< సమూయేలు~ మొదటి~ గ్రంథము 23 >
1 ౧ తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.
有人告訴大衛說:「非利士人攻擊基伊拉,搶奪禾場。」
2 ౨ అప్పుడు దావీదు “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా “నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు” అని దావీదుతో చెప్పాడు.
所以大衛求問耶和華說:「我去攻打那些非利士人可以不可以?」耶和華對大衛說:「你可以去攻打非利士人,拯救基伊拉。」
3 ౩ దావీదుతో ఉన్నవారు “మేము ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా” అని దావీదుతో అన్నారు.
跟隨大衛的人對他說:「我們在猶大地這裏尚且懼怕,何況往基伊拉去攻打非利士人的軍旅呢?」
4 ౪ దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. “నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను” అని యెహోవా చెప్పాడు.
大衛又求問耶和華。耶和華回答說:「你起身下基伊拉去,我必將非利士人交在你手裏。」
5 ౫ దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు.
大衛和跟隨他的人往基伊拉去,與非利士人打仗,大大殺敗他們,又奪獲他們的牲畜。這樣,大衛救了基伊拉的居民。
6 ౬ దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు.
亞希米勒的兒子亞比亞他逃到基伊拉見大衛的時候,手裏拿着以弗得。
7 ౭ దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని “దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు” అనుకున్నాడు.
有人告訴掃羅說:「大衛到了基伊拉。」掃羅說:「他進了有門有閂的城,困閉在裏頭;這是上帝將他交在我手裏了。」
8 ౮ అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరులనూ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు.
於是掃羅招聚眾民,要下去攻打基伊拉城,圍困大衛和跟隨他的人。
9 ౯ సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.
大衛知道掃羅設計謀害他,就對祭司亞比亞他說:「將以弗得拿過來。」
10 ౧౦ అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది.
大衛禱告說:「耶和華-以色列的上帝啊,你僕人聽真了掃羅要往基伊拉來,為我的緣故滅城。
11 ౧౧ కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి” అని ప్రార్థిస్తే “అతడు వస్తాడు” అని యెహోవా బదులిచ్చాడు.
基伊拉人將我交在掃羅手裏不交?掃羅照着你僕人所聽的話下來不下來?耶和華-以色列的上帝啊,求你指示僕人!」耶和華說:「掃羅必下來。」
12 ౧౨ “కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా “వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు” అన్నాడు.
大衛又說:「基伊拉人將我和跟隨我的人交在掃羅手裏不交?」耶和華說:「必交出來。」
13 ౧౩ దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.
大衛和跟隨他的約有六百人,就起身出了基伊拉,往他們所能往的地方去。有人告訴掃羅,大衛離開基伊拉逃走;於是掃羅不出來了。
14 ౧౪ దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.
大衛住在曠野的山寨裏,常在西弗曠野的山地。掃羅天天尋索大衛,上帝卻不將大衛交在他手裏。
15 ౧౫ తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు.
大衛知道掃羅出來尋索他的命。那時,他住在西弗曠野的樹林裏;
16 ౧౬ అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి “నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు.
掃羅的兒子約拿單起身,往那樹林裏去見大衛,使他倚靠上帝得以堅固,
17 ౧౭ నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది” అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు.
對他說:「不要懼怕!我父掃羅的手必不加害於你;你必作以色列的王,我也作你的宰相。這事我父掃羅知道了。」
18 ౧౮ వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.
於是二人在耶和華面前立約。大衛仍住在樹林裏,約拿單回家去了。
19 ౧౯ జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి “యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు.
西弗人上到基比亞見掃羅,說:「大衛不是在我們那裏的樹林裏山寨中、曠野南邊的哈基拉山藏着嗎?
20 ౨౦ రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని” అని చెప్పారు.
王啊,請你隨你的心願下來,我們必親自將他交在王的手裏。」
21 ౨౧ సౌలు వారితో ఇలా అన్నాడు. “మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక.
掃羅說:「願耶和華賜福與你們,因你們顧恤我。
22 ౨౨ మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి
請你們回去,再確實查明他的住處和行蹤,是誰看見他在那裏,因為我聽見人說他甚狡猾。
23 ౨౩ మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను” అని చెప్పాడు.
所以要看準他藏匿的地方,回來據實地告訴我,我就與你們同去。他若在猶大的境內,我必從千門萬戶中搜出他來。」
24 ౨౪ వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు,
西弗人就起身,在掃羅以先往西弗去。 大衛和跟隨他的人卻在瑪雲曠野南邊的亞拉巴。
25 ౨౫ సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.
掃羅和跟隨他的人去尋找大衛;有人告訴大衛,他就下到磐石,住在瑪雲的曠野。掃羅聽見,便在瑪雲的曠野追趕大衛。
26 ౨౬ కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
掃羅在山這邊走,大衛和跟隨他的人在山那邊走。大衛急忙躲避掃羅;因為掃羅和跟隨他的人,四面圍住大衛和跟隨他的人,要拿獲他們。
27 ౨౭ ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి “నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని చెబితే
忽有使者來報告掃羅說:「非利士人犯境搶掠,請王快快回去!」
28 ౨౮ సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టబడింది.
於是掃羅不追趕大衛,回去攻打非利士人。因此那地方名叫西拉‧哈瑪希羅結。
29 ౨౯ తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.
大衛從那裏上去,住在隱‧基底的山寨裏。