< సమూయేలు~ మొదటి~ గ్రంథము 19 >
1 ౧ మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు.
USawuli watshela indodana yakhe uJonathani kanye lezinceku zonke ukuba babulale uDavida. Kodwa uJonathani wayemthanda uDavida
2 ౨ అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో.
ngakho wamxwayisa wathi, “Ubaba uSawuli udinga ithuba lokukubulala. Qaphela kusasa ekuseni; hamba uyecatsha uhlale khona.
3 ౩ నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను” అన్నాడు.
Mina ngizaphuma ngiyekuma lobaba egangeni lapho okhona. Ngizakhuluma laye ngawe njalo ngizakutshela lokho engizakuthola.”
4 ౪ యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు.
UJonathani wakhuluma kuhle ngoDavida kuSawuli uyise wathi kuye, “Inkosi kayingenzi okubi encekwini yayo uDavida, konanga lutho kuwe, njalo akwenzileyo kukusize kakhulu.
5 ౫ అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?” అని చెప్పినప్పుడు,
Wadela impilo yakhe ekubulaleni kwakhe umFilistiya. Uthixo wazuzela u-Israyeli ukunqoba okukhulu, lawe wakubona njalo wathaba. Pho kungani ungenza okubi emuntwini omsulwa njengoDavida ngokumbulala kungelasizatho na?”
6 ౬ సౌలు యోనాతాను చెప్పింది విని “యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను” అని ప్రమాణం చేశాడు.
USawuli wamlalela uJonathani wasefunga isifungo lesi esithi, “Ngeqiniso elinjengoba uThixo ekhona, uDavida kayikubulawa.”
7 ౭ అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియచేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినపుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు.
Ngakho uJonathani wabiza uDavida wamtshela inkulumo yonke. Wamusa kuSawuli, uDavida wahlala loSawuli njengakuqala.
8 ౮ తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి, చాలామందిని చంపేశాడు.
Kwabuya kwaba lempi futhi, uDavida waphuma ukuyakulwa lamaFilistiya. Wawatshaya ngamandla amakhulu aze abaleka.
9 ౯ యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే,
Kodwa umoya omubi owavela kuThixo wafika kuSawuli ehlezi endlini yakhe ephethe umkhonto wakhe ngesandla. Kwathi uDavida etshaya ichacho,
10 ౧౦ సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు.
uSawuli wazama ukumnamathisela emdulini ngomkhonto wakhe, kodwa uDavida wavika uSawuli wagwaza umduli ngomkhonto. Ngalobobusuku uDavida waphunyuka wabaleka.
11 ౧౧ ఉదయాన్నే అతణ్ణి చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు “ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని చెప్పి
USawuli wathuma izithunywa endlini kaDavida ukuba bayilinde njalo bambulale ekuseni. Kodwa uMikhali, umkaDavida, wamxwayisa wathi, “Nxa ungabaleki ngalobubusuku ukuba uvikele impilo yakho kusasa uzabulawa.”
12 ౧౨ కిటికీగుండా దావీదును కిందికి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.
Ngakho uMikhali wehlisela uDavida phansi emkhuphe ngefasitela, wabaleka-ke waphepha.
13 ౧౩ తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది.
Emva kwalokho uMikhali wathatha isithombe wasilalisa embhedeni, wasembesa ngengubo ebeke uboya bembuzi ekhanda.
14 ౧౪ సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు “అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు” అని చెప్పింది.
USawuli esethume abantu ukuba bayethumba uDavida, uMikhali wathi, “Uyagula.”
15 ౧౫ దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి “అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను” అన్నాడు.
USawuli wababuyisela abantu labo ukuba bayebona uDavida esithi kubo, “Mletheni kimi ngombheda wakhe ukuze ngimbulale.”
16 ౧౬ ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది.
Kodwa kwathi amadoda lawo engena, embhedeni kwakulesithombe, ekhanda kuloboya bembuzi.
17 ౧౭ అప్పుడు సౌలు “నా శత్రువు తప్పించుకుపోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు” అని మీకాలును అడిగితే, మీకాలు “నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావ్, ‘నన్ను వెళ్లనివ్వు’ అని దావీదు తనతో చెప్పాడు” అని సౌలుతో చెప్పింది.
USawuli wathi kuMikhali, “Kungani ungikhohlise kanje wabalekisa isitha sami ukuze siphephe?” UMikhali wathi kuye, “Uthe kimi, ‘Yekela ngibaleke. Ngingakubulalelani na?’”
18 ౧౮ ఆ విధంగా దావీదు తప్పించుకు పారిపోయి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు తనపట్ల చేసినదంతా అతనికి తెలియజేశాడు. అతడూ సమూయేలూ బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.
UDavida esebaleke waphepha, waya kuSamuyeli eRama wamtshela konke okwakwenziwe nguSawuli kuye. Ngakho yena loSamuyeli baya eNayothi bahlala khona.
19 ౧౯ దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు సమాచారం వచ్చినప్పుడు,
Ilizwi lafika kuSawuli lisithi: “UDavida useNayothi eRama.”
20 ౨౦ దావీదును పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదకి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం ప్రారంభించారు.
Ngakho wathuma abantu ukuba bayemthumba. Kodwa bathi bebona ixuku labaphrofethi liphrofitha, loSamuyeli emi khonapho njengomkhokheli wabo, uMoya kaNkulunkulu wehlela ebantwini bakaSawuli labo baphrofetha.
21 ౨౧ ఈ విషయం సౌలుకు తెలిసి మరి కొందరు సైనికులును పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడవసారి సైనికులను పంపాడు గాని వారు కూడా అలాగే ప్రకటించడం మొదలుపెట్టారు.
USawuli wakutshelwa lokho wasethuma abanye abantu, labo baphrofetha. USawuli wathuma abantu okwesithathu, labo futhi baphrofetha.
22 ౨౨ చివరిసారిగా తానే రమాకు వెళ్ళి సెకు దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి “సమూయేలూ దావీదూ ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. ఒక వ్యక్తి “రమా దగ్గర నాయోతులో ఉన్నారు” అని చెప్పాడు.
Ekucineni, yena ngokwakhe wasuka waya eRama, wasesiya emgodini omkhulu eSekhu. Wabuza wathi, “USamuyeli loDavida bangaphi?” Bathi, “Le eNayothi eRama.”
23 ౨౩ అతడు రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినపుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగాడు. కాబట్టి అతడు ప్రయాణం చేస్తూ రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చేవరకూ పరవశుడై ప్రకటిస్తూ ఉన్నాడు.
Ngakho uSawuli waya eNayothi eRama. Kodwa uMoya kaNkulunkulu wehlela lakuye, wahamba ephrofitha waze wayafika eNayothi.
24 ౨౪ ఇంకా అతడు తన దుస్తులు తీసివేసి ఆ రోజు రాత్రి, పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ, లోదుస్తులతోనే పడి ఉన్నాడు. అప్పటినుండి “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది.
Wakhulula izigqoko zakhe laye waphrofitha uSamuyeli ekhona. Walala enjalo ilanga lonke lobusuku bonke. Yikho-nje abantu besithi, “Kanti uSawuli laye uphakathi kwabaphrofethi na?”