< సమూయేలు~ మొదటి~ గ్రంథము 15 >

1 ఒక రోజున సమూయేలు సౌలును పిలిచి ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలపై నిన్ను రాజుగా అభిషేకించడానికి యెహోవా నన్ను పంపించాడు. ఆయన మాట విను.
Ɛda koro bi Samuel ka kyerɛɛ Saulo sɛ, “Me na Awurade somaa me sɛ memmɛsra wo ngo sɛ Israel ɔhene. Afei tie nkra a ɛfiri Awurade nkyɛn no.
2 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ‘అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గ మధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా.
Asɛm a Otumfoɔ Awurade seɛ nie, ‘Me ne Amalekfoɔ bɛdi wɔ deɛ wɔyɛ de tiaa Israelfoɔ ɛberɛ a na wɔfiri Misraim reba no.
3 కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, ఎద్దులైనా, గొర్రెలైనా, ఒంటెలైనా, గాడిదలైనా వేటినీ విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి, అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి’” అని చెప్పాడు.
Enti, kɔ na kɔsɛe Amalek mantam no pasaa. Kunkum mmarima ne mmaa, mmɔfra ne nkɔkoaa, anantwie ne nnwan, nyoma ne mfunumu.’”
4 అప్పుడు సౌలు ప్రజలను తెలాయీములో పోగుచేసి వారిని లెక్కించాడు. కాల్బలం రెండు లక్షలమంది, యూదావారు పదివేలమంది పోగయ్యారు.
Enti, Saulo frɛɛ nʼakodɔm boaa wɔn ano wɔ Telaim. Na wɔn dodoɔ yɛ asraafoɔ ɔpehanu ne ɔpedu nso a wɔfiri Yuda.
5 అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు.
Saulo kɔɔ Amalek kuropɔn no mu, kɔtɛɛ bɔnhwa no mu.
6 ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కేనీయులు వారికి సహాయం చేశారు గనుక అమాలేకీయులతో కలసి ఉన్న కేనీయులు కూడా నాశనం కాకుండా ఉండేలా వారిని బయలుదేరి వెళ్ళిపొమ్మని కేనీయులకు సమాచారం పంపినపుడు కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్లిపోయారు.
Na ɔtoo Kenifoɔ no nkra sɛ, “Momfiri deɛ Amalekfoɔ teɛ hɔ na mansɛe mo ne wɔn, ɛfiri sɛ, Israelfoɔ no firi Misraim reba no, mo ne wɔn dii no yie.” Enti, Kenifoɔ no twee wɔn ho firi Amalekfoɔ no ho.
7 తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకూ తరిమి సంహరించి
Na Saulo kunkumm Amalekfoɔ no firii Hawila kɔsii Sur wɔ Misraim apueeɛ fam.
8 అమాలేకీయుల రాజు అగగును సజీవంగా పట్టుకుని, మిగిలిన వారందరినీ కత్తితో నాశనం చేశాడు.
Ɔkyeree Amalekfoɔ ɔhene Agag anikann, nanso ɔkunkumm nnipa no nyinaa.
9 సౌలు, అతని ప్రజలు కలసి అగగును, గొర్రెలు, ఎద్దులు, బాగా బలిసిన గొర్రెపిల్లలు మొదలైనవాటిలో మంచివాటినీ నాశనం చేయకుండా వేరుగా ఉంచి, పనికిరాని వాటిని, నాసిరకం వాటిని చంపివేశారు.
Na Saulo ne nʼakodɔm no anyɛ Agag bɔne biara, na mmom wɔfaa wɔn nnwan pa, anantwie pa ne anantwie ne nnwan mma a wɔadodɔre sradeɛ ne biribiara a wɔn ani gye ho. Wɔsɛee deɛ ɛho nni wɔn mfasoɔ na ɛnni mu nyinaa.
10 ౧౦ అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైఇలా చెప్పాడు,
Na Awurade ka kyerɛɛ Samuel sɛ,
11 ౧౧ “సౌలు నేను చెప్పినది చేయకుండా నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు గనుక అతణ్ణి రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.” అప్పుడు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రి అంతా యెహోవాకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు.
“Manu me ho sɛ masi Saulo ɔhene, ɛfiri sɛ, wanni me nokorɛ, na afei wayɛ nʼadwene sɛ ɔrentie mʼasɛm.” Asɛm no haa Samuel, na ɔsu frɛɛ Awurade anadwo mu no nyinaa.
12 ౧౨ తెల్లవారగానే సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్ళినప్పుడు సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ విజయ స్మారక స్థూపం నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు.
Adeɛ kyee no, Samuel sɔree ntɛm kɔhyiaa Saulo, nanso obi ka kyerɛɛ no sɛ, “Saulo kɔɔ Karmel sɛ ɔrekɔsi nkaeɛdum de ahyɛ ne ho animuonyam, na ɔfirii hɔ kɔɔ Gilgal.”
13 ౧౩ తరువాత అతడు సౌలు దగ్గరకి వచ్చినపుడు సౌలు “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక, యెహోవా చెప్పిన మాట నేను జరిగించాను” అన్నాడు.
Na Samuel hunuu no akyire no, Saulo kyeaa no anigyeɛ so sɛ, “Awurade nhyira wo. Madi Awurade ahyɛdeɛ no so.”
14 ౧౪ అప్పుడు సమూయేలు “అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి?” అని అడిగాడు.
Samuel bisaa sɛ, “Na adɛn ne nnwan ne anantwie su a mete yi?”
15 ౧౫ అందుకు సౌలు “అమాలేకీయుల నుండి ప్రజలు వీటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజలు గొర్రెల్లో, ఎద్దుల్లో మంచివాటిని చంపకుండా ఉండనిచ్చారు. మిగిలిన వాటన్నిటినీ మేము హతం చేశాం” అన్నాడు.
Saulo gye too mu sɛ, “Ɛyɛ nokorɛ sɛ akodɔm no amfa wɔn nsa anka nnwan pa ne anantwie pa no. Nanso, wɔde yei rebɛbɔ afɔdeɛ ama Awurade, wo Onyankopɔn. Biribiara a ɛka ho no deɛ, yɛasɛe no.”
16 ౧౬ సమూయేలు “నీవు మాట్లాడవలసిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు చెబుతున్నాను విను” అన్నాడు. సౌలు “చెప్పండి” అన్నాడు.
Afei, Samuel ka kyerɛɛ Saulo sɛ, “Gyae! Tie asɛm a Awurade ka kyerɛɛ me anadwo a atwam yi.” Saulo bisaa sɛ, “Ɛdeɛn asɛm?”
17 ౧౭ అప్పుడు సమూయేలు “నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు.
Samuel ka kyerɛɛ no sɛ, “Ebia wobu wo ho abomfiaa, nanso ɛnyɛ wo na wodii Israel mmusuakuo nyinaa so no? Awurade asra wo ngo sɛ ɔhene wɔ Israel so.
18 ౧౮ యెహోవా నిన్ను పంపించి ‘నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చెయ్యి’ అని చెప్పినప్పుడు,
Na ɔsomaa wo sɛ kɔdi dwuma bi ma no, na ɔsee wo sɛ, ‘Kɔ na kɔsɛe amumuyɛfoɔ a ɛyɛ Amalekfoɔ no pasapasa, kɔsi sɛ mobɛtɔre wɔn ase dworobɛɛ.’
19 ౧౯ నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దాన్ని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు?” అన్నాడు.
Adɛn enti na woantie Awurade? Adɛn enti na mopere fom nneɛma, na moyɛɛ deɛ Awurade kaa sɛ monnyɛ?”
20 ౨౦ అప్పుడు సౌలు “అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగగును మాత్రమే తీసుకు వచ్చాను కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను.
Saulo nso kaa no dendeenden sɛ, “Metiee Awurade. Deɛ ɔkyerɛɛ me sɛ menyɛ no, meyɛeɛ. Mede ɔhene Agag sane baeɛ. Na wɔn a aka no deɛ, mesɛee wɔn nyinaa.
21 ౨౧ అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెల్లో, ఎద్దుల్లో శ్రేష్ఠమైనవాటిని తీసుకువచ్చారు” అని సమూయేలుతో చెప్పాడు.
Na mʼakodɔm no nso de nnwan pa, anantwie pa ne asadeɛ baeɛ sɛ wɔde rebɛbɔ afɔdeɛ ama Awurade, wo Onyankopɔn wɔ Gilgal.”
22 ౨౨ అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.
Na Samuel buaa sɛ, “Ɛdeɛn na ɛsɔ Awurade ani: sɛ wobɛbɔ ɔhyeɛ afɔdeɛ ne okum afɔdeɛ anaasɛ wobɛyɛ ɔsetie ama Awurade nne? Osetie yɛ sene afɔrebɔ, sɛ wobɛtie no no yɛ sene sɛ wode nnwennini akɛseɛ sradeɛ bɛma.
23 ౨౩ తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.
Adɔnyɛ te sɛ bayie, ɛna asoɔden nso te sɛ ahonisom. Esiane sɛ woapo Awurade asɛm no enti, ɔno nso apo wʼahennie.”
24 ౨౪ అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.
Na Saulo ka kyerɛɛ Samuel sɛ, “Mayɛ bɔne. Manni Awurade ahyɛdeɛ ne wo nkyerɛkyerɛ so. Na mesuro nnipa no enti na meyɛɛ wɔn apɛdeɛ maa wɔn no.
25 ౨౫ నువ్వు నా పాపాన్ని తీసివేసి నేను యెహోవాకు మొక్కుకొనేలా నాతో కలసి రా” అని సమూయేలును వేడుకున్నాడు.
Enti, mesrɛ wo, fa me bɔne kyɛ me na wo ne me nkɔsom Awurade.”
26 ౨౬ అయితే సమూయేలు “నీతోబాటు నేను వెనక్కి రాను. నీవు యెహోవాను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా యెహోవా నిన్ను తిరస్కరించాడు” అని చెప్పి
Samuel ka kyerɛɛ no sɛ, “Merensane ne wo nkɔ. Woapo Awurade ahyɛdeɛ enti Awurade nso apo wʼahennie!”
27 ౨౭ వెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది.
Samuel yɛɛ sɛ ɔrekɔ no, Saulo sɔɔ nʼatadeɛ mu pɛɛ sɛ ɔsane noɔ, na atadeɛ no mu suaneeɛ.
28 ౨౮ అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు “ఈ రోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దాన్ని అప్పగించాడు.
Samuel ka kyerɛɛ no sɛ, “Hwɛ ɛfiri ɛnnɛ, Awurade ate Israel ahemman mu afiri wo ho de ama obi foforɔ a ɔyɛ sene wo.
29 ౨౯ ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు.”
Deɛ ɔyɛ Israel Animuonyam no nni atorɔ na ɔnsesa nʼadwene; ɛfiri sɛ, ɔnnyɛ onipa na wasesa nʼadwene.”
30 ౩౦ సౌలు “నేను పాపం చేశాను. అయినప్పటికీ నా ప్రజల పెద్దల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నన్ను గౌరవించు. యెహోవాకు మొక్కడానికి నేను వెళ్తుండగా నాతో కూడ కలసి రమ్మని” అతని బతిమాలినప్పుడు
Saulo srɛɛ bio sɛ, “Menim sɛ mayɛ bɔne. Na mesrɛ wo sɛ, hyɛ me animuonyam wɔ me mpanimfoɔ ne me nkurɔfoɔ anim; wo ne me nkɔsom Awurade, wo Onyankopɔn.”
31 ౩౧ సమూయేలు సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత
Enti, Samuel pene ne Saulo sane kɔeɛ, na Saulo somm Awurade.
32 ౩౨ సమూయేలు “అమాలేకీయుల రాజు అగగును నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. అగగు ఆనందంగా అతని దగ్గరకి వచ్చి “నాకు మరణ శిక్ష తప్పిపోయిందా” అన్నాడు.
Afei, Samuel kaa sɛ, “Fa ɔhene Agag brɛ me.” Agag baa ne nkyɛn gyidie mu, susuu sɛ ɛhɔ a wakɔ no deɛ, owuo apare no.
33 ౩౩ సమూయేలు “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు.
Nanso, Samuel kaa sɛ, “Sɛdeɛ wʼakofena akum mmaa bi mmammarima no, wo nso wo maame bɛyɛ ɔbaa a ɔnni ba.” Enti, Samuel twitwaa Agag mu nketenkete Awurade anim wɔ Gilgal.
34 ౩౪ తరువాత సమూయేలు రమాకు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు.
Na Samuel firi hɔ kɔɔ Rama ɛna Saulo nso kɔɔ ne fie wɔ Gibea.
35 ౩౫ సౌలు బతికినంత కాలం సమూయేలు అతణ్ణి చూసేందుకు వెళ్లలేదు గానీ సౌలును గూర్చి దుఃఖిస్తూ వచ్చాడు. తాను సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందాడు.
Samuel anhyia Saulo bio nanso ɔdii ne ho yea bebree. Na ɛyɛɛ Awurade yea sɛ wasi Saulo ɔhene wɔ Israel so.

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 15 >