< 1 థెస్సలొనీకయులకు 4 >

1 చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు.
Okokucina bazalwane, salifundisa ukuba liphile njani ukuze limthokozise uNkulunkulu njengoba impela liphila. Siyalicela njalo silincenga ngeNkosi uJesu ukuba lokhu likwenze kokuphela.
2 మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము.
Liyayazi imilayo esalinika yona ngokulaya kweNkosi uJesu.
3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.
Kuyintando kaNkulunkulu ukuba libengcwele: ukuba lixwaye ukuhlobonga;
4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా
ukuba omunye lomunye wenu afunde ukuthiba umzimba wakhe ngendlela engcwele lehloniphekayo
5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం.
hatshi ngomfutho wenkanuko njengabezizweni abangamaziyo uNkulunkulu.
6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు.
Njalo kulokhu akukho okumele onele umzalwane wakhe kumbe amzuzele khonapho ekuthini ngumzalwane. INkosi izabajezisa bonke abenza izono ezinje njengoba sesavela salitshela njalo salixwayisa ngazo.
7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
Ngoba uNkulunkulu kasibizelanga ukuba sibe ngabangcolileyo kodwa ukuba siphile impilo engcwele.
8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు.
Ngakho-ke, lowo owalayo umlayo lo kalimuntu kodwa uNkulunkulu, yena olinika uMoya wakhe oNgcwele.
9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు.
Mayelana lothando lobuzalwane, akudingeki ukuba sililobele ngoba lina uqobo lafundiswa nguNkulunkulu ukuba lithandane.
10 ౧౦ అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
Njalo ngempela, liyabathanda abazalwane bonke kulolonke elaseMasedoniya. Kodwa siyalincenga bazalwane ukuthi lenzenjalo kokuphela.
11 ౧౧ సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
Akube yisifiso senu ukuphila impilo yokuthula lokukhathalela umsebenzi wenu kanye lokusebenza ngezandla zenu njengoba salitshela
12 ౧౨
ukuze ukuphila kwenu kwansukuzonke kubukwe ngabangaphandle njalo lingathembeli komunye umuntu.
13 ౧౩ సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు.
Bazalwane, kasifuni ukuba libe ngabangaziyo ngalabo abalalayo loba lidabuke njengabanye abantu abangelalo ithemba.
14 ౧౪ యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
Siyakholwa ukuthi uJesu wafa wabuya wavuka njalo ngalokho siyakholwa ukuthi uNkulunkulu uzabavusa kanye loJesu labo asebelele kuye.
15 ౧౫ మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము.
Ngelizwi leNkosi siyalitshela ukuthi thina esisaphila, esasalayo iNkosi ize ifike, kasiyikubaqalela impela labo asebelele.
16 ౧౬ ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
Ngoba iNkosi uqobo izakwehla ivela ezulwini ngelizwi elikhulu, ngelizwi lengilosi enkulu langokumemeza kwecilongo likaNkulunkulu, kuthi abafileyo kuKhristu bavuke kuqala.
17 ౧౭ ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
Emva kwalokho, thina esisaphila njalo sisele sizahlwithwa kanye labo emayezini ukuba sihlangabeze iNkosi emoyeni. Ngakho sizahlala leNkosi kuze kube nininini.
18 ౧౮ కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.
Ngakho-ke, khuthazanani ngala amazwi.

< 1 థెస్సలొనీకయులకు 4 >