< సమూయేలు~ మొదటి~ గ్రంథము 22 >

1 దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు.
و داود از آنجا رفته، به مغاره عدلام فرارکرد و چون برادرانش و تمامی خاندان پدرش شنیدند، آنجا نزد او فرود آمدند.۱
2 ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు.
و هرکه در تنگی بود و هر قرض دار و هر‌که تلخی جان داشت، نزد او جمع آمدند، و بر ایشان سردار شدو تخمین چهار صد نفر با او بودند.۲
3 తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి “దేవుడు నాకు ఏమి చేస్తాడో నేను తెలుసుకొనేంత వరకూ నా తలిదండ్రులను నీ దగ్గర ఉండనివ్వు” అని మోయాబు రాజును అడిగి,
و داود از آنجا به مصفه موآب رفته، به پادشاه موآب گفت: «تمنا اینکه پدرم و مادرم نزد شمابیایند تا بدانم خدا برای من چه خواهد کرد.»۳
4 వారిని అతనికి అప్పగించాడు. దావీదు దాక్కుని ఉన్న రోజుల్లో వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు.
پس ایشان را نزد پادشاه موآب برد و تمامی روزهایی که داود در آن ملاذ بود، نزد او ساکن بودند.۴
5 ఆ తరువాత గాదు ప్రవక్త వచ్చి “కొండల్లో ఉండకుండాా యూదా దేశానికి పారిపో” అని దావీదుతో చెప్పడంవల్ల దావీదు వెళ్ళి హారెతు అడవిలో దాక్కున్నాడు.
و جاد نبی به داود گفت که «در این ملاذدیگر توقف منما بلکه روانه شده، به زمین یهودا برو.» پس داود رفت و به جنگل حارث درآمد.۵
6 దావీదు, అతని అనుచరులు ఫలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.
و شاول شنید که داود و مردمانی که با وی بودند پیدا شده‌اند، و شاول در جبعه، زیر درخت بلوط در رامه نشسته بود، و نیزه‌اش در دستش، وجمیع خادمانش در اطراف او ایستاده بودند.۶
7 సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు “బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా?
وشاول به خادمانی که در اطرافش ایستاده بودند، گفت: «حال‌ای بنیامینیان بشنوید! آیا پسر یسا به جمیع شما کشتزارها و تاکستانها خواهد داد و آیاهمگی شما را سردار هزاره‌ها و سردار صده هاخواهد ساخت؟۷
8 మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు నా సేవకుడు, దావీదును రెచ్చగొట్టినా, నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు” అన్నాడు.
که جمیع شما بر من فتنه انگیزشده، کسی مرا اطلاع ندهد که پسر من با پسر یساعهد بسته است و از شما کسی برای من غمگین نمی شود تا مرا خبر دهد که پسر من بنده مرابرانگیخته است تا در کمین بنشیند چنانکه امروزهست.»۸
9 అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి “యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను.
و دوآغ ادومی که با خادمان شاول ایستاده بود در جواب گفت: «پسر یسا را دیدم که به نوب نزد اخیملک بن اخیتوب درآمد.۹
10 ౧౦ అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.
و او ازبرای وی از خداوند سوال نمود و توشه‌ای به اوداد و شمشیر جلیات فلسطینی را نیز به او داد.»۱۰
11 ౧౧ రాజు, యాజకుడూ అహీటూబు కొడుకు అయిన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు,
پس پادشاه فرستاده، اخیملک بن اخیتوب کاهن و جمیع کاهنان خاندان پدرش را که در نوب بودند طلبید، و تمامی ایشان نزد پادشاه آمدند.۱۱
12 ౧౨ సౌలు “అహీటూబు కొడుకా, విను” అన్నప్పుడు, అతడు “నా యజమానీ, చెప్పండి” అన్నాడు.
و شاول گفت: «ای پسر اخیتوب بشنو.» اوگفت: «لبیک‌ای آقایم!»۱۲
13 ౧౩ సౌలు “నువ్వు, యెష్షయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం, కత్తి ఇచ్చి అతనికి సహాయ పడమని దేవుని దగ్గర విన్నపం చేసావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నానుండి దాక్కుని, రేపు నాపై తిరగబడతాడు గదా?” అన్నాడు.
شاول به او گفت: «تو وپسر یسا چرا بر من فتنه انگیختید به اینکه به وی نان و شمشیر دادی و برای وی از خدا سوال نمودی تا به ضد من برخاسته، در کمین بنشیندچنانکه امروز شده است.»۱۳
14 ౧౪ అహీమెలెకు “రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నేరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు?
اخیملک در جواب پادشاه گفت: «کیست ازجمیع بندگانت که مثل داود امین باشد و او دامادپادشاه است و در مشورت شریک تو و در خانه تومکرم است.۱۴
15 ౧౫ ఈ సంగతి గూర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీదా నా తండ్రి ఇంటి వారందరిమీదా ఈ నేరం మోపకూడదు” అని రాజుకు జవాబిచ్చాడు.
آیا امروز به سوال نمودن از خدابرای او شروع کردم، حاشا از من. پادشاه این کار رابه بنده خود و به جمیع خاندان پدرم اسناد ندهدزیرا که بنده ات از این چیزها کم یا زیاد ندانسته بود.»۱۵
16 ౧౬ రాజు “అహీమెలెకూ, నీకూ, నీ తండ్రి ఇంటివారికందరికీ చావు తప్పదు” అన్నాడు.
پادشاه گفت: «ای اخیملک تو و تمامی خاندان پدرت البته خواهید مرد.»۱۶
17 ౧౭ “వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్ప లేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు.
آنگاه پادشاه به شاطرانی که به حضورش ایستاده بودند، گفت: «برخاسته، کاهنان خداوندرا بکشید زیرا که دست ایشان نیز با داود است و بااینکه دانستند که او فرار می‌کند، مرا اطلاع ندادند.» اما خادمان پادشاه نخواستند که دست خود را دراز کرده، بر کاهنان خداوند هجوم آورند.۱۷
18 ౧౮ రాజు దోయేగును చూసి “నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు” అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, యాజకుల పై దాడిచేసి ఏఫోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు.
پس پادشاه به دوآغ گفت: «تو برگرد وبر کاهنان حمله آور.» و دوآغ ادومی برخاسته، برکاهنان حمله آورد و هشتاد و پنج نفر را که ایفودکتان می‌پوشیدند در آن روز کشت.۱۸
19 ౧౯ ఇంకా యాజకుల పట్టణమైన నోబులొ కాపురం ఉంటున్నవారిని కత్తితో చంపేశాడు. మగవాళ్ళను, ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను, అన్నిటినీ కత్తితో చంపేశాడు.
و نوب رانیز که شهر کاهنان است به دم شمشیر زد و مردان و زنان و اطفال و شیرخوارگان و گاوان و الاغان وگوسفندان را به دم شمشیر کشت.۱۹
20 ౨౦ అయితే అహీటూబు కొడుకైన అహీమెలెకు కొడుకుల్లో ఒకడైన అబ్యాతారు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి,
اما یکی از پسران اخیملک بن اخیتوب که ابیاتار نام داشت رهایی یافته، در عقب داود فرارکرد.۲۰
21 ౨౧ సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియచేసారు.
و ابیاتار داود را مخبر ساخت که شاول کاهنان خداوند را کشت.۲۱
22 ౨౨ దావీదు “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉండడంవల్ల వాడు సౌలుకు కచ్చితంగా ఈ సంగతి చెబుతాడని నేననుకొన్నాను. నీ తండ్రి యింటివారందరి మరణానికి నేనే కారకుడనయ్యాను.
داود به ابیاتار گفت: «روزی که دوآغ ادومی در آنجا بود، دانستم که اوشاول را البته مخبر‌خواهد ساخت، پس من باعث کشته شدن تمامی اهل خاندان پدرت شدم.۲۲
23 ౨౩ నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్నూ నిన్నూ చంపాలని చూసేవాడు ఒక్కడే” అని అబ్యాతారుతో చెప్పాడు.
نزد من بمان و مترس زیرا هر‌که قصد جان من دارد قصد جان تو نیز خواهد داشت. و لکن نزد من محفوظ خواهی بود.»۲۳

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 22 >