< 1 థెస్సలొనీకయులకు 5 >
1 ౧ సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు.
But, concerning the times and the seasons, brethren, —ye have, no need, that, unto you, anything be written;
2 ౨ రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు.
For, ye yourselves, perfectly well know—that, the day of the Lord, as a thief in the night, so, cometh;
3 ౩ ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
As soon as they begin to say—Peace! and safety! then, suddenly, upon them, cometh destruction, —just as the birth-throe unto her that is with child, —and in nowise shall they escape.
4 ౪ సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు.
But, ye, brethren, are not in darkness, that, the day, upon you, as upon thieves, should lay hold;
5 ౫ మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు.
For, all ye, are, sons of light, and sons of day, —we are not of night, nor of darkness:
6 ౬ కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.
Hence, then, let us not be sleeping, as the rest, but let us watch and be sober: —
7 ౭ నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు.
For, they that sleep, by night, do sleep, and, they that drink, by night, do drink: —
8 ౮ విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
But, we, being of the day, let us be sober, putting on a breastplate of faith and love, and, for helmet, the hope of salvation.
9 ౯ ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.
Because God did not appoint us unto anger, but unto acquiring salvation through our Lord Jesus [Christ]: —
10 ౧౦ మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.
Who died for us, in order that, whether we be watching or sleeping, together with him, we should live.
11 ౧౧ కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
Wherefore be consoling one another, and building up, each the other, —even as ye are also doing.
12 ౧౨ సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి.
Now we request you, brethren, —to know them who are toiling among you, and presiding over you, in the Lord, and admonishing you;
13 ౧౩ వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
And to hold them in very high esteem, in love, their work’s sake. Be at peace among yourselves,
14 ౧౪ సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
But we exhort you, brethren—admonish the disorderly, soothe them of little soul, help the weak, be longsuffering towards all:
15 ౧౫ ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
See that none, evil for evil, unto any, do render: but, evermore, what is good, be pursuing, towards one another, and towards all:
16 ౧౬ ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
Evermore, rejoice,
17 ౧౭ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
Unceasingly, pray,
18 ౧౮ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
In everything, give thanks, —for, this, is a thing willed of God, in Christ Jesus, towards you:
19 ౧౯ దేవుని ఆత్మను ఆర్పవద్దు.
The Spirit, do not quench,
20 ౨౦ ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Prophesyings, do not despise,
21 ౨౧ అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
[But], all things, put to the proof—what is comely, hold ye fast:
22 ౨౨ ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
From every form of wickedness, abstain.
23 ౨౩ శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
But, the God of peace himself, hallow you completely, and, entire, might your spirit, and soul, and body, —[so as to be] unblameable in the Presence of our Lord Jesus Christ, —be preserved!
24 ౨౪ మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.
Faithful, is he that is calling you, —who, also will perform.
25 ౨౫ సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి.
Brethren! be praying for us [also].
26 ౨౬ పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.
Salute all the brethren with a holy kiss.
27 ౨౭ సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను.
I adjure you, by the Lord, that the letter be read unto all the brethren!
28 ౨౮ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!
The favour of our Lord Jesus Christ, be with you.