< 1 పేతురు 4 >
1 ౧ క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు.
Тим же то, коли Христос страждав за нас тїлом, то й ви тією самою думкою оружіть ся; хто бо страждає тїлом, перестає грішити,
2 ౨ ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు.
щоб уже не по хотїнню чоловічому, а по волї Божій, жити остальний час у тїдї.
3 ౩ యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు.
Доволї бо з нас минувшого часу життя, що чинили волю поган, ходячи в розпусті, пристрастях, пияньстві, бенкетах, напитках і мерзських ідолослуженнях.
4 ౪ వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.
Чим і дивують ся, що ви не біжете разом з ними на розлив розпусти, хулячи;
5 ౫ బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి.
котрі дадуть одвіт Тому, що готов судити живих і мертвих.
6 ౬ అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
На се бо і мертвим проповідувано благовістє, щоб приняли суд по чоловіку тїлом, і жили по Бозї духом.
7 ౭ అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి.
Усьому ж конець наближив ся. Будьте ж оце мудрі і тверезі до молитов.
8 ౮ అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
Перш усього ж майте один до одного щиру любов, бо любов покривав множество гріхів.
9 ౯ ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి.
Будьте гостинні один для одного без дорікання.
10 ౧౦ దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
Кожний, яко ж приняв дар, так ним нехай служить один одному, як добрі доморядники всякої благодати Божої.
11 ౧౧ ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్. (aiōn )
Коли хто говорить, то нехай говорить як слова Божі; коли хто служить, нехай же служить по силї, котру подає Бог; щоб у всьому прославляв ся Бог через Ісуса Христа, котрому слава і держава по вічні віки. Амінь. (aiōn )
12 ౧౨ ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
Любі, не чудуйтесь розпаленнєм, що буває вам на спокусу, наче б вам що дивного довело ся;
13 ౧౩ క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో సంతోషించేలా, క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారైనట్టు ఆనందించండి.
а радуйтесь, яко ж маєте участь в страданнях Христових, щоб і в одкриттю слави Його радувались і веселились.
14 ౧౪ క్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ మీమీద నిలిచి ఉన్నాడు.
Коли докоряють вас за імя Христове, - ви блаженні; Дух бо слави й Бога почиває на вас; ними він хулить ся, вами ж прославляєть ся.
15 ౧౫ మీలో ఎవడూ హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు.
Тільки ж нїхто з вас нехай не постраждає яко душегубець, або злодій, або лиходій, або як бунтівник;
16 ౧౬ ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి.
коли ж яко Християнин, то нехай ве соромить ся, а прославляє Бога за сю участь.
17 ౧౭ దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి?
Бо пора початись судові від до му. Божого; коли ж найперш од нас, то який конець тих, що не корять ся благовістю Божому?
18 ౧౮ నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి?
коли "праведник тільки що спасеть ся, то безбожник і грішник де явить ся?"
19 ౧౯ కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.
Тим то й страждаючі по волі Божій, як вірному Творцеві, нехай передають душі свої, роблячи добре.