< సమూయేలు~ మొదటి~ గ్రంథము 2 >
1 ౧ హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను.
Na Hana bɔɔ mpaeɛ sɛ, “Mʼakoma di ahurisie wɔ Awurade mu! Ao, Awurade mu na me nhyira wɔ! Afei, manya mmuaeɛ ama mʼatamfoɔ, na mʼani gye wɔ wo gyeɛ no ho.
2 ౨ యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.
“Obiara nyɛ kronkron sɛ Awurade! Obi bi nka wo ho; Ɔbotan bi nni hɔ sɛ yɛn Onyankopɔn.
3 ౩ యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.
“Gyae ahantansu ne ahomasoɔ no, nkasa wɔ ahantan so saa! Ɛfiri sɛ, Awurade yɛ Onyankopɔn a ɔnim wo nneyɛeɛ na ɔbɛbu wo deɛ woayɛ no so atɛn.
4 ౪ పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.
“Wɔn a na wɔyɛ atumfoɔ no nnyɛ atumfoɔ bio; na wɔn a na wɔyɛ mmerɛ no nso, afei, wɔayɛ den.
5 ౫ తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.
Wɔn a na wɔdidi mee pintinn no afei ɔkɔm rekum wɔn. Na wɔn a ɔkɔm rekum wɔn no nso afei wɔamee pintinn. Afei, obonini wɔ mma baason, na ɔbaa a na ɔwɔ mma pii no mma bɛbɔ no.
6 ౬ మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే. (Sheol )
“Awurade de nkwa ne owuo nyinaa ba; Ɔka ebi hyɛ damena mu, na ɔnyane ebinom. (Sheol )
7 ౭ యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.
Awurade yɛ obi ohiani na wayɛ obi ɔdefoɔ; ɔbrɛ obi ase na wapagya obi.
8 ౮ దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.
Ɔpagya ohiani firi mfuturo mu aane, ɔyi no firi nsosie mu; ɔyɛ wɔn sɛ mmapɔmma de wɔn tena animuonyam nkonnua so. “Ɛfiri sɛ, asase fapem yɛ Awurade dea, na watoto ewiase sɛdeɛ ɛsɛ.
9 ౯ తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.
Ɔbɛbɔ nyamesurofoɔ ho ban, na amumuyɛfoɔ bɛyera esum mu. “Sɛ ahoɔden mu nko deɛ a, obi renni nim;
10 ౧౦ యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”
Wɔn a wɔko tia Awurade no, ɔbɛdwerɛ wɔn. Ɔdwa aprannaa firi ewiem gu wɔn so; Awurade bu atɛn wɔ asase so baabiara. “Ɔma ne ɔhempɔn ahoɔden kɛseɛ; deɛ wasra no no, ɔhyɛ nʼahoɔden mu den.”
11 ౧౧ తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు.
Afei, Elkana ne Hana gyaa Samuel hɔ kɔɔ efie wɔ Rama. Na abarimaa no bɛyɛɛ Awurade ɔboafoɔ, ɛfiri sɛ, ɔboaa ɔsɔfoɔ Eli.
12 ౧౨ ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.
Eli mmammarima no yɛ asansafoɔ a wɔmfɛre Awurade,
13 ౧౩ ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి
anaa wɔn asɔfodwuma. Ɛberɛ biara a obi bɛba abɛbɔ afɔdeɛ no na wɔrenoa ɛnam no, Eli mma no soma ɔsomfoɔ de adinam a ɛwɔ ano mmiɛnsa ba. Ɛberɛ a ɛnam no si ogya so no,
14 ౧౪ డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.
ɔsomfoɔ no de adinam no wɔ dadesɛn no mu. Na wɔhyɛ sɛ deɛ adinam no bɛwɔ mu no nyinaa yɛ Eli mma no dea. Wɔde Israelfoɔ a wɔba Silo hɔ nyinaa faa saa ɛkwan yi so.
15 ౧౫ అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో “యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి” అనేవాడు.
Ɛtɔ dabi a, ansa na wɔbɛhye sradeɛ no, ɔsɔfoɔ no ɔsomfoɔ ba bɛka kyerɛ onipa a ɔrebɔ afɔdeɛ no sɛ, “Ma ɔsɔfoɔ no ɛnam no bi, na ɔntoto. Ɔmpɛ wo ɛnam a woanoa, na mmom, ɛnam mono nko ara.”
16 ౧౬ “అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు.
Onipa a ɔrebɔ afɔdeɛ no ka sɛ, “Fa dodoɔ biara a wopɛ, nanso sradeɛ no deɛ, ɛsɛ sɛ wɔhye ansa.” Ɛhɔ na ɔsomfoɔ no bɛka sɛ, “Dabi, fa ma me seesei ara, anyɛ saa a, mede tumi bɛfa.”
17 ౧౭ అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.
Na saa bɔne a mmeranteɛ yi yɛ yi yɛ akyiwadeɛ wɔ Awurade anim, ɛfiri sɛ, na wɔbu Awurade afɔrebɔ no animtia.
18 ౧౮ బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.
Samuel deɛ, ɛwom na ɔyɛ abarimaa, nanso na ɔyɛ Awurade ɔboafoɔ. Na wɔde nwera asɔfotadeɛ ahyɛ no te sɛ ɔsɔfoɔ.
19 ౧౯ అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది.
Afe biara a ne maame ne ne kunu rekɔbɔ afirinhyia afɔdeɛ no, na ne maame pam batakari kumaa bi de kɔma no.
20 ౨౦ “యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.
Ansa na wɔbɛsane akɔ efie no, Eli hyira Elkana ne ne yere ka sɛ, “Awurade mma ɔbaa yi nwo mma, na ɔmmɛsi deɛ ɔbɔɔ ho mpaeɛ nyaeɛ a ɔde no maa Awurade no ananmu.”
21 ౨౧ యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.
Na Awurade maa Hana woo mmammarima baasa ne mmammaa baanu. Na Samuel nyinii wɔ Awurade anim.
22 ౨౨ ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు,
Afei, Eli bɔɔ akɔkoraa, nanso na ɔnim deɛ ne mmammarima no de reyɛ Israelfoɔ. Nhwɛsoɔ bi ne sɛ, na ɔnim sɛ ne mmammarima no fa mmabaawa a wɔboa ntomadan no ano adwumayɛ no.
23 ౨౩ “ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు?
Eli ka kyerɛɛ wɔn sɛ, “Metete mo ho nsɛm firi ɔmanfoɔ nkyɛn a ɛfa amumuyɛsɛm a modie no ho. Adɛn enti na mokɔ so yɛ bɔne?
24 ౨౪ నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.
Me mma, ɛsɛ sɛ mogyae! Mo ho nsɛm a metete firi Awurade nkurɔfoɔ nkyɛn fa mo ho no nyɛ.
25 ౨౫ మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు.
Sɛ obi yɛ bɔne tia ɔfoforɔ a, Onyankopɔn tumi gyina mu ma ɔfɔdifoɔ no. Nanso, sɛ obi yɛ bɔne tia Awurade a, hwan na ɔbɛtumi adi agyinamu?” Eli mma no antie wɔn agya no afotuo, na Awurade nso reyɛ nʼadwene sɛ ɔbɛkum wɔn.
26 ౨౬ బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.
Na abɔfra Samuel nyiniiɛ, na ɔkɔɔ so nyaa adom firii Awurade ne ɔmanfoɔ nkyɛn.
27 ౨౭ ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.
Ɛda koro bi Onyankopɔn onipa bi baa Eli nkyɛn de nkra yi brɛɛ no sɛ, “Sei na Awurade ka, ‘Manna me ho adi pefee ankyerɛ wʼagya fie ɛberɛ a na wɔyɛ nkoa wɔ Misraim no anaa?
28 ౨౮ అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.
Israel mmusuakuo no nyinaa mu no, Aaron na meyii no sɛ, ɔnyɛ me ɔsɔfoɔ a ɔbɛkɔ afɔrebukyia anim akɔhye aduhwam, na wahyɛ asɔfotadeɛ wɔ mʼanim. Na mede afɔdeɛ a wɔbɔɔ no ogya so no nyinaa maa mo asɔfoɔ no.
29 ౨౯ నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.
Adɛn enti na motiatia me kum afɔdeɛ ne mʼaduane afɔdeɛ so? Adɛn enti na mobu mo mmammarima sene me? Moawe afɔrebɔdeɛ a me nkurɔfoɔ Israelfoɔ bɔ no mu kyɛfa a ɛyɛ no, na monam so ayeyɛ akɛseɛ!’
30 ౩౦ నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’
“Enti, asɛm a Awurade, Israel Onyankopɔn ka ne sɛ, ‘Meremma nneɛma bɔne a moreyɛ yi nkɔ so! Mehyɛɛ bɔ sɛ wo Lewi abusua fa no bɛyɛ mʼasɔfoɔ, nanso, wɔn a wɔdi me ni no, mɛdi wɔn ni; na wɔn a wɔbu me animtia no, mɛbɔ wɔn ahohora.
31 ౩౧ జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు.
Mɛma mo fiefoɔ agyae mʼasɔfodie som no. Mpatuwuo mpa mo fie da na mo mu biara rentena ase nni mfeɛ, mmee.
32 ౩౨ నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు,
Mode anibereɛ na ɛbɛhwɛ nkɔsoɔ a mede bɛma me nkurɔfoɔ Israelfoɔ. Na mo abusuafoɔ no mu biara nni hɔ a ɔbɛbɔ akɔkoraa.
33 ౩౩ నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.
Wɔn a wɔbɛka akyire no bɛtena ase awerɛhoɔ ne ntehem mu. Na wɔn mma bɛwuwu atɔfowuo.
34 ౩౪ నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు.
“‘Na sɛdeɛ ɛbɛyɛ na wobɛhunu sɛ deɛ maka no bɛba mu saa no enti, mɛma wo mmammarima baanu no a ɛyɛ Hofni ne Pinehas no awuwu da korɔ mu.
35 ౩౫ తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.
Ɛno akyi masi ɔsɔfoɔ foforɔ a ɔyɛ ɔnokwafoɔ a ɔbɛsom me, na wayɛ deɛ mɛkyerɛ no sɛ ɔnyɛ biara. Mɛhyira nʼasefoɔ, na ne fiefoɔ bɛyɛ ahene a mɛsra wɔn ngo no asefoɔ akɔsi daa.
36 ౩౬ అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”
Na wʼasefoɔ nyinaa bɛkoto nʼasefoɔ, asrɛsrɛ wɔn sika ne aduane. Wɔbɛka sɛ, “Mesrɛ mo, momma yɛn nnwuma bi nyɛ wɔ asɔfoɔ no mu sɛdeɛ ɛbɛma yɛanya aduane adi, amee.”’”