< సమూయేలు~ మొదటి~ గ్రంథము 18 >
1 ౧ దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.
Emva kokuba uDavida eseqedile ukukhuluma loSawuli, uJonathani waba moya munye loDavida, wamthanda njengoba ezithanda yena ngokwakhe.
2 ౨ ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.
Kusukela ngalolosuku uSawuli wahlala loDavida akaze amvumela ukubuyela endlini kayise.
3 ౩ యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.
Njalo uJonathani wenza isivumelwano loDavida ngoba wayemthanda njengoba ezithanda yena ngokwakhe.
4 ౪ యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
UJonathani wakhupha isembatho ayesigqokile wasinika uDavida, lebhatshi lakhe, lenkemba yakhe, idandili lakhe kanye lebhanti lakhe.
5 ౫ దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.
Loba kuyini uSawuli amthuma ukuba akwenze, uDavida wakwenza ngokuphumelela uSawuli waze wamnika isikhundla esikhulu ebuthweni. Lokhu kwathokozisa abantu bonke, kanye lezikhulu zikaSawuli.
6 ౬ వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
Kwathi abantu sebebuyela ekhaya emva kokuba uDavida esebulele umFilistiya, abesifazane baphuma kuyo yonke imizi yako-Israyeli bahlangabeza inkosi uSawuli ngokuhlabela lokugida, ngezingoma zokuthokoza lamagedla kanye lemitshingo.
7 ౭ ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
Ekugideni kwabo bahlabela besithi: “USawuli ubulele izinkulungwane zakhe, kodwa uDavida ubulele amatshumi ezinkulungwane zakhe.”
8 ౮ ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.
USawuli wazonda kakhulu, amazwi la amthukuthelisa. Wacabanga wathi, “Badumisa uDavida ngamatshumi ezinkulungwane, kodwa mina ngezinkulungwane kuphela nje. Kuyini okunye angakuzuza ngaphandle kombuso na?”
9 ౯ అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.
Kusukela ngalelolanga kusiya phambili uSawuli wakhangela uDavida ngelihlo elilomhawu.
10 ౧౦ తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.
Ngelanga elalandelayo umoya omubi wavela kuNkulunkulu wehlela phezu kukaSawuli ngamandla. Wayephrofetha endlini yakhe, lapho uDavida wayetshaya ichacho njengenjwayelo yakhe. USawuli wayephethe umkhonto ngesandla sakhe,
11 ౧౧ ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
wawuphosa esithi, “UDavida ngizambambanisa lomduli.” Kodwa uDavida wavika kwaze kwaba kabili.
12 ౧౨ యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.
USawuli wayemesaba uDavida ngoba uThixo wayeloDavida kodwa esemdelile uSawuli.
13 ౧౩ అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.
Ngakho wamsusa uDavida kuye wamenza umlawuli wabantu abayinkulungwane; njalo uDavida wakhokhela amabutho ekuhlaseleni kwawo.
14 ౧౪ దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.
Kukho konke akwenzayo waphumelela kakhulu, ngoba uThixo wayelaye.
15 ౧౫ దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.
Kwathi uSawuli ebona ukuphumelela kwakhe, wamesaba.
16 ౧౬ దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు.
Kodwa wonke u-Israyeli loJuda wamthanda uDavida, ngoba wabakhokhela ekuhlaseleni kwabo.
17 ౧౭ సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.
USawuli wasesithi kuDavida, “Nansi indodakazi yami endala uMerabi; ngizakwendisela yona ukuba ibe ngumkakho; wena ungisebenzele ngesibindi kuphela njalo ulwe izimpi zikaThixo.” Ngoba uSawuli wakhuluma yedwa wathi, “Kangiyikumphakamisela isandla. AmaFilistiya kawenze lokho!”
18 ౧౮ దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.
Kodwa uDavida wathi kuSawuli, “Ngingubani mina labendlu yakwethu bayini, loba isizwana sikababa ko-Israyeli, ukuba ngibe ngumkhwenyana wenkosi na?”
19 ౧౯ అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
Kodwa kwathi isikhathi sesifikile esokuba uMerabi, indodakazi kaSawuli, aphiwe uDavida, waphiwa u-Adiriyeli waseMehola ukuba abe ngumkakhe.
20 ౨౦ అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.
Ngalesosikhathi uMikhali, indodakazi kaSawuli, wayemthanda uDavida, njalo kwathi uSawuli bemtshela ngakho, wathaba.
21 ౨౧ “ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.
Wacabanga wathi, “Ngizamnika yena ukuba abe ngumjibila kuye lokuze isandla samaFilistiya simelane laye.” Ngakho uSawuli wathi kuDavida, “Khathesi usulethuba lesibili lokuba ngumkhwenyana wami.”
22 ౨౨ సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”
USawuli walaya inceku zakhe wathi, “Khulumani loDavida ngasese lithi, ‘Khangela, inkosi iyathokoza ngawe, lenceku zayo zonke ziyakuthanda; ngakho woba ngumkhwenyana wayo.’”
23 ౨౩ సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
Zawatsho amazwi la kuDavida kodwa uDavida wathi, “Licabanga ukuthi kuyinto encane ukuba ngumkhwenyana wenkosi na? Mina ngingumuntukazana njalo ongeladumo.”
24 ౨౪ సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.
Kwathi izinceku zikaSawuli sezimtshelile okwakutshiwo nguDavida,
25 ౨౫ ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
uSawuli waphendula wathi, “Alibokuthi kuDavida, ‘Inkosi kayifuni enye inhlawulo yamalobolo ngaphandle kwamajwabu ezitho zangaphambili zamaFilistiya alikhulu, ukuba iphindisele ezitheni zayo.’” Icebo likaSawuli lalingelokuthi uDavida afe ebulawa ngamaFilistiya.
26 ౨౬ సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
Kwathi inceku sezimtshelile uDavida izinto lezi, wathokoza ukuba ngumkhwenyana wenkosi. Ngakho kwathi isikhathi esasibekiwe singakedluli,
27 ౨౭ గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.
uDavida labantu bakhe basuka bayabulala amaFilistiya angamakhulu amabili. Weza lamajwabu emiphambili yawo waqhubela inkosi inani elipheleleyo ukuze abe ngumkhwenyana wenkosi. USawuli wamendisela-ke indodakazi yakhe uMikhali ukuba ngumkakhe.
28 ౨౮ యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,
Kwathi uSawuli ebona ukuthi uThixo wayeloDavida kanye lokuthi indodakazi yakhe, uMikhali, yayimthanda uDavida,
29 ౨౯ సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.
uSawuli wabuye wamesaba kakhulu, njalo waba yisitha sakhe impilo yakhe yonke.
30 ౩౦ ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.
Abalawuli bamaFilistiya baqhubeka besiyakulwa izimpi, njalo izikhathi zonke bephuma, uDavida waba lokuphumelela okwedlula ezinye izikhulu zikaSawuli, lebizo lakhe laba lodumo.