< రాజులు~ మొదటి~ గ్రంథము 3 >
1 ౧ తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు.
Salomo ne Misraimhene Farao yɛɛ apam, nam so waree ne babaa. Ɔde no bɛtenaa Dawid kurom kɔsii sɛ ɔsii nʼahemfie, sii Awurade Asɔredan, na ɔtoo Yerusalem ho ɔfasuo nso wieeɛ.
2 ౨ అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు.
Saa ɛberɛ no mu, na Israelfoɔ gu so bɔ afɔdeɛ wɔ sorɔnsorɔmmea, ɛfiri sɛ, na wɔnsii asɔredan, mfaa Awurade din ntoo so.
3 ౩ సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు.
Salomo kyerɛɛ ne dɔ a ɔwɔ maa Awurade, ɛfiri sɛ, na ɔnam nʼagya Dawid nkyerɛkyerɛ anammɔn so pɛpɛɛpɛ. Mmom na ɔbɔ afɔdeɛ wɔ sorɔnsorɔmmea hɔ, hye aduhwam wɔ hɔ nso.
4 ౪ ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
Gibeon na na afɔrebukyia no mu atitire wɔ, ɛhɔ na Salomo kɔbɔɔ ɔhyeɛ afɔdeɛ apem wɔ afɔrebukyia so.
5 ౫ గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు.
Anadwo no, Awurade daa ne ho adi kyerɛɛ Salomo wɔ daeɛ mu. Onyankopɔn ka kyerɛɛ no sɛ, “Ɛdeɛn na wopɛ? Bisa na mede bɛma wo.”
6 ౬ సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.
Salomo kaa sɛ, “Woada adɔeɛ kɛseɛ pa ara adi akyerɛ mʼagya Dawid, ɛfiri sɛ, na ɔdi wo nokorɛ, yɛ ɔteneneeni a nʼakoma mu nso da hɔ. Woatoa so ayɛ no saa adɔeɛ kɛseɛ yi ara, na ɛnnɛ yi ara, woama no ɔbabarima sɛ ɔntena nʼahennwa nso so.
7 ౭ నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు.
“Afei, Ao Awurade, me Onyankopɔn, woasi wʼakoa ɔhene, sɛ mensi mʼagya Dawid anan mu, nanso meyɛ abɔfra ketewaa bi a mennim sɛdeɛ mɛsi ayɛ mʼadwuma.
8 ౮ నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం.
Ɛha na wʼakoa abɛduru wɔ nnipa a woapa wɔn no mu; nnipa a wɔn dodoɔ enti, obi ntumi nkan wɔn.
9 ౯ నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”
Ɛno enti, ma wʼakoa nhunumu akoma a ɔbɛtumi de adi wo nkurɔfoɔ so, na ɔbɛtumi ahunu papa ne bɔne ntam nsonsonoeɛ. Na hwan koraa na ɔno nko ara bɛtumi adi saa ɔman a wɔdi mu, a wɔyɛ wo dea yi so?”
10 ౧౦ సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది.
Awurade ani sɔɔ Salomo mmuaeɛ no, na nʼani gyee sɛ ɔbisaa nyansa.
11 ౧౧ కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు.
Enti, Awurade buaa sɛ, “Esiane sɛ woabisa nyansa a wode bɛdi me manfoɔ so, na woammisa nkwa tenten anaa sika amma wo ho anaa woammisa sɛ wo ɔtamfoɔ bi nwu no enti,
12 ౧౨ నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.
mede deɛ woabisa no bɛma wo. Mɛma wo nyansa ne nteaseɛ a obiara nnyaa bi da, na obiara nso nnya bi da.
13 ౧౩ ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు.
Na deɛ woammisa no nso, mede bɛka wo ho—sika ne animuonyam. Na ɔhene biara a ɔwɔ ewiase nso rentumi mfa ne ho nto wo ho, wo nkwa nna nyinaa mu.
14 ౧౪ నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు.
Na sɛ wodi mʼakyi, na wodi me mmara so sɛ wʼagya Dawid a, mɛma wo nkwa tenten.”
15 ౧౫ అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.
Na Salomo nyaneeɛ, na ɔhunuu sɛ ɛyɛ daeɛ. Ɔkɔɔ Yerusalem kɔgyinaa Awurade Apam Adaka no anim, na ɔbɔɔ ɔhyeɛ afɔdeɛ ne asomdwoeɛ afɔdeɛ. Na ɔhyiaa ne mpanimfoɔ nyinaa, too wɔn ɛpono.
16 ౧౬ ఆ తరవాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు.
Akyire yi, mmaa nnwamanfoɔ baanu bi baa ɔhene no nkyɛn, pɛɛ sɛ ɔka wɔn asɛm bi ma wɔn.
17 ౧౭ వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది “నా యజమానీ, నేనూ ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను.
Wɔn mu baako hyɛɛ aseɛ sɛ, “Me wura, mesrɛ wo meka sɛ, saa ɔbaa yi ne me te fi korɔ mu. Mewoo ɔba ɛberɛ a ɔne me te efie hɔ.
18 ౧౮ నేను కనిన తరవాత మూడో రోజు ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు.
Nnansa akyi no, ɔno nso woo ba. Na yɛn nko ara na yɛte fie hɔ a obiara nka yɛn baanu ho.
19 ౧౯ అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు.
“Nanso, anadwo no, ɔpere kɔdaa ne ba no so, kumm no.
20 ౨౦ కాబట్టి మధ్య రాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని, చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది.
Na ɔsɔree anadwo no faa me ba firii me nkyɛn ɛberɛ a mada. Ɔde ne ba a wawu no too mʼabasa so, na ɔfaa me deɛ no kɔtoo ne nkyɛn, ma ɔdaeɛ.
21 ౨౧ ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరవాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను.”
Adeɛ kyeeɛ a mepɛɛ sɛ mema me ba no nufoɔ no, na wawu. Nanso, anim tetee kakra a mehwɛɛ abɔfra no yie no, mehunuu sɛ, ɛnyɛ me ba no koraa.”
22 ౨౨ అంతలో రెండో స్త్రీ “అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు. చచ్చినవాడు ఆమె కొడుకు” అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ “కాదు, చచ్చిన వాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు” అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు.
Ɛhɔ ara na ɔbaa baako no gyee hwanyan kaa sɛ, “Abɔfra a wawuo no yɛ wo ba no, ɛnna deɛ ɔnwuiɛ no nso yɛ me deɛ no.” Ɛnna ɔbaa a ɔdi ɛkan no nso se, “Dabi, deɛ wawuo no yɛ wo ba no, ɛnna deɛ ɔnwuiɛ no nso yɛ me deɛ no.” Enti, wɔtwee asɛm no saa ara wɔ ɔhene no anim.
23 ౨౩ అప్పుడు రాజు “బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయిన వాడు నీ కొడుకు అని ఒకామె, కాదు, కాదు చనిపోయిన వాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది.
Ɔhene no kaa sɛ, “Momma yɛmpɛ asɛm no mu nokorɛ yie. Mo baanu nyinaa, obiara se abɔfra a ɔnwuiɛ no yɛ ne dea, na abɔfra a wawuo no deɛ, ɔnyɛ obiara dea.
24 ౨౪ కాబట్టి ఒక కత్తి తీసుకు రండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు.
“Sɛ saa na ɛte deɛ a, mommrɛ me akofena.” Enti, wɔde akofena brɛɛ ɔhene no.
25 ౨౫ రాజు “బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకూ, సగం ఆమెకూ ఇయ్యండి” అని ఆజ్ఞాపించాడు.
Afei, ɔkaa sɛ, “Mompae abɔfra a ɔnwuiɛ no mu mmienu, na momfa ɛfa mma mmaa no mu biara.”
26 ౨౬ ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి, రాజుతో “రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి” అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ “ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరి సగం చేయండి” అంది.
Na ɔbaa a nokorɛm, ɔyɛ abɔfra a ɔte ase no maame a ɔpɛ ne ba yi asɛm yie no teateaam sɛ, “Ao! Dabi me wura! Fa abɔfra no ma no. Mesrɛ wo nku no!” Nanso, ɔbaa baako no kaa sɛ, “Ɛyɛ, ɛbɛbɔ yɛn baanu nyinaa. Kyɛ ne mu ma yɛn!”
27 ౨౭ అందుకు రాజు “బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు. వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఆమే వాడి తల్లి” అని తీర్పు చెప్పాడు.
Ɛhɔ na ɔhene no kaa sɛ, “Monnku no, na mmom, momfa abɔfra no mma ɔbaa a ɔpɛ sɛ abɔfra no tena ase no, na ɔno ne ne maame no.”
28 ౨౮ అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారు.
Ɔhene yi atemmuo no trɛ faa Israel mmaa nyinaa, na ɔmanfoɔ no ho dwirii wɔn wɔ nyansabun a Onyankopɔn de ama no, a ɛma no bu atɛntenenee no ho.