da ye i siign.
22 ౨౨ ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
Da yi peli k maandi a nugi nul po, k gɔ da kuandi a nugu nutano biidn. Fin mɔno, Cuo a. ba k ya ye t ŋandin
23 ౨౩ ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
Da ñu miñima baba ka. A ya yi tieni nan nu o damɔngu mɔ waama k lan ya ŋanbdi a tugun k dugni a tugyianu yen po.
24 ౨౪ కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.
B tianb ya biidi k wuo b wlaama ba k b da buni b buudi mɔno. Ama b tianba yaali yi waagi yo ban t fioli bandi.
25 ౨౫ అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.
Nani a tuon ŋama n k kluo yeni l gɔ tie yeni k t tuon biidi mɔ kan fidi k wuo ni.