< 1 పేతురు 3 >
1 ౧ భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది.
Sammalunda hustrurna, vare sina män underdåniga; på det ock de, som icke tro på ordet, måga af hustrurnas umgängelse, utan ord, blifva vunne;
2 ౨ ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.
När de förmärka edor kyska umgängelse med fruktan.
3 ౩ జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు.
Hvilkas prydning icke skall vara utvärtes, med flätadt hår, eller kringhängande guld, eller i kostelig kläder;
4 ౪ వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది.
Utan om den fördolda menniskan i hjertat är utan vank, med saktmodigom och stillom anda, det är kosteligit för Gudi.
5 ౫ పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు.
Ty i så måtto hafva ock de helga qvinnor fordom prydt sig, de der satte sitt hopp till Gud, och voro sina män underdåniga.
6 ౬ ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.
Såsom Sara var lydig Abrahe, kallandes honom herra; hvilkens döttrar I vordna ären, om I väl gören, och ären icke så förfärade.
7 ౭ అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు.
Sammaledes I män, bor när dem med förnuft, och gifver det qvinliga kärilet, såsom det der svagast är, sina äro; såsom ock medarfvingom till lifsens nåd; på det edra böner icke blifva förhindrade.
8 ౮ చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.
Men på sistone, varer alle vid ett sinne, medlidande, broderlig kärlek hafvande till hvarannan, barmhertige, vänlige;
9 ౯ కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
Icke vedergällande ondt för ondt, icke bannor för bannor; utan heldre tvärtemot, välsigner; vetandes att I ären dertill kallade, att I skolen ärfva välsignelse.
10 ౧౦ జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.
Ty den der vill älska lifvet, och se goda dagar, han stille sina tungo ifrå det ondt är, och sina läppar, att de icke tala bedrägeri;
11 ౧౧ అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.
Vände sig ifrå det ondt är, och göre det godt är; söke efter friden, och fare honom efter.
12 ౧౨ ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
Ty Herrans ögon äro öfver de rättfärdiga, och hans öron till deras bön; men Herrans ansigte är öfver dem som ondt göra.
13 ౧౩ మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
Och ho är den som kan göra eder skada, om I faren efter det goda?
14 ౧౪ మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
Ja, om I än något liden för rättfärdighetenes skull, ären I dock likväl salige. Frukter eder intet för deras trug; icke heller förskräcker eder;
15 ౧౫ దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
Utan helger Herran Gud uti edor hjerta. Varer ock alltid redebogne till att svara hvarjom och enom, som begärar skäl till det hopp som i eder är; och det med saktmodighet och fruktan.
16 ౧౬ మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు.
Och hafver ett godt samvet; på det de, som vilja förtala eder såsom ogerningsmän, skola komma på skam, att de förlastat hafva edor goda umgängelse i Christo.
17 ౧౭ కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
Ty det är bättre, om Guds vilje så är, att I för goda gerningar liden, än för onda.
18 ౧౮ క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.
Ty Christus led ock ena reso för syndernas skull, rättfärdig för orättfärdiga; på det han skulle offra oss Gudi, och är dödad efter köttet; men lefvande gjord efter Andan.
19 ౧౯ ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు.
I dem samma gick han ock bort, och predikade för andarna i fängelset;
20 ౨౦ ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.
Som fordom icke trodde, när Gud en gång bidde, och tålamod hade i Noe tid, då arken byggdes, i hvilkom få, det är, åtta själar, blefvo frälste genom vattnet;
21 ౨౧ దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే.
Hvilket nu ock oss saliga gör i dopet, som genom hint betydt är (icke att köttsens smittor afläggas, utan att man hafver ett godt samvet till Gud), genom Jesu Christi uppståndelse;
22 ౨౨ ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.
Hvilken är på Guds högra hand, uppfaren till himla; och honom äro Änglarna, och väldigheterna, och krafterna underdåniga.