< సమూయేలు~ మొదటి~ గ్రంథము 11 >
1 ౧ అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు “మేము నీకు సేవకులుగా ఉంటాం. మాతో ఒప్పందం చేసుకో” అని నాహాషును అడిగారు.
І вийшов аммоні́тянин Нахаш, і таборува́в при ґілеадському Явешу. І сказали всі явеські люди до Нахаша: „Склади з нами умову, — і ми бу́демо служити тобі!“
2 ౨ “ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు పెద్దలతో చెప్పాడు.
І сказав до них аммоні́тянин Нахаш: „Про це складу́ з вами умову, — щоб кожному з вас ви́брати праве око, і я вчиню́ це на га́ньбу для всього Ізраїля“.
3 ౩ అందుకు వారు “మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మును మేమే నీకు అప్పగించుకుంటాం” అన్నారు.
І сказали до нього явеські старші́: „Зачекай нам сім день, і нехай ми пошлемо́ послів у всі Ізраїлеві краї. І якщо нема нам порятунку, то вийдемо до тебе“.
4 ౪ ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు.
І прийшли ті посли до Саулової Ґів'ї, і говорили ті слова́ до ушей народу. І ввесь народ підніс свій голос, та й заплакав.
5 ౫ సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ “ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేసారు.
Аж ось Саул іде за худобою з поля. І сказав Саул: „Що́ народові, що плачуть?“І розповіли́ йому слова явеських людей.
6 ౬ సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో
І злинув Божий Дух на Саула, як слухав він ті слова́, і дуже запалав його гнів!
7 ౭ ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ “సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను” అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు.
І взяв він пару худобин, і порізав її, і порозсилав по всім Ізраїлевім Краї через послів, говорячи: „Хто не ви́йде за Саулом та за Самуїлом, — отак буде зро́блено худобі його!“І великий страх спав на людей, і вони повихо́дили, як один чоловік.
8 ౮ అతడు బెజెకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు మూడు లక్షల మంది, యూదావారు 30 వేల మంది ఉన్నారు.
І він перелічи́в їх у Безеку, - і було Ізраїлевих синів триста тисяч, а Юдиних людей — тридцять тисяч.
9 ౯ అప్పుడు సౌలు “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి” అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు.
І сказали вони до послів, що прийшли: „Так скажете ме́шканцям ґілеадського Явешу: Узавтра, як пригріє сонце, буде вам поряту́нок“. І прийшли ті посли, і розповіли́ явеським людям, — і вони зраділи.
10 ౧౦ అప్పుడు యాబేషువారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు. “రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు.”
І сказали явеські люди: „Узавтра ми вийдемо до вас, а ви зробите нам усе, що добре в оча́х ваших“.
11 ౧౧ తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.
І сталося назавтра, і склав Саул із наро́ду три відділи, і вони пройшли в сере́дину табо́ру за ранньої сторо́жі, та й били Аммона аж до спеко́ти дня. І сталося, — позосталі розбіглися, і не позоста́лося між ними двох ра́зом.
12 ౧౨ తరువాత ప్రజలు “సౌలు మనలను ఏలుతాడా? అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు” అని సమూయేలుతో అన్నారు.
І сказав народ до Самуїла: „Хто́ той, що запитував: Саул буде царювати над нами? Дайте тих людей, а ми їх повбиваємо!“
13 ౧౩ అందుకు సౌలు “ఈ రోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు” అన్నాడు.
Та Саул сказав: „Ніхто не буде забитий цього дня, бо Госпо́дь сьогодні зробив спасі́ння серед Ізраїля“.
14 ౧౪ “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం, రండి” అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు.
А Самуїл сказав до народу: Ходіть, і пі́демо в Ґілґа́л, та й відновимо там ца́рство!“
15 ౧౫ ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.
І пішов увесь народ до Ґілґалу, і настановили царем там Саула перед Господнім лицем у Ґілґалі, і прино́сили мирні жертви перед Господнім лицем. І дуже радів там Саул та всі Ізраїлеві му́жі!