< సమూయేలు~ మొదటి~ గ్రంథము 18 >

1 దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.
達味同撒烏耳說完了話,約納堂的心和達味的心很相契;約納堂愛他如愛自己一樣。
2 ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.
那天,撒烏耳把達味留下,不讓他回父家去。
3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.
約納堂同達味結為盟友,愛他如愛自己一樣。
4 యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
約納堂脫下自己穿的外氅,連軍裝,帶刀劍,甚至弓和腰帶,都給了達味。
5 దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.
撒烏耳派達味出去無論作什麼事,沒有不成功的;故此撒烏耳派他作軍隊的將領;軍民和撒烏耳的臣僕都非常喜愛他。
6 వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
當達味殺死那培肋舍特人後,班師回來時,婦女們從城中出來,唱歌跳舞,打鼓彈琴,興高采烈地前來歡迎撒烏耳君王。
7 ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
婦女們邊唱邊跳說:「撒烏耳殺了一千,達味殺了一萬」。
8 ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.
撒烏耳因此很是憤怒,這話使他很不高興,遂說:「給了根一萬,只給我一千;他所少的只有王位了!」
9 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.
從那一天起,撒烏耳常嫉視達味。
10 ౧౦ తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.
第二天,惡神由天主那裏降到撒烏耳身上;使他在屋中發狂。達味一如往日手中彈著琴,撒烏耳手中卻拿著一根長槍,
11 ౧౧ ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
撒烏耳舉起槍來,想把達味釘在牆上;達味已由他面前逃脫了兩次。
12 ౧౨ యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.
撒烏耳害怕達味,因為上主與達味同在,而離開了撒烏耳。
13 ౧౩ అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.
因此,撒烏耳叫他離開自己,派他作千夫長,達味便在軍民前往來出入。
14 ౧౪ దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.
達味在所行的一切事上,無不順利,因為天主與他同在。
15 ౧౫ దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.
撒烏耳見他辦事順利,就更疑懼他。
16 ౧౬ దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు.
但全以色列和猶大人卻愛達味,因為他在他們前往來出入。
17 ౧౭ సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.
撒烏耳對達味說:「看;我要把我的長女默辣布嫁給你為妻,只要你為我勇敢服務,為上主作戰」。──撒烏耳心中想:我不親手害他,讓培肋舍特人加害他。
18 ౧౮ దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.
達味回答撒烏耳說:「我是誰,我父在以色列又算得什麼,我怎配作君王的女婿﹖」
19 ౧౯ అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
但是撒烏耳的女兒默辣布正要嫁給達味的時候,卻嫁給了默曷拉人阿德黎耳為妻。
20 ౨౦ అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.
當時撒烏耳的女兒米加耳很愛達味;有人告訴了撒烏耳,他看這事好,
21 ౨౧ “ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.
心想:「我把她嫁給達味,叫她成為他的羅網,藉培肋舍特人害他」。所以撒烏耳再次對達味說:「今天你要作我的女婿了! 」
22 ౨౨ సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”
撒烏耳吩咐他的臣僕說:「你們暗暗地告訴達味說:看,君王多麼喜愛你,如今你要作君王的女婿了! 」
23 ౨౩ సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
撒烏耳的臣僕將這些話告訴了達味;達味反答說:「你們以為作君王的女婿軟碟件小事嗎﹖我不過是個貧窮賤卑賤的人」。
24 ౨౪ సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.
撒烏耳的臣僕回報王說:「達味如此如此說了」。
25 ౨౫ ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
撒烏耳答說:「你們要這樣對達味說:君王不要什麼聘禮,只要一百培培肋舍特人的包皮,為報復君王的仇敵」。撒烏耳有意使達味落在培肋舍特人手中。
26 ౨౬ సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
他的臣僕將這些話轉告給達味,達味看這事為作君王的女婿也對,所限的日期尚未過去,
27 ౨౭ గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.
達味就和他的人起身去殺死了一百培肋舍特人,將他們的包皮帶回,足數交給君王,為作君王的女婿;撒烏耳就將女兒米加耳嫁給他為妻。
28 ౨౮ యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,
撒烏耳看出了上主與達味同在,全以色列也都愛他,
29 ౨౯ సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.
從此更疑懼達味,終身與他為敵。
30 ౩౦ ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.
培肋舍特人的首領仍不斷出征;但每遇他們出征,達味所行的常比撒烏耳所有的臣僕成就更大,為此他更受人景仰。

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 18 >