< సమూయేలు~ మొదటి~ గ్రంథము 27 >
1 ౧ తరువాత దావీదు “నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు” అని మనసులో అనుకుని
Na ka mea a Rawiri i roto i tona ngakau, Katahi ahau ka ngaro i te ringa o Haora a tetahi ra; kahore atu he mea pai moku i te hohoro o toku mawhiti atu ki te whenua o nga Pirihitini, kia ngakaukore ai a Haora ki te rapu ano i ahau i nga rohe kato a o Iharaira: penei ka mawhiti atu ahau i roto i tona ringa.
2 ౨ లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
Na whakatika ana a Rawiri, a haere ana ratou ko ona hoa e ono rau ki a Akihi tama a Maoko, ki te kingi o Kata.
3 ౩ దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.
Na ka noho a Rawiri ki a Akihi ki Kata, a ia me ana tangata, me te whare ano o tenei, o tenei, a Rawiri hoki ratou ko ana wahine tokorua, ko Ahinoama o Ietereere, ko Apikaira o Karamere, wahine a Napara.
4 ౪ దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు.
A ka korerotia ki a Haora, kua rere a Rawiri ki Kata, na mutu ake tana rapu i a ia.
5 ౫ దావీదు “రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు” అని ఆకీషును అడిగితే,
Na ka mea a Rawiri ki a Akihi, Ki te mea kua manakohia nei ahau e koe, kia homai e ratou tetahi wahi ki ahau i roto i tetahi o nga pa i te koraha, hei nohoanga moku: he aha hoki tau pononga i noho ai ki a koe i roto i te pa kingi?
6 ౬ ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.
Na ka homai e Akihi ki a ia i taua ra a Tikiraka: na reira nga kingi o Hura i whiwhi ai ki Tikiraka a mohoa noa nei.
7 ౭ దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.
Na, ko te maha o nga ra i noho ai a Rawiri ki te whenua o nga Pirihitini, kotahi tau, e wha marama.
8 ౮ తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.
Katahi a Rawiri ka haere, ratou ko ana tangata, ka whakaeke i nga Kehuri, i nga Kireti, i nga Amareki; ko era hoki nga iwi kua noho noa ake ki tera whenua i tou haerenga ki Huru a te whenua o Ihipa atu ana.
9 ౯ దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.
Na patua iho e Rawiri tera whenua; kihai hoki i whakaorangia tetahi tane, wahine ranei; a tangohia ana e ia nga hipi, nga kau, nga kaihe, nga kamera, me nga kakahu, a hoki ana, haere ana ki a Akihi.
10 ౧౦ అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.
Na ka mea a Akihi, Ko hea i whakaekea e koutou i tenei ra? Ano ra ko Rawiri, Ko te tonga o Hura, ko te tonga o nga Ierameeri, ko te taha ano ki te tonga o nga Keni.
11 ౧౧ ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు.
Kihai hoki i whakaorangia e Rawiri tetahi tane, wahine ranei, hei kawe i a ratou ki Kata; i mea hoki, Kei korero ratou i ta tatou, kei mea, I penei a Rawiri, a ko tana hanga ano tenei i nga ra katoa i noho ai ia ki te whenua o nga Pirihitini.
12 ౧౨ ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.
Na whakapono tonu a Akihi ki ta Rawiri, a ka mea, Kua tino mea rawa ia i a ia kia whakariharihangia e tona iwi, e Iharaira: na reira hei tangata tuturu ia maku ake, ake.