< రాజులు~ మొదటి~ గ్రంథము 4 >

1 సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.
[撒羅滿的朝臣]撒羅滿王作王統治全以色列。
2 అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,
以下是他所有的官吏﹕匝多克的兒子阿匝黎雅作大司祭,
3 షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.
史沙的兩個兒子厄里曷勒夫和阿希雅作書記,阿希路得的兒子約沙特作御史,
4 యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.
約雅達的兒子貝納雅統率軍隊,【匝多克和厄貝雅塔爾為司祭,】
5 నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.
納堂的兒子阿匝黎雅為太守之長,納堂的兒子匝步得為君王的朋友,
6 అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.
阿希沙爾為家宰,阿貝達的兒子阿多尼蘭管理苦役。十二太守
7 ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.
撒羅滿另立了十二太守管理全以色列,供應君王和王室的食糧;一年之中每人供應一個月。
8 వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు,
他們的名字如下﹕胡爾的兒子.....管理厄弗辣因山地;
9 మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు,
德刻爾的兒子...管理瑪卡茲、沙耳賓、貝特舍默士、阿雅隆及貝特哈南;
10 ౧౦ అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు.
赫達布的兒子...管理阿魯波特、索苛及赫斐爾全地;
11 ౧౧ అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య.
阿彼納達布的兒子...管理多爾全境,他娶了撒落滿的女兒塔法特為妻;
12 ౧౨ అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది.
阿希路得的兒子巴阿納,管理塔納客、默基多直到約刻默罕外,以及位於依次勒耳下邊的全貝特商,曾貝特商直到靠近匝爾堂的阿貝耳默曷拉;
13 ౧౩ గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం.
革貝爾的兒子...管理辣摩特基肋阿得,和在基肋阿得地的默納協的兒子雅依爾的鄉村;在巴商阿爾哥布地,所有的六十座設有城牆和銅閂的大城市,也歸他管理;
14 ౧౪ ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా
依多的兒子阿希納達布管理瑪哈納殷;
15 ౧౫ నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.
阿希瑪茲管理納斐塔里,他也娶了撒羅滿的女兒巴色瑪特為妻;
16 ౧౬ ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు.
胡瑟的兒子巴阿納管理阿協爾和則步隆;
17 ౧౭ ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.
帕魯亞的兒童約沙特管理依撒加爾;
18 ౧౮ బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.
厄拉的兒子史米管理本雅明;
19 ౧౯ గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి.
烏黎的兒子革貝爾管理加得,即昔日屬阿摩黎王息紅和巴商王敖格的地區。猶大地區另派太守管理。
20 ౨౦ అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.
當時猶大和以色列人數,像海邊的沙粒那麼多;他們有吃有喝,非常快樂。
21 ౨౧ నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు.
[撒羅滿的富貴]由大河直至培肋舍特人地和埃及邊界諸王國,都在撒羅滿統治下;撒羅滿一生歲月中,這些王國都向他進貢,表示臣服。
22 ౨౨ రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి,
撒羅滿每月所用的食品﹕細麵十「苛爾,」粗麵六十「苛爾;」
23 ౨౩ పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
肥牛十隻,牧放的牛二十隻,羊一百隻;此外還有鹿、羚羊、麃子和肥禽。
24 ౨౪ యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.
因為他統治大河西岸全境,從提斐撒到迦薩,大河西岸諸王都屬他權下,於是四鄰邊境都相安無事。
25 ౨౫ సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.
撒羅滿一生歲月中,從丹到貝爾舍巴的猶大和以色列人,都各安居在自己的葡萄樹和無花果樹下。
26 ౨౬ సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.
撒羅滿有四千廄套車的馬,並有一萬二千匹坐騎。
27 ౨౭ సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.
那些太守每人各按自己的月份,供應撒羅滿王和所有赴撒羅滿王宴席的人,而一無所缺。
28 ౨౮ రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.
每人各按所受的命令,將飼養戰馬及駿馬的大麥和草料,送到所指定的地方。撒羅滿的智慧
29 ౨౯ దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.
天主賜給了撒羅滿絕大的智慧和聰明,心胸寬大,有如海邊的沙灘。
30 ౩౦ అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.
撒羅滿的智慧超過所有東方人和埃及人的一切智慧。
31 ౩౧ అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.
他比所有的人更有智慧﹕比則辣黑人厄堂,比瑪曷耳的兒子赫曼、加耳苛耳和達爾達都更有智慧﹔他的聲譽傳遍周圍列國。
32 ౩౨ అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.
他說過三千句箴言,作的詩歌有一千五百首。
33 ౩౩ లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.
他講論過草木,從黎巴嫩山上長的香柏,到牆上寄生的牛膝草﹔也講論過走獸和飛禽,爬蟲和魚類。
34 ౩౪ అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.
為此,萬民和各國的君王,凡聽說撒羅滿智慧的,都來聽他的智慧。準備建築聖殿

< రాజులు~ మొదటి~ గ్రంథము 4 >