< సమూయేలు~ మొదటి~ గ్రంథము 28 >

1 ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి “నువ్వు, నీ మనుషులు నాతో కలసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో” అన్నాడు.
W tym czasie Filistyni zgromadzili swe wojska na wojnę, aby walczyć z Izraelem. Wtedy Akisz powiedział do Dawida: Na pewno wiesz, że razem ze mną wyruszysz na wojnę, ty i twoi ludzie.
2 దావీదు “నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు” అన్నాడు. ఆకీషు “ఆలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడుగా నియమించుకుంటాను” అన్నాడు.
Dawid odpowiedział Akiszowi: Sam się przekonasz, co uczyni twój sługa. Akisz powiedział do Dawida: Ustanowię więc ciebie stróżem swojej głowy na zawsze.
3 సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు.
A Samuel już umarł i opłakiwał go cały Izrael, i pogrzebali go w jego mieście, Rama. Saul zaś usunął czarowników i wróżbitów z ziemi.
4 ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు, సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవ లోయలో మకాం వేసారు.
Wtedy Filistyni zebrali się, nadciągnęli i rozbili obóz w Szunem. Saul również zgromadził cały Izrael i rozbił obóz w Gilboa.
5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని
A gdy Saul zobaczył obóz Filistynów, zląkł się i jego serce mocno zadrżało.
6 యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.
I Saul radził się PANA, lecz PAN mu nie odpowiedział ani przez sny, ani przez Urim, ani przez proroków.
7 అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు.
Saul zwrócił się więc do swoich sług: Poszukajcie mi kobiety czarownicy, a pójdę do niej i poradzę się jej. Jego słudzy odpowiedzieli mu: Oto jest w Endor kobieta czarownica.
8 సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు.
Wtedy Saul przebrał się, wkładając inne szaty, poszedł wraz z dwoma mężczyznami i przyszli do tej kobiety w nocy. I powiedział: Proszę cię, powróż mi przez ducha wieszczego, a wywołaj mi tego, kogo ci wymienię.
9 ఆ స్త్రీ, అలాగే “సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు” అని అతనితో అంది.
Lecz kobieta odpowiedziała mu: Ty wiesz, co uczynił Saul – że zgładził czarowników i wróżbitów z ziemi. Czemu zastawiasz sidła na moje życie, by wydać mnie na śmierć?
10 ౧౦ అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే,
Saul przysiągł jej na PANA: Jak żyje PAN, nie spadnie na ciebie żadna kara z tego powodu.
11 ౧౧ ఆ స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు.
Wtedy kobieta zapytała: Kogo mam ci wywołać? A on odpowiedział: Wywołaj mi Samuela.
12 ౧౨ ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి “నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు” అని సౌలును అడిగితే,
A gdy kobieta zobaczyła Samuela, krzyknęła głośno i powiedziała do Saula: Czemu mnie oszukałeś? Przecież ty jesteś Saul!
13 ౧౩ రాజు “నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు” అని ఆమెను అడిగితే “దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను” అని చెప్పింది.
Król powiedział do niej: Nie bój się. Cóż widziałaś? Kobieta odpowiedziała Saulowi: Widziałam bogów wstępujących z ziemi.
14 ౧౪ రాజు “అతడు ఏ రూపంలో ఉన్నాడు” అని అడిగాడు. ఆమె “దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు.
Pytał dalej: Jak wyglądał? Odpowiedziała: Wstępuje stary mężczyzna, a jest on ubrany w płaszcz. I Saul poznał, że to Samuel, schylił się twarzą do ziemi i pokłonił.
15 ౧౫ “నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు” అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు “నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను” అన్నాడు.
Samuel zaś powiedział do Saula: Dlaczego nie dajesz mi spokoju i wywołujesz mnie? Saul odpowiedział: Jestem w wielkim ucisku, gdyż Filistyni walczą ze mną, a Bóg odstąpił ode mnie i już nie odpowiada mi ani przez proroków, ani przez sny. Dlatego cię przyzwałem, abyś mi oznajmił, co mam czynić.
16 ౧౬ అప్పుడు సమూయేలు “యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి?
Samuel powiedział: Czemu więc mnie pytasz, skoro PAN odstąpił od ciebie i stał się twoim wrogiem?
17 ౧౭ యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు.
I PAN uczynił mu, jak zapowiedział przeze mnie: PAN wyrwał królestwo z twoich rąk i dał je twemu bliźniemu – Dawidowi.
18 ౧౮ యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈ రోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు.
Ponieważ nie byłeś posłuszny głosowi PANA ani nie wykonałeś jego srogiego gniewu nad Amalekiem, PAN tak ci dzisiaj uczynił.
19 ౧౯ యెహోవా నిన్నూ, ఇశ్రాయేలీయులనూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు, నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు” అని సౌలుతో చెప్పాడు.
Ponadto PAN wyda Izraela wraz z tobą w ręce Filistynów, a jutro ty i twoi synowie [będziecie] ze mną. PAN wyda również wojsko Izraela w ręce Filistynów.
20 ౨౦ సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు.
Saul natychmiast upadł jak długi na ziemię, bo bardzo się zląkł słów Samuela. Nie było w nim też siły, gdyż nic nie jadł przez cały dzień i całą noc.
21 ౨౧ అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు ఎంతో కలవరపడడం చూసి “నా యజమానీ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను” అని చెప్పింది.
Potem kobieta podeszła do Saula, a widząc, że bardzo się zląkł, powiedziała mu: Oto twoja służąca posłuchała twego głosu, naraziłam swoje życie i posłuchałam twoich słów, które mówiłeś do mnie.
22 ౨౨ ఇప్పుడు “నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు” అని అతనితో అంది.
Teraz więc posłuchaj i ty, proszę, głosu swojej służącej. Położę przed tobą kawałek chleba, abyś zjadł i posilił się, zanim wyruszysz w drogę.
23 ౨౩ అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు.
Lecz on wzbraniał się i mówił: Nie będę jadł. Jego słudzy zaś wraz z kobietą przymusili go. I posłuchał ich głosu, wstał z ziemi i usiadł na łóżku.
24 ౨౪ ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి
A ta kobieta miała w domu tuczne cielę. Pośpieszyła więc i zabiła je, potem wzięła mąkę, rozczyniła ją i upiekła z niej przaśniki.
25 ౨౫ తీసుకువచ్చి సౌలుకు, అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనం చేసి అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్లిపోయారు.
Następnie przyniosła to przed Saula i przed jego sługi, a gdy zjedli, powstali i poszli tej samej nocy.

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 28 >