< 1 పేతురు 1 >
1 ౧ యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.
Петр, апостол Ісуса Христа, вибраним захожанам розсїяння по Понту, Галатиї, Кападокиї, Азиї і Витиниї,
2 ౨ తండ్రి అయిన దేవుని భవిష్యద్ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక.
по провидінню Бога Отця, через осьвяченнє Духа, на послуханнє і кропленнє крові Ісус-Христової: Благодать вам і мир нехай намножить ся.
3 ౩ మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
Благословен Бог і Отець Господа нашого Ісуса Христа, що, по великій своїй милости, знов породив нас на впованнє живе воскресеннєм Ісус-Христовим із мертвих,
4 ౪ దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది.
до наслїддя нетлїнного і непорочного, що не зовяне, сховане на небесах про вас,
5 ౫ ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.
котрі силою Божою стережені пробуваєте через віру, на спасеннє, готове явитись останнього часу.
6 ౬ రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.
Сим радуйте ся, мало нині (коли треба), смуткуючи у всяких напастях,
7 ౭ నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.
щоб випробувана віра ваша, геть дорожча золота пропадущого, хоч і огнем випробуваного, знайшлась на похвалу і честь і славу в одкриттю Ісус-Христовому.
8 ౮ మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.
Котрого не бачивши любите, і на котрого нині не дивлячись, а віруючи, радуєтесь радістю невимовною і преславною,
9 ౯ మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.
приймаючи конець віри вашої, спасеннє душам.
10 ౧౦ మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు.
Про се ж то спасеннє розвідували і допитувались пророки, що про вашу благодать пророкували,
11 ౧౧ వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు.
дознаючись, якого або котрого часу являв у них Дух Христов, поперед сьвідкуючи про Христові страстї і про славу, що після них;
12 ౧౨ తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.
котрим відкрито, що не самим собі, а нам служили вони (тим), що нині звістили вам ті, котрі благовіствували вам Духом сьвятим, посланим із неба, (і) на що бажають ангели дивитись.
13 ౧౩ కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
Тим то, підперезавши поясницї думок ваших, будьте тверезі, і звершено вповайте на благодать, що приносить ся вам в одкриттю Ісуса Христа.
14 ౧౪ విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.
Яко діти слухняні, не водячи себе по давнім хотїнням вашим, що в незнанню,
15 ౧౫ మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
а, яко Покликавший вас сьвятий, і. ви самі сьвяті у всьому життю будьте:
16 ౧౬ ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.
бо написано: "Будьте сьвяті, бо я сьвят."
17 ౧౭ ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.
І коли Отцем зовете Того, що, не вважаючи на лице, судить кожного по ділу, то Зo страхом провожайте час вашого домування,
18 ౧౮ మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.
знаючи, що не тлінним сріблом або золотом викупились од марного життя вашого, від отців переданого,
19 ౧౯ అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.
но дорогоцінною кровю Христа, як непорочного і чистого агнця,
20 ౨౦ విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు.
призначеного перш настання сьвіта, обявленого в останнї часи задля вас,
21 ౨౧ ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
що через Його віруєте в Бога, котрий воскресив Його з мертвих і дав Йому славу, щоб віра ваша і надія була на Бога.
22 ౨౨ సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.
Душі ваші очистивши, в послусї правди Духом, на братню любов нелицемірну, із чистого серця любіте один одного щиро,
23 ౨౩ మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. (aiōn )
як народжені не з тлінного сїмя а з нетлїнного, через слово Бога живого і пробуваючого по вік. (aiōn )
24 ౨౪ “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది
Бо "всяке тіло, як трава, і всяка слава чоловіча, як цьвіт на траві: Зісохла трава і цьвіт її упав;
25 ౨౫ గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది. (aiōn )
а слово Господнє пробував по вік." Се ж слово - благовіствововане між вами. (aiōn )