< సమూయేలు~ మొదటి~ గ్రంథము 9 >
1 ౧ బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా.
HOOKAHI kanaka no ka Beniamina, o Kisa kona inoa, ke keiki a Abiela, ke keiki a Zerora, ke keiki a Bekorata, ke keiki a Apia, no Beniamina, he kanaka waiwai nui.
2 ౨ కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు.
He keiki kana, o Saula kona inoa, he opiopio a maikai: aohe kanaka maikai iwaena o na mamo a Iseraela e like ana me ia: mai kona poohiwi aku a hala loa iluna, ka oi ana o kona kiekie mamua o ko na kanaka a pau.
3 ౩ సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు.
Ua nalowale na hoki a Kisa, ka makuakane o Saula; i aku la o Kisa i kana keiki, ia Saula, E lawe oe i kekahi kauwa me oe, a hele e imi i na hoki.
4 ౪ అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి షాలిషా దేశంలో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు.
Kaahele no ia ma ka mauna o Eperaima, a kaahele hoi ma ka aina o Salisa, aole i loaa ia laua; alaila kaahele laua ma ka aina o Salima, aole malaila; hele aku la ia ma ka aina o ka Beniamina, aole i loaa ia laua.
5 ౫ అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు “మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు” అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు,
A hiki aku la laua ma ka aina o Zupa, i aku la ia i kana kauwa me ia, Ea, e hoi kaua, o pau auanei ka manao ana o kuu makuakane i na hoki, a hookaumahaia no kaua.
6 ౬ వాడు “ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి” అని చెప్పాడు.
I mai la kela ia ia, Aia hoi, ma keia kulanakauhale e noho ana kekahi kanaka o ke Akua, he kanaka kaulana: a o ka mea a pau ana e olelo ai, e ko io no ia: e nele kaua malaila, malama e hiki ia ia ke kuhikuhi mai ia kaua i ke ala e pono ai kaua ke hele.
7 ౭ అప్పుడు సౌలు “మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?” అని తన పనివాణ్ణి అడిగాడు.
I aku la o Saula i kana kauwa, Ina paha e hele kaua, heaha ka kaua e lawe aku ai i ua kanaka la? No ka mea, ua pau ka berena maloko o ko kaua ipu, aole he manawalea e lawe aku i ua kanaka la o ke Akua: heaha ka mea ia kaua?
8 ౮ వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.
Olelo hou mai la ke kauwa ia Saula, i mai la, Eia ma kuu lima ka hapaha o ke sekela kala; o keia ka'u e haawi aku ai i ua kanaka la o ke Akua, i kuhikuhi mai ai ia i ke ala o kaua.
9 ౯ ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో “మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి” అని చెప్పుకోవడం పరిపాటి.
(I ka manawa mamua iloko o ka Iseraela, a i hele ke kanaka e ninau i ke Akua, peneia ia i olelo ai, Ina kakou e hele i ka mea ike; no ka mea, o ke kaula i keia manawa, ua kapaia oia mamua, he mea ike.)
10 ౧౦ అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు.
I aku la o Saula i kana kauwa, Ua pono kau olelo; ina kaua e hele aku: a hele aku la laua i ke kulanakauhale, i kahi o ke kanaka o ke Akua.
11 ౧౧ వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని అడిగారు.
A i ka laua pii ana i ke kulanakauhale, loaa ia laua na kaikamahine e hele ana e huki wai, i aku la ia lakou, Maanei anei ke kanaka ike?
12 ౧౨ అందుకు వారు “ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈ రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈ రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు.
Olelo mai la lakou ia laua, i mai la, Maanei no: aia hoi ia mamua ou, e wikiwiki, no ka mea, i hele mai ia i ke kulanakauhale i keia la; no ka mea, he ahaaina na na kanaka i keia la ma kahi kiekie.
13 ౧౩ మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లక ముందే మీరు అతణ్ణి కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకూ ప్రజలు భోజనం చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతణ్ణి కలుసుకోడానికి ఇదే సరైన సమయం.” అని చెప్పారు.
A hiki aku olua maloko o ke kulanakauhale, e loaa koke oia ia olua, mamua o kona pii ana ae ma kahi kiekie e ai ai; aole e ai na kanaka a hiki aku ia; no ka mea, nana no e hoomaikai aku i ka ahaaina, a mahope iho, ai no ka poe i oleloia. No ia mea, e pii olua; no ka mea, eia ka la e loaa'i ia olua ia.
14 ౧౪ వారు ఊళ్లోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు.
A pii aku la laua i ke kulanakauhale: a hiki laua iloko o ke kulanakauhale, aia hoi, halawai laua me Samuela e pii ana ma kahi kiekie.
15 ౧౫ సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు.
Ua olelo e mai o Iehova i ka pepeiao o Samuela i ka la mamua o ko Saula hiki ana mai, i mai la,
16 ౧౬ ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”
Apopo ma keia manawa, e hoouna aku au i ou la i kekahi kanaka no ka aina o ka Beniamina, a e poni aku oe ia ia i alii maluna o kuu poe kanaka o ka Iseraela, i hoopakele mai ai ia i ko'u poe kanaka mai ka lima mai o ko Pilisetia: ua nana aku au i ko'u poe kanaka, no ka mea, ua hiki mai ko lakou uwe ana io'u nei.
17 ౧౭ సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు.
A ike aku la o Samuela ia Saula, olelo mai la o Iehova ia ia, Eia ke kanaka a'u i olelo ai ia oe; oia ka mea e alii ai maluna o kuu poe kanaka.
18 ౧౮ సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు,
Hookokoke aku la o Saula ia Samuela ma ka ipuka pa, i aku la, Ke noi aku nei au ia oe, e hai mai oe ia'u i ka hale o ka mea ike.
19 ౧౯ సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.
Olelo mai la o Samuela ia Saula, i mai la, Owau no ka mea ike; e pii ae oe mamua o'u i kahi kiekie: no ka mea, e ai pu olua me au i keia la; apopo e kuu aku au ia oe, a e hai aku au i na mea a pau maloko o kou naau.
20 ౨౦ మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరి పైన ఉంది? నీపైనా, నీ తండ్రి సంతానం పైనే కదా” అన్నాడు.
A no kau mau hoki i nalowale i na la ekolu ae nei, mai manao oe ia lakou, no ka mea, ua loaa lakou. Maluna owai anei ka makemake a pau o ka Iseraela? Aole anei maluna ou, a me ko ka hale a pau o kou makuakane?
21 ౨౧ అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు.
Olelo aku la o Saula, i aku la, Aole anei wau no ka Beniamina, no ka mea uuku o na hanauna a pau o ka Iseraela? a o kuu ohana ka mea uuku o na ohana a pau o ka Beniamina? no ke aha la oe i olelo mai ai ia'u pela?
22 ౨౨ అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి
Lawe aku la o Samuela ia Saula a me kana kauwa, alakai ia laua maloko o ke keena ai, a hoonoho ia laua ma kahi maikai iwaena o ka poe i oleloia, he kanakolu paha lakou.
23 ౨౩ వంటవాణ్ణి చూసి “నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా” అని చెప్పినప్పుడు,
Olelo aku la o Samuela i ke kahu ai, E lawe mai i kahi a'u i haawi aku ai ia oe, i ka mea a'u i olelo ai ia oe, E waiho ia me oe.
24 ౨౪ అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. “చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు.
Lawe ae la ke kahu ai i ka uha mua, a me ka mea maluna, a waiho imua o Saula. I aku la o [Samuela, ] Aia hoi o ke koena, e waiho ia imua ou, a e ai oe; no ka mea, ua hookaawale ia mea nau no ka manawa a'u i olelo ai, ua kahea aku au i na kanaka. A ai pu iho la o Saula me Samuela ia la.
25 ౨౫ పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు.
A iho mai lakou mai kahi kiekie mai a i ke kulanakauhale, kamailio pu oia me Saula maluna o ka hale.
26 ౨౬ తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు “నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా” అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి
Ala ae la lakou i kakahiaka nui; a i ka wanaao, kahea aku la o Samuela ia Saula maluna o ka hale, i aku la, E ala, a hoouna aku au ia oe. Ala mai o Saula, a hele aku la laua iwaho, oia a me Samuela.
27 ౨౭ ఊరి చివరకూ వస్తుండగా సమూయేలు సౌలుతో “నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసేవరకూ నువ్వు ఇక్కడే ఆగిపో” అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు.
A i ko laua iho ana ma ka mokuna o ke kulanakauhale, i aku la o Samuela ia Saula, E i aku oe i ke kauwa, e hele e aku ia mamua o kaua, (a hele aku la ia, ) aka, e ku malie oe i keia wa, i hoike aku ai au ia oe i ka olelo a ke Akua.