< 1 తిమోతికి 2 >

1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
Molim dakle prije svega da se èine iskanja, molitve, moljenja, zahvaljivanja za sve ljude,
2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
Za careve, i za sve koji su u vlasti, da tihi i mirni život poživimo u svakoj pobožnosti i poštenju.
3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది.
Jer je ovo dobro i prijatno pred spasiteljem našijem Bogom,
4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
Koji hoæe da se svi ljudi spasu, i da doðu u poznanje istine.
5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
Jer je jedan Bog, i jedan posrednik Boga i ljudi, èovjek Hristos Isus,
6 ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
Koji sebe dade u otkup za sve, za svjedoèanstvo u svoje vrijeme,
7 దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
Za koje sam postavljen propovjednik i apostol istinu govorim u Hristu, ne lažem uèitelj neznabožaca, u vjeri i istini.
8 అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
Hoæu dakle da molitve èine ljudi na svakome mjestu, podižuæi svete ruke bez gnjeva i premišljanja.
9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
Tako i žene u pristojnom odijelu, sa stidom i poštenjem da ukrašuju sebe, ne pletenicama, ni zlatom, ili biserom, ili haljinama skupocjenima,
10 ౧౦ భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
Nego dobrijem djelima kao što se pristoji ženama koje se obeæavaju pobožnosti.
11 ౧౧ స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
Žena na miru da se uèi sa svakom pokornošæu.
12 ౧౨ ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.
Ali ženi ne dopuštam da uèi niti da vlada mužem, nego da bude mirna.
13 ౧౩ ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
Jer je Adam najprije sazdan pa onda Eva;
14 ౧౪ ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.
I Adam se ne prevari, a žena prevarivši se postade prestupnica;
15 ౧౫ అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.
Ali æe se spasti raðanjem djece, ako ostane u vjeri i ljubavi i u svetinji s poštenjem.

< 1 తిమోతికి 2 >