< 1 పేతురు 5 >
1 ౧ తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను.
A köztetek lévő presbitereket kérem én, a presbitertárs, és a Krisztus szenvedésének tanuja, és a megjelenendő dicsőségnek részese;
2 ౨ మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి.
Legeltessétek az Istennek köztetek lévő nyáját, gondot viselvén arra nem kényszerítésből, hanem örömest; sem nem rút nyerészkedésből, hanem jóindulattal;
3 ౩ మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి.
Sem nem úgy, hogy uralkodjatok a gyülekezeteken, hanem mint példányképei a nyájnak.
4 ౪ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
És mikor megjelenik a főpásztor, elnyeritek a dicsőségnek hervadatlan koronáját.
5 ౫ యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.
Hasonlatosképen ti ifjabbak engedelmeskedjetek a véneknek: mindnyájan pedig, egymásnak engedelmeskedvén, az alázatosságot öltsétek fel, mert az Isten a kevélyeknek ellene áll, az alázatosaknak pedig kegyelmet ád.
6 ౬ అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
Alázzátok meg tehát magatokat Istennek hatalmas keze alatt, hogy felmagasztaljon titeket annak idején.
7 ౭ ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.
Minden gondotokat ő reá vessétek, mert néki gondja van reátok.
8 ౮ నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
Józanok legyetek, vigyázzatok; mert a ti ellenségetek, az ördög, mint ordító oroszlán szerte jár, keresvén, kit elnyeljen:
9 ౯ వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
A kinek álljatok ellen, erősek lévén a hitben, tudva, hogy a világban lévő atyafiságotokon ugyanazok a szenvedések telnek be.
10 ౧౦ తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. (aiōnios )
A minden kegyelemnek Istene pedig, a ki az ő örök dicsőségére hívott el minket a Krisztus Jézusban, titeket, a kik rövid ideig szenvedtetek, ő maga tegyen tökéletesekké, erősekké, szilárdakká és állhatatosokká, (aiōnios )
11 ౧౧ ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్. (aiōn )
Övé a dicsőség és a hatalom örökkön-örökké. Ámen. (aiōn )
12 ౧౨ సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి, అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి.
Silvánus által, a ki, a mint gondolom, hű atyátokfia, röviden írtam, intve és bizonyságot téve, hogy az az Istennek igaz kegyelme, a melyben állotok.
13 ౧౩ బబులోను పట్టణంలో ఉన్న ఆమె (దేవుడు ఎన్నుకున్న ఆమె) మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు మీకు అభినందనలు చెబుతున్నాడు.
Köszönt titeket a veletek együtt választott babiloni gyülekezet és Márk, az én fiam.
14 ౧౪ ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.
Köszöntsétek egymást szeretet csókjával. Békesség mindnyájatoknak, a kik Krisztusban vagytok.