< రాజులు~ మొదటి~ గ్రంథము 21 >
1 ౧ యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది.
Oasr ima in grape se lun mwet se pangpang Naboth, oan apkuran nu ke inkul fulat sel Tokosra Ahab in acn Jezreel.
2 ౨ అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు.
Sie len ah Ahab el fahk nu sel Naboth, “Use luk ima in grape se lom an. Ke oan apkuran nu ke lohm sik uh, nga lungse orekmakin nu ke ima in mahsrik. Nga ac sot sie ima in grape ma wo liki, ku kom fin lungse nga in molela, na nga ac sot sie moul fal nu kac.”
3 ౩ అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు.
Naboth el fahk, “Ima in grape se inge usru se luk sin mwet matu luk ah. LEUM GOD El tia ku in lela ngan sot lom.”
4 ౪ నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.
Tokosra Ahab el som nu lohm sel, ac el kasrkusrak ac arulana supwar ke ma Naboth el fahk nu sel. El ona fin mwe oan kial, ac forang nu pesinka ac tiana mongo.
5 ౫ అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది.
Jezebel, mutan kial, el som nu yorol ac siyuk sel, “Mea aktoasrye kom an? Efu ku kom tia mongo?”
6 ౬ అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.”
Ac Ahab el fahk, “Nga toasrkin kas ma Naboth el fahk nu sik ah. Nga oru ngan molela ima in grape se lal, ku fin wo sel nga in sang sie pac ima in grape aolla ima lal ah, tuh pa el fahk mu nga tia ku in eis ima se lal.”
7 ౭ అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.
Jezebel el fahk, “Na mea, tia tokosra se pa kom? Tukakek, mongoi ac enganak. Nga ac eisla ima in grape se lal Naboth ac sot lom!”
8 ౮ ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.
Na Jezebel el simusla kutu leta, ac sainiya inel Ahab kac, siliya ke sil lal ah, ac supwalik nu sin mwet pwapa fulat ac mwet kol in acn Jezreel.
9 ౯ ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.
Leta ingan fahk ouinge: “Sulkakinelik sie len in lalo ac pangoneni mwet uh, na sang Naboth elan muta ke acn in muta fulat.
10 ౧౦ నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.”
Sokak luo mwet koluk elah an in orek loh kikiap lainul ye mutal ac fahk mu el selngawi God oayapa tokosra. Na kowos usalla nu likin siti uh, ac tanglal nwe ke el misa.”
11 ౧౧ అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు.
Mwet pwapa fulat ac mwet kol in acn Jezreel elos orala ma Jezebel el sapkin.
12 ౧౨ ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు.
Elos fahkelik len in lalo sac, ac pangoneni mwet uh, ac sang nien muta fulat sac nu sel Naboth.
13 ౧౩ అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు.
Mwet koluk elah luo ah kikiap ac fahk ye mutun mwet uh mu Naboth el selngawi God ac tokosra. Ouinge utukla el nu likin siti uh, ac tatngal el nwe ke na el misa.
14 ౧౪ నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు.
Na kas kacl supweyukla nu sel Jezebel fahk mu, “Naboth el anwuki tari.”
15 ౧౫ అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది.
Ke na pacl se kas inge sonol Jezebel, el fahk nu sel Ahab, “Naboth el misa. Fahla eis lom ima in grape se ma el tuh srunga kom in molela.”
16 ౧౬ నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు.
In pacl sac na Ahab el som nu ke ima sac, in eisla lal.
17 ౧౭ అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు,
Na LEUM GOD El fahk nu sel Elijah, mwet palu Tishbe,
18 ౧౮ “నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు.
“Fahla nu yorol Ahab, tokosra Samaria. Kom ac konalak in ima in grape lal Naboth, su el akola in sruokya lal.
19 ౧౯ నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.”
Fahk nu sel lah nga, LEUM GOD, fahk ouinge, ‘Ya tukun kom akmuseya mwet sac tari an, kom ac eisla pac acn sel an?’ Fahkang nu sel lah nga fahk ouinge: ‘In acn se na ma kosro ngalngul uh lohi srah kacl Naboth we, elos ac lohela pac srah keim uh we!’”
20 ౨౦ అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.
Ke Ahab el liyalak Elijah, el fahk, “Mwet lokoalok luk, ya kom sifilpa koneyuyak?” Elijah el topuk, “Aok, nga konekomyak. Ke sripen kom sang nufon kuiyom in oru ma koluk ye mutun LEUM GOD,
21 ౨౧ యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను.
ouinge LEUM GOD El fahk nu sum, ‘Nga ac fah sot mwe ongoiya lulap nu fom. Nga ac kunauskomla ac onela mukul nukewa in sou lom, mwet fusr ac mwet matu oana sie.
22 ౨౨ ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను.
Sou lom ac fah oana sou lal Tokosra Jeroboam, wen natul Nebat, ac oapana sou lal Tokosra Baasha, wen natul Ahijah, mweyen kom akkasrkusrakyeyu ke kom kolla mwet Israel in oru ma koluk.’
23 ౨౩ యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి.
A funu kacl Jezebel, LEUM GOD El fahk mu kosro ngalngul ac fah kangla manol in siti Jezreel.
24 ౨౪ పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు.
Kutena mwet in sou lom su misa in siti uh, ac fah mongola sin kosro ngalngul, ac kutena su misa likin siti uh, ac fah mongola sin won vulture.” (
25 ౨౫ తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు.
Wangin sie mwet su sang insial nufon in oru ma koluk ye mutun LEUM GOD oana Ahab, ac el oru ouinge ke sripen Jezebel, mutan kial ah, el akkeye ma el oru.
26 ౨౬ ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు.
El tuh oru mwe mwekin na yohk ke el alu nu ke ma sruloala, oana ma mwet Amor elos oru, aok elos su LEUM GOD El lusla liki facl sac ke mwet Israel elos utyak nu we.)
27 ౨౭ అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.
Ke Elijah el kaskas tari, Ahab el salik nuknuk lal ac sarukla, ac nokomang nuknuk yohk eoa se. El srangesr mongo, ac el motul ke nuknuk yohk eoa, ac ke el forfor el asor ac toasr.
28 ౨౮ యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు.
LEUM GOD el fahk nu sel Elijah, mwet palu,
29 ౨౯ “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”
“Ku kom tuni ac liye ke Ahab el arulana sisilya ye mutuk uh? Ke el oru ouinge uh, nga ac tila sang ongoiya nu sel ke pacl el moul. Ongoiya ac fah tuku nu fin sou lal Ahab ke pacl lun wen natul.”