< సమూయేలు~ మొదటి~ గ్రంథము 23 >

1 తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.
Тада јавише Давиду говорећи: Ево Филистеји ударише на Кеилу, и харају гумна.
2 అప్పుడు దావీదు “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా “నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు” అని దావీదుతో చెప్పాడు.
И упита Давид Господа говорећи: Хоћу ли ићи и ударити на те Филистеје? А Господ рече Давиду: Иди, и побићеш Филистеје и избавити Кеилу.
3 దావీదుతో ఉన్నవారు “మేము ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా” అని దావీదుతో అన్నారు.
А Давиду рекоше људи његови: Ево нас је страх овде у Јудиној земљи, а шта ће бити кад пођемо у Кеилу, на логор филистејски?
4 దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. “నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను” అని యెహోవా చెప్పాడు.
Зато Давид опет упита Господа, а Господ му одговори и рече: Устани, иди у Кеилу, јер ћу ја предати Филистеје у руке твоје.
5 దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు.
Тада отиде Давид са својим људима у Кеилу, и удари на Филистеје, и отера им стоку, и поби их љуто; тако избави Давид становнике кеилске.
6 దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు.
А кад Авијатар, син Ахимелехов, побеже к Давиду у Кеилу, донесе са собом оплећак.
7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని “దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు” అనుకున్నాడు.
Потом јавише Саулу да је Давид дошао у Кеилу; и рече Саул: Дао га је Бог у моје руке, јер се затворио ушавши у град, који има врата и преворнице.
8 అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరులనూ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు.
И сазва Саул сав народ на војску да иде на Кеилу и опколи Давида и људе његове.
9 సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.
Али Давид дознавши да му Саул зло кује, рече Авијатару свештенику: Узми на се оплећак.
10 ౧౦ అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది.
И рече Давид: Господе Боже Израиљев! Чуо је слуга Твој да се Саул спрема да дође на Кеилу да раскопа град мене ради.
11 ౧౧ కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి” అని ప్రార్థిస్తే “అతడు వస్తాడు” అని యెహోవా బదులిచ్చాడు.
Хоће ли ме Кеиљани предати у његове руке? Хоће ли доћи Саул као што је чуо слуга Твој? Господе Боже Израиљев! Кажи слузи свом. А Господ одговори: Доћи ће.
12 ౧౨ “కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా “వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు” అన్నాడు.
Опет рече Давид: Кеиљани хоће ли предати мене и моје људе у руке Саулове? А Господ одговори: Предаће.
13 ౧౩ దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.
Тада се Давид подиже са својим људима, око шест стотина људи, и отидоше из Кеиле, и идоше куда могоше. А кад Саулу јавише да је Давид побегао из Кеиле, тада он не хте ићи.
14 ౧౪ దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.
А Давид се бављаше у пустињи по тврдим местима, и намести се на једном брду у пустињи Зифу. А Саул га тражаше једнако, али га Господ не даде у његове руке.
15 ౧౫ తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు.
И Давид, видећи да је Саул изашао те тражи душу његову, оста у пустињи Зифу, у шуми.
16 ౧౬ అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి “నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు.
А Јонатан, син Саулов, подиже се и дође к Давиду у шуму, и укрепи му руку у Господу;
17 ౧౭ నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది” అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు.
И рече му: Не бој се, јер те неће стигнути рука цара Саула оца мог; него ћеш царовати над Израиљем, а ја ћу бити други за тобом; и Саул, отац мој, зна то.
18 ౧౮ వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.
И учинише њих двојица веру пред Господом; и Давид оста у шуми, а Јонатан отиде кући својој.
19 ౧౯ జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి “యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు.
Тада дођоше Зифеји к Саулу у Гавају, и рекоше: Не крије ли се Давид код нас по тврдим местима у шуми на брду Ехели надесно од Гесимона?
20 ౨౦ రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని” అని చెప్పారు.
Сада дакле по свој жељи душе своје, царе, изађи, а наше ће бити да га предамо у руке цару.
21 ౨౧ సౌలు వారితో ఇలా అన్నాడు. “మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక.
А Саул рече: Господ да вас благослови, што ме пожалисте.
22 ౨౨ మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి
Идите сада и дознајте још боље и разберите и промотрите где се сакрио и ко га је онде видео; јер ми кажу да је врло лукав.
23 ౨౩ మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను” అని చెప్పాడు.
Промотрите и видите сва места где се крије, па опет дођите к мени кад добро дознате, и ја ћу поћи с вама; и ако буде у земљи, тражићу га по свим хиљадама Јудиним.
24 ౨౪ వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు,
Тада усташе и отидоше у Зиф пре Саула; а Давид и људи његови беху у пустињи Маону у равници надесно од Гесимона.
25 ౨౫ సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.
И Саул изађе са својим људима да га тражи; а Давиду јавише, те он сиђе са стене и стаде у пустињи Маону. А Саул кад то чу, отиде за Давидом у пустињу Маон.
26 ౨౬ కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
И Саул иђаше једном страном планине, а Давид са својим људима другом страном планине; и Давид хићаше да утече Саулу, јер Саул са својим људима опкољаваше Давида и његове људе да их похвата.
27 ౨౭ ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి “నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని చెబితే
У том дође гласник Саулу говорећи: Брже ходи; јер Филистеји ударише на земљу.
28 ౨౮ సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టబడింది.
Тада се врати Саул не терајући даље Давида, и отиде пред Филистеје. Отуда се прозва оно место Села-Амалекот.
29 ౨౯ తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.
А Давид отишавши оданде стаде на тврдим местима енгадским.

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 23 >