< సమూయేలు~ మొదటి~ గ్రంథము 6 >
1 ౧ యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది.
BAWIPA e thingkong teh Filistin ram dawk thapa yung sari touh ao hnukkhu,
2 ౨ ఫిలిష్తీయులు యాజకులనూ శకునం చూసేవారిని పిలిపించి “యెహోవా మందసాన్ని ఏం చేద్దాం? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకి పంపడానికి ఏమి చేయాలో చెప్పండి” అని అడిగారు. అందుకు వారు,
Filistinnaw ni vaihmanaw, profetnaw a kaw awh teh, BAWIPA e thingkong bangtelamaw ti han toung. Ama e hmuen koe bangtelamaw bout patoun han dei awh haw telah atipouh navah,
3 ౩ “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు. ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగి పోలేదో తెలుసుకుంటారు” అని జవాబిచ్చారు.
Ahnimouh ni Isarelnaw e Cathut thingkong hah bout na patawn awh pawiteh thingkong a madueng lahoi bout patawn awh hanh. Yon thuengnae hno hoi na patawn awh han. Hottelah pawiteh patawnae dam sak lah o han. Bangkong a kut na tahruet pouh hoeh tie na panue awh han atipouh.
4 ౪ ఫిలిష్తీయులు “మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి?” అని వారిని అడగగా వారు “మిమ్మలనూ మీ పెద్దలనూ పీడిస్తున్న తెగులు ఒక్కటే కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం ఐదు బంగారపు గడ్డల రూపాలు, ఐదు బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి.
Bang patet e kâtapoe thuengnae hno poe hane teh bangmaw. Ahnimouh ni Filistin bawi touk e yit touh, suimarang 5, suimoihnam 5, na patawn awh han. Nangmouh hoi nangmae siangpahrangnaw teh patawnae phun touh dueng lah ao dawkvah.
5 ౫ కాబట్టి మీకు వచ్చిన గడ్డలకూ భూమిని పాడు చేసే పందికొక్కులకూ సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారుచేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకూ మీ దేవుళ్ళకూ మీ భూమికీ కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు.
Marang mei kaphawk, nangmae ram ka raphoe moihnam meikaphawk na sak awh teh Isarelnaw e Cathut bawilennae hah na poe awh han. A kut teh nangmae ram hoi nangmae Cathut naw lathueng thoseh, nangmouh lathueng thoseh nangmae talai thoe seh, a pâhaw sak han.
6 ౬ ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకొన్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్ళనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు కదా.
Faro Siangpahrang hoi Izip miphunnaw lungpatanae e patetlah nangmae lungthin na pata sak a van. Ahnimae lathueng ka pataw poung lah lawk a ceng navah. Isarel miphunnaw ahnimouh ni a hlout sak awh teh, Isarel miphunnaw a tâco awh nahoehmaw.
7 ౭ కాబట్టి మీరు ఒక కొత్త బండి తయారు చేయించి, ఇంతవరకూ కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి, బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి,
Atuvah leng katha e buet touh sak awh nateh, leng lahuen dawk bang hoeh rae a ca ka cun e maito a manu kahni ta hah leng dawk kawm awh nateh takha thung pen awh.
8 ౮ యెహోవా మందసాన్ని ఆ బండిమీద పెట్టి, పరిహారంగా ఆయనకు చెల్లించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఆ బండి దాని దారిలో వెళ్ళేలా వదిలిపెట్టండి.
BAWIPA e thingkong hah lat awh nateh, leng dawkvah toung awh. Kâtapoe thuengnae hno hanelah na patawn e sui hnopainaw hah alouke thingkong thung e ateng vah hrueng awh nateh, tha awh nateh cet awh naseh.
9 ౯ అది బేత్షెమెషుకు వెళ్లే దారిలో ఈ దేశ సరిహద్దును దాటితే ఆయనే ఈ గొప్ప కీడు మనకు కలిగించాడని తెలుసుకోవచ్చు, ఆ దారిన వెళ్ళకపోతే ఆయన మనకి ఈ కీడు కలిగించలేదనీ, మన దురదృష్టం వల్లనే అది మనకు సంభవించిందనీ గ్రహించాలి” అన్నారు.
Thingkong teh amamae ram lah a ceinae lam Bethshemesh kho totouh, kâbang pawiteh hote Cathut ni hete runae kalenpounge hah maimouh dawk a pha sak toe. Hatei cet hoehpawiteh maimouh lathueng ka phat e kahawihoehe hno hah a ma ni a sak e nahoeh. Ama ngai pou ka phat e han doeh telah a ti.
10 ౧౦ ఆ విధంగా వారు రెండు పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంట్లో ఉంచి
Hottelah, taminaw ni a sak awh. Sanu ka pânet lahun e maito manu roi a ceikhai awh teh, leng dawk a kawm awh. A ca roi teh takha thung a pen pouh awh.
11 ౧౧ యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలూ పందికొక్కు రూపాలూ ఉన్న ఆ చిన్న పెట్టెను బండిమీద పెట్టారు.
BAWIPA thingkong hah leng van vah a thueng awh. Moihnam meikaphawk kaawm e thingkongnaw hai a thueng awh.
12 ౧౨ ఆ ఆవులు రహదారి వెంబడి సాఫీగా వెళ్తూ, రంకెలు వేస్తూ, బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బేత్షెమెషు సరిహద్దు వరకూ వెళ్లారు.
Maito roi teh Bethshemesh lam lah tuetue a cei teh, avoilah aranglah hai phen laipalah, lamthung pui dawk tuetue a parawng teh a cei. Filistin bawinaw ni Bethshemesh khori totouh a kâbang sin awh.
13 ౧౩ బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.
Bethshemesh khocanaw teh a yon dawk catunnaw a a awh teh, a khet awh navah, thingkong hah a hmu awh navah a lunghawi awh.
14 ౧౪ ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ అనే వాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
Leng teh Bethshemesh tami Joshua e law vah a kâen teh, kalenpounge lungsong aonae koe a kangdue. Hote leng thing hah a raboung awh teh maito manu roi hah BAWIPA koevah hmaisawi thuengnae lah a sak.
15 ౧౫ లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందికి దించి ఆ పెద్ద రాతిమీద పెట్టినప్పుడు ఆ రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు.
Levihnaw ni Bawipa thingkong teh aphu kaawm poung e sui onae thingkong hoi a la awh teh, lungsong van vah a hruek awh. Bethchemesh ni hote hnin dawkvah hmaisawi thuengnae hoi thuengnae hah BAWIPA koevah a poe awh.
16 ౧౬ ఫిలిష్తీయుల పెద్దలు ఐదుగురు జరిగినదంతా చూసి అదే రోజున ఎక్రోను చేరుకున్నారు.
Filistin bawi panga touh ni a khet awh hnukkhu hot hnin navah EKron kho lah a cei awh.
17 ౧౭ పరిహార అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమంటే, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను-ఈ ఐదు పట్టణాల ప్రజల కోసం ఒక్కొక్కటి.
BAWIPA koe yonthueng nahanelah Filistinnaw ni a patawn e (Tumor meikaphawk, moihnam meikaphawk) naw hah Asdod kho han buet touh, Gaza kho hanelah buet touh, Askelon hanelah buet touh. Gaza kho hanelah buet touh Ekron kho hanelah buet touh.
18 ౧౮ ప్రాకారాలు ఉన్న పట్టణాలు, పొలాల్లో ఉండే గ్రామాలవారు, ఫిలిష్తీయుల ఐదుగురు పెద్దల పట్టణాలు అన్నిటి లెక్క ప్రకారం బంగారపు పందికొక్కులను అర్పించారు. యెహోవా మందసాన్ని కిందికి దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యం. ఇప్పటివరకూ ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉంది.
Suimoihnam meikaphawknaw teh, Filistin bawi panga touh ni a tawn e khote totouh, khopui khote abuemlah hoi e doeh. BAWIPA e thingkong a hrueknae lungsong teh, Bethshemesh kho e Joshua e laikawk dawk sahnin ditouh ao rah.
19 ౧౯ బేత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 70 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు.
Bethshemesh khocanaw teh, BAWIPA e thingkong thung a khet awh dawkvah BAWIPa ni a rek teh tami 50000 touh hoi tami 70 touh a thei. BAWIPA ni taminaw moikapap a duesaknae hoi a reknae dawkvah ahnimouh a khuika awh.
20 ౨౦ అప్పుడు బేత్షెమెషు ప్రజలు “పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడి నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో” అనుకుని
Bethshemesh khocanaw ni kathoungpounge BAWIPA Cathut e hmalah apimaw ka kangdout thai han va. Maimouh koehoi api koe maw a cei han telah a ti.
21 ౨౧ కిర్యత్యారీము ప్రజల దగ్గరికి మనుషులను పంపించి “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి తీసుకు వచ్చారు, మీరు వచ్చి మీ దగ్గరకి దాన్ని తీసుకు వెళ్ళండి” అని కబురు పంపించారు.
Ahnimouh ni Kiriath Jearim khocanaw koevah patounenaw a patoun awh teh, Filistin taminaw ni BAWIPA e thingkong hah bout a patawn awh toe. Cet awh nateh namamouh koe cetkhai awh lawih telah atipouh.