< 1 థెస్సలొనీకయులకు 3 >
1 ౧ కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని
Když se mi po vás v Aténách stýskalo, rozhodl jsem se poslat Timotea, toho milého bratra a Božího spoluslužebníka. Měl vás navštívit a povzbudit vaši víru,
2 ౨ ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం.
3 ౩ ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.
abyste v pronásledování nezakolísali.
4 ౪ మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది.
Trpět patří ke křesťanskému údělu; to jsme vám přece říkali už od začátku, a tak nebuďte překvapeni, když k tomu opravdu dochází.
5 ౫ అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
Proto jsem tehdy poslal Timotea k vám, abych se tu nemusel trápit úzkostí, jestli vás protivník přece jen nedostal na svou návnadu a nepřivedl všechnu naši práci vniveč.
6 ౬ ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి క్రీస్తు పట్ల మీ విశ్వాస ప్రేమలను గురించీ, మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.
Teď se však právě Timoteus vrátil s dobrými zprávami, že jste ve víře ani v lásce nepolevili, že na nás stále myslíte a toužíte po novém setkání stejně jako my.
7 ౭ అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం.
A tak nás při všech těch trampotách tady potěšily zprávy o vaší věrnosti Pánu. Vydržíme všechno, jen když víme, že s vaší vírou je vše v pořádku.
8 ౮ ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే.
9 ౯ మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం?
Jak se Bohu odvděčit za všechnu tu radost, jakou z vás máme?
10 ౧౦ మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం
Dnem i nocí vroucně prosíme, abychom vás mohli znovu spatřit a podle potřeby upevnit vaši víru.
11 ౧౧ మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
Přejeme si, aby nám Bůh, náš Otec, a Ježíš, náš Pán, připravili cestu k vám!
12 ౧౨ మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక.
Ať dá bohatě růst vaší lásce navzájem i navenek, stejně jako naší lásce k vám.
13 ౧౩ మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!
Ať vás vnitřně posílí, abyste se mohli bezúhonní a dokonalí postavit před Boha, našeho Otce, až se náš Pán, Ježíš Kristus, vrátí se všemi svými.