< సమూయేలు~ మొదటి~ గ్రంథము 16 >
1 ౧ యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.”
Awurade bisaa Samuel se, “Woadi Saulo ho awerɛhow sɛnea ɛsɛ. Mapo no sɛ Israel hene. Fa ngo gu wo toa mu, na tutu so kɔ Betlehem. Hwehwɛ obi a wɔfrɛ no Yisai na mayi ne mmabarima no mu baako sɛ ɔnyɛ me hene foforo.”
2 ౨ అందుకు సమూయేలు “నేనెలా వెళ్ళగలను? నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. యెహోవా “నువ్వు ఒక లేగ దూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి,
Samuel bisae se, “Mɛyɛ dɛn ayɛ eyi? Sɛ Saulo te a obekum me.” Na Awurade ka kyerɛɛ no se, “Fa nantwi ba ka wo ho, na ka se, ‘maba sɛ merebɛbɔ afɔre ama Awurade.’
3 ౩ యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతణ్ణి నువ్వు అభిషేకించాలి” అని చెప్పాడు.
To nsa frɛ Yisai na ɔmmra afɔrebɔ no, na mɛkyerɛ wo ne mmabarima no mu nea wobɛsra no ngo ama me.”
4 ౪ సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బేత్లెహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి “నువ్వు శాంతంగానే వస్తున్నావా?” అని అడిగినప్పుడు,
Samuel yɛɛ nea Awurade kyerɛɛ no sɛ ɔnyɛ no. Bere a oduu Betlehem no, ɛhɔ mpanyimfo no bɔɔ hu. Wobisaa no se, “Wobaa no asomdwoe mu ana?”
5 ౫ అతడు “శాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలసి బలికి రండి” అని చెప్పి యెష్షయిని, అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు.
Samuel buae se, “Yiw, asomdwoe mu. Merebɛbɔ afɔre ama Awurade. Munnwira mo ho, na mommɛka me ho na yɛmmɔ.” Enti Samuel dwiraa Yisai ne ne mmabarima no na ɔtoo nsa frɛɛ wɔn baa afɔrebɔ no ase.
6 ౬ వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి “నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు” అని అనుకున్నాడు.
Wodui no, Samuel huu Eliab na osusuwii se, “Ampa, nea Awurade asra no no ni.”
7 ౭ అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
Nanso Awurade ka kyerɛɛ Samuel se, “Nhwɛ nʼahoɔfɛ ne ne tenten, efisɛ mapo no. Awurade nhwɛ nneɛma sɛnea nnipa hwɛ no. Onipa hwɛ nea aniwa hu, na Awurade de, ɔhwɛ koma mu.”
8 ౮ యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు.
Na Yisai frɛɛ Abinadab ma otwaa mu wɔ Samuel anim. Nanso Samuel kae se, “Oyi nyɛ nea Awurade ayi no.”
9 ౯ అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు.
Yisai maa Sama twaa mu, nanso Samuel kae se, “Saa ara na Awurade nyii oyi.”
10 ౧౦ యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు “యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు” అని చెప్పి,
Yisai maa ne mmabarima baason bɛfaa Samuel anim, na Samuel ka kyerɛɛ no se, “Awurade nyii wɔn mu biara ɛ.”
11 ౧౧ “నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు.
Enti obisaa Yisai se, “Mmabarima a wowɔ nyinaa ni ana?” Yisai buae se, “Akumaa pa ara wɔ hɔ, nanso ɔrehwɛ nguan.” Samuel kae se, “Soma na wɔnkɔfa no mmra mprempren. Sɛ ɔmmae a, yɛrentena ase nnidi.”
12 ౧౨ యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే “నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు” అని యెహోవా చెప్పగానే,
Enti Yisai soma ma wɔkɔfaa no bae. Na ɔyɛ ɔkɔkɔɔ a ahoɔfɛ aguare no na nʼani yɛ fɛ. Awurade kae se, “Sɔre na sra no ngo. Ɔno ni.”
13 ౧౩ సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.
Enti Samuel faa toa a ngo wɔ mu no sraa no wɔ ne nuanom anim. Na efi saa da no, Awurade honhom baa Dawid so wɔ tumi mu. Samuel kɔɔ Rama.
14 ౧౪ యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది,
Saa bere yi na Awurade honhom afi Saulo so. Na Awurade maa ɔhaw honhom bɛhyɛɛ no ma. Ɛma ɔtenaa ase ehu ne osuro mu.
15 ౧౫ సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది.
Ɛbaa saa no, Saulo asomfo no bi kyerɛɛ adwene bi se, “Honhommɔne bi a efi Onyankopɔn hɔ rehaw wo.
16 ౧౬ నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
Momma yɛn Awurade mma ne nkoa mpɛ sankubɔfo papa bi, na sɛ honhom no fi Onyankopɔn hɔ ba wo so a, wabɔ nnwom ama wo, na wo ho bɛtɔ wo.”
17 ౧౭ అప్పుడు సౌలు “బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి” అని వారితో చెప్పాడు.
Saulo kae se, “Monhwehwɛ ɔsankubɔni papa bi na momfa no mmrɛ me.”
18 ౧౮ వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు.
Asomfo no mu baako buae se, “Yisai a ofi Betlehem babarima baako nim sankubɔ yiye. Ɔyɛ ɔkokodurofo hoɔdenfo, na ɔyɛ ɔbadwemma nso. Ɔyɛ aberante a ne ho yɛ fɛ, na Awurade ka ne ho.”
19 ౧౯ సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు.
Enti Saulo tuu abɔfo kɔɔ Yisai hɔ kɔka kyerɛɛ no se, “Fa wo babarima Dawid a ɔyɛ oguanhwɛfo no brɛ me.”
20 ౨౦ అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.
Yisai penee so de Dawid kɔmaa Saulo a abirekyi ba ne afurum a wɔahyehyɛ aduan ne nsa wɔ ne so ka ho.
21 ౨౧ దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.
Dawid kɔɔ Saulo nkyɛn kɔsom no. Na Saulo pɛ Dawid asɛm yiye, enti ɔbɛyɛɛ Saulo akodekurafo no mu baako.
22 ౨౨ అప్పుడు సౌలు “దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.
Na Saulo de nkra kɔmaa Yisai se, “Ma Dawid nka mʼadwumayɛfo no ho, efisɛ mepɛ nʼasɛm yiye.”
23 ౨౩ దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.
Na bere biara a honhommɔne a efi Onyankopɔn bɛba Saulo so abɛhaw no no, Dawid bɔ sanku no. Ɛba saa a, Saulo ho tɔ no, na honhommɔne no nso kɔ.