< సమూయేలు~ మొదటి~ గ్రంథము 4 >
1 ౧ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు.
and to be word Samuel to/for all Israel and to come out: come Israel to/for to encounter: toward Philistine to/for battle and to camp upon [the] Ebenezer Ebenezer and Philistine to camp in/on/with Aphek
2 ౨ ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు.
and to arrange Philistine to/for to encounter: toward Israel and to leave [the] battle and to strike Israel to/for face: before Philistine and to smite in/on/with rank in/on/with land: country like/as four thousand man
3 ౩ ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు “యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది” అన్నారు.
and to come (in): come [the] people to(wards) [the] camp and to say old: elder Israel to/for what? to strike us LORD [the] day to/for face: before Philistine to take: bring to(wards) us from Shiloh [obj] ark covenant LORD and to come (in): come in/on/with entrails: among our and to save us from palm enemy our
4 ౪ కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.
and to send: depart [the] people Shiloh and to lift: bear from there [obj] ark covenant LORD Hosts to dwell [the] cherub and there two son: child Eli with ark covenant [the] God Hophni and Phinehas
5 ౫ యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు.
and to be like/as to come (in): come ark covenant LORD to(wards) [the] camp and to shout all Israel shout great: large and to make noise [the] land: country/planet
6 ౬ ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు.
and to hear: hear Philistine [obj] voice: sound [the] shout and to say what? voice: sound [the] shout [the] great: large [the] this in/on/with camp [the] Hebrew and to know for ark LORD to come (in): come to(wards) [the] camp
7 ౭ వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని “అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు,
and to fear [the] Philistine for to say to come (in): come God to(wards) [the] camp and to say woe! to/for us for not to be like/as this previously three days ago
8 ౮ అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా.
woe! to/for us who? to rescue us from hand: power [the] God [the] great [the] these these they(masc.) [the] God [the] to smite [obj] Egypt in/on/with all wound in/on/with wilderness
9 ౯ ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం” అని చెప్పుకున్నారు.
to strengthen: strengthen and to be to/for human Philistine lest to serve to/for Hebrew like/as as which to serve to/for you and to be to/for human and to fight
10 ౧౦ ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.
and to fight Philistine and to strike Israel and to flee man: anyone to/for tent: home his and to be [the] wound great: large much and to fall: kill from Israel thirty thousand on foot
11 ౧౧ శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.
and ark God to take: take and two son: child Eli to die Hophni and Phinehas
12 ౧౨ ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకొంటూ, చినిగిన బట్టలతో, తలంతా దుమ్ము కొట్టుకుపోయి షిలోహుకు వచ్చాడు.
and to run: run man Benjamin from [the] rank and to come (in): come Shiloh in/on/with day [the] he/she/it and garment his to tear and land: soil upon head his
13 ౧౩ అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.
and to come (in): come and behold Eli to dwell upon [the] throne: seat (hand: by *Q(K)*) way: road to watch for to be heart his trembling upon ark [the] God and [the] man to come (in): come to/for to tell in/on/with city and to cry out all [the] city
14 ౧౪ ఏలీ ఆ కేకలు విని “ఈ కేకల శబ్దం ఏమిటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు.
and to hear: hear Eli [obj] voice: sound [the] cry and to say what? voice: sound [the] crowd [the] this and [the] man to hasten and to come (in): come and to tell to/for Eli
15 ౧౫ అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
and Eli son: aged ninety and eight year and eye his to arise: establish and not be able to/for to see: see
16 ౧౬ ఆ వ్యక్తి “యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈ రోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను” అని ఏలీతో చెప్పాడు. ఏలీ “నాయనా, అక్కడ ఏమి జరిగింది?” అని అడిగాడు.
and to say [the] man to(wards) Eli I [the] to come (in): come from [the] rank and I from [the] rank to flee [the] day and to say what? to be [the] word: thing son: child my
17 ౧౭ అందుకు అతడు “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొఫ్నీ, ఫీనెహాసు అనే నీ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.
and to answer [the] to bear tidings and to say to flee Israel to/for face: before Philistine and also plague great: large to be in/on/with people and also two son: child your to die Hophni and Phinehas and ark [the] God to take: take
18 ౧౮ దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూల కాయుడు. అతడు నలభై ఏళ్లు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు.
and to be like/as to remember he [obj] ark [the] God and to fall: fall from upon [the] throne: seat backwards about/through/for hand: to [the] gate and to break neck his and to die for be old [the] man and heavy and he/she/it to judge [obj] Israel forty year
19 ౧౯ నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫీనెహాసు భార్య శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారనీ, తన మామ, భర్త చనిపోయారనీ విని, నొప్పులు ఎక్కువై మోకాళ్ల మీద కూలబడి అక్కడే ప్రసవించింది.
and daughter-in-law his woman: wife Phinehas pregnant to/for to beget and to hear: hear [obj] [the] tidings to(wards) to take: take ark [the] God and to die father-in-law her and man: husband her and to bow and to beget for to overturn upon her pang her
20 ౨౦ ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో “భయపడకు, నీకు కొడుకు పుట్టాడు” అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
and like/as time to die she and to speak: speak [the] to stand upon her not to fear for son: child to beget and not to answer and not to set: consider heart her
21 ౨౧ ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని “ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది.
and to call: call by to/for youth Ichabod Ichabod to/for to say to reveal: remove glory from Israel to(wards) to take: take ark [the] God and to(wards) father-in-law her and man: husband her
22 ౨౨ “శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని ఆమె అంది.
and to say to reveal: remove glory from Israel for to take: take ark [the] God