< సమూయేలు~ మొదటి~ గ్రంథము 5 >

1 ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.
و فلسطینیان تابوت خدا را گرفته، آن را ازابن عزر به اشدود آوردند.۱
2 వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు.
و فلسطینیان تابوت خدا را گرفته، آن را به خانه داجون درآورده، نزدیک داجون گذاشتند.۲
3 అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు.
و بامدادان چون اشدودیان برخاستند، اینک داجون به حضور تابوت خداوند رو به زمین افتاده بود. وداجون را برداشته، باز در جایش برپا داشتند.۳
4 ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.
ودر فردای آن روز چون صبح برخاستند، اینک داجون به حضور تابوت خداوند رو به زمین افتاده، و سر داجون و دو دستش بر آستانه قطع شده، و تن داجون فقط از او باقی‌مانده بود.۴
5 అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు.
ازاین جهت کاهنان داجون و هر‌که داخل خانه داجون می‌شود تا امروز بر آستانه داجون دراشدود پا نمی گذرد.۵
6 యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు.
و دست خداوند بر اهل اشدود سنگین شده، ایشان را تباه ساخت و ایشان را هم اشدود و هم نواحی آن را به خراجها مبتلا ساخت.۶
7 అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు.
و چون مردان اشدود دیدند که چنین است گفتند تابوت خدای اسرائیل با ما نخواهد ماند، زیرا که دست او بر ما و بر خدای ما، داجون سنگین است.۷
8 కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని అడిగారు. అందుకు పెద్దలు “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు.
پس فرستاده، جمیع سروران فلسطینیان را نزد خودجمع کرده، گفتند: «با تابوت خدای اسرائیل چه کنیم؟» گفتند: «تابوت خدای اسرائیل به جت منتقل شود.» پس تابوت خدای اسرائیل را به آنجا بردند.۸
9 వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి.
و واقع شد بعد از نقل کردن آن که دست خداوند بر آن شهر به اضطراب بسیارعظیمی دراز شده، مردمان شهر را از خرد و بزرگ مبتلا ساخته، خراجها بر ایشان منتفخ شد.۹
10 ౧౦ వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు.
پس تابوت خدا را به عقرون بردند و به مجرد ورودتابوت خدا به عقرون، اهل عقرون فریاد کرده، گفتند: «تابوت خدای اسرائیل را نزد ما آوردند تاما را و قوم ما را بکشند.»۱۰
11 ౧౧ అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.
پس فرستاده، جیمع سروران فلسطینیان را جمع کرده، گفتند: «تابوت خدای اسرائیل را روانه کنید تا به‌جای خودبرگردد و ما را و قوم ما را نکشد زیرا که در تمام شهر هنگامه مهلک بود، و دست خدا در آنجابسیار سنگین شده بود.۱۱
12 ౧౨ చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.
و آنانی که نمردند به خراجها مبتلا شدند، و فریاد شهر تا به آسمان بالارفت.۱۲

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 5 >