< సమూయేలు~ మొదటి~ గ్రంథము 27 >

1 తరువాత దావీదు “నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు” అని మనసులో అనుకుని
A I iho la o Davida iloko o kona naau, e make auanei au i ka lima o Saula i kekahi la: e aho e holo koke au ma ka aina o ko Pilisetia; alaila aole manao o Saula e imi hou mai ia'u ma na wahi a pau o ka Iseraela: pela e pakele ai au i kona lima.
2 లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
Ku ae la o Davida, a hele aku la me na kanaka eono haneri me ia io Akisa la, ke keiki a Maoka, ke alii o Gata.
3 దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.
A noho iho la o Davida me Akisa ma Gata, oia a me kona poe kanaka, o kela kanaka keia kanaka me kona ohua, o Davida me kana mau wahine, o Ahinoama no Iezereela, a o Abigaila no Karemela, ka wahine a Nabala.
4 దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు.
A haiia mai la ia Saula, ua holo o Davida ma Gata: aole ia i imi hou aku ia ia.
5 దావీదు “రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు” అని ఆకీషును అడిగితే,
Olelo aku la o Davida ia Akisa, Ina paha i alohaia mai au i kou maka, e haawi mai oe ia'u i wahi ma kekahi kulanakauhale ma ke kula i noho ai au malaila: no ke aha la o noho ai au me oe ma ke kulanakauhale alii?
6 ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.
A haawi aku la o Akisa ia Zikelaga nona ia la: no ia mea, lilo aku la o Zikelaga no na'lii o ka Iuda a hiki i keia la.
7 దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.
A o na la o ko Davida noho ana ma ka aina o ko Pilisetia, hookahi ia makahiki a me na malama keu eha.
8 తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.
Hele aku la o Davida me kona poe kanaka, a kaua aku la i ko Gesura, a me ko Gerezi, a me ka Amaleka: no ka mea, he poe kamaaina kahiko lakou o ka aina, kahi e hele aku ai i Sura, a hiki loa i ka aina o Aigupita.
9 దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.
A luku aku la o Davida i ka aina, aole i koe kekahi kanaka, aole hoi kekahi wahine e ola ana, a lawe ae la ia i na hipa, a me na bipi, a me na hoki, a me na kamelo, me ka lole, a hoi aku la a hiki io Akisa la.
10 ౧౦ అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.
I mai la o Akisa, Mahea kahi a oukou i hao ai i keia la? I aku la o Davida, ma ka aoao hema o ka Iuda, a ma ka aoao hema o ka Ierahemeeli, a ma ka aoao hema o ko Keni.
11 ౧౧ ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు.
Aole i hoopakele o Davida i kekahi kanaka, aole hoi i kekahi wahine e ola ana e hele ma Gata e olelo, o hai aku lakou no makou, i ka i ana'e, Pela o Davida i hana'i, a pela hoi kana e hana aku ai i na manawa a pau o kona noho ana ma ka aina o na Pilisetia.
12 ౧౨ ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.
Manao aku la o Akisa i ka Davida, ua oiaio, i iho la, Ua hoolilo oia ia ia iho i mea hoowahawaha loa ia e kona poe kanaka, e ka Iseraela, a e lilo ia i kauwa na'u i ka manawa mau loa.

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 27 >