< 1 థెస్సలొనీకయులకు 5 >

1 సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు.
Bet par tiem laikiem un brīžiem, brāļi, nevajag jums rakstīt.
2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు.
Jo jūs paši it labi zināt, ka Tā Kunga diena nāks tāpat kā zaglis naktī.
3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
Jo kad tie sacīs: miers ir un drošība, tad tā samaitāšana piepeši nāks pār tiem, kā bērnu sāpes pār grūtu sievu, un tie neizbēgs.
4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు.
Bet jūs, brāļi, neesiet iekš tumsības, ka šī diena kā zaglis jūs sagrābj.
5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు.
Jūs visi esat gaismas bērni un dienas bērni; mēs neesam ne nakts ne tumsības bērni.
6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.
Tad nu lai mēs neguļam, tā kā tie citi, bet lai esam nomodā un skaidrā prātā.
7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు.
Jo tie, kas guļ, guļ naktī; un kas piedzeras, tie piedzeras naktī.
8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
Bet mums, kas esam dienas bērni, būs skaidrā prātā būt un apvilkt ticības un mīlestības bruņas un par bruņu cepuri pestīšanas cerību.
9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.
Jo Dievs mūs nav nolicis uz dusmību, bet uz mūžīgas dzīvības panākšanu caur mūsu Kungu Jēzu Kristu,
10 ౧౦ మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.
Kas par mums ir miris, ka mums, vai esam nomodā, vai aizmiguši, līdz ar Viņu būs dzīvot.
11 ౧౧ కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
Tāpēc pamācāties savā starpā un uztaisiet cits citu, tā kā arī jau darāt.
12 ౧౨ సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి.
Bet mēs jūs lūdzam, brāļi, ka jūs tos atzīstat, kas jūsu starpā strādā, un savus priekšniekus iekš Tā Kunga, un kas jūs pamāca.
13 ౧౩ వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
Un turat tos jo vairāk mīļus viņu darba dēļ; turat mieru savā starpā.
14 ౧౪ సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
Bet mēs jūs lūdzam, brāļi, pamāciet netiklos, ieprieciniet bailīgos, panesiet vājos, esiet lēnprātīgi pret visiem.
15 ౧౫ ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
Pielūkojiet, ka neviens nevienam neatmaksā ļaunu ar ļaunu, bet arvien dzenaties uz labu, tā savā starpā, kā pret visiem.
16 ౧౬ ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
Priecājaties vienmēr.
17 ౧౭ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
Lūdziet Dievu bez mitēšanās.
18 ౧౮ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
Pateicieties Dievam visās lietās: jo tas ir Dieva prāts iekš Kristus Jēzus pie jums.
19 ౧౯ దేవుని ఆత్మను ఆర్పవద్దు.
Nenoslāpējiet to Garu.
20 ౨౦ ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Nenicinājiet praviešu mācības.
21 ౨౧ అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
Pārbaudiet visu; to, kas labs, paturiet.
22 ౨౨ ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
Atraujaties no visa, kas liekās ļauns.
23 ౨౩ శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
Bet pats tas miera Dievs lai jūs svētī caur caurim, un viss jūsu gars un dvēsele un miesa lai bezvainīgi top pasargāti uz mūsu Kunga Jēzus Kristus atnākšanu.
24 ౨౪ మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.
Uzticīgs ir Tas, kas jūs aicina, - Tas to arī darīs.
25 ౨౫ సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి.
Brāļi, lūdziet par mums.
26 ౨౬ పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.
Sveicinājiet visus brāļus ar svētu skūpstīšanu.
27 ౨౭ సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను.
Es jums piekodināju no Dieva puses, lai šī grāmata top lasīta priekš visiem svētiem brāļiem.
28 ౨౮ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!
Mūsu Kunga Jēzus Kristus žēlastība lai ir ar jums. Āmen.

< 1 థెస్సలొనీకయులకు 5 >