< రాజులు~ మొదటి~ గ్రంథము 20 >
1 ౧ సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.
А Вен-Адад цар сирски скупи војску своју, и имаше са собом тридесет и два цара, и коње и кола; и отишавши опколи Самарију и стаде је бити.
2 ౨ అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి వార్తాహరులను పంపి,
И посла посланике к Ахаву, цару Израиљевом у град,
3 ౩ “నీ వెండి, నీ బంగారం నావే. నీ భార్యల్లో నీ పిల్లల్లో అందమైన వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళే అని బెన్హదదు తెలియచేస్తున్నాడు” అని వారికి సందేశం పంపించాడు.
И поручи му: Овако вели Вен-Адад: Сребро твоје и злато твоје моје је, тако и жене твоје и твоји лепи синови моји су.
4 ౪ అందుకు ఇశ్రాయేలు రాజు “నా ప్రభూ, నా రాజా, నీవు చెప్పినట్టే నేనూ నాకున్నదంతా నీ ఆధీనంలో ఉన్నాం” అని చెప్పి వారిని పంపించాడు.
А цар Израиљев одговори и рече: Као што си рекао, господару мој царе, ја сам твој и све што имам.
5 ౫ ఆ వార్తాహరులు వెళ్లి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి, బెన్హదదు ఇలా అంటున్నాడని చెప్పారు. “నీవు నీ వెండినీ నీ బంగారాన్నీ నీ భార్యలనూ నీ పిల్లలనూ నాకు అప్పగించాలని నేను నా సేవకులను నీ దగ్గరికి పంపాను.
А посланици опет дођоше и рекоше: Овако вели Вен-Адад: Послао сам к теби и поручио: Сребро своје и злато своје и жене своје и синове своје да ми даш.
6 ౬ రేపు ఈ పాటికి వారు నీ ఇంటినీ నీ సేవకుల ఇళ్లనూ వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు.”
Зато ћу сутра у ово доба послати слуге своје к теби да прегледају кућу твоју и куће слуга твојих, и шта ти је год мило, они ће узети и однети.
7 ౭ అప్పుడు ఇశ్రాయేలు రాజు జాతి పెద్దలందర్నీ పిలిపించి “బెన్హదదు, నీ భార్యలనూ పిల్లలనూ వెండి బంగారాలనూ తీసుకుపోతానని కబురు పంపితే, నేను ఇవ్వనని చెప్పలేదు. అతడు చేయబోయే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి” అన్నాడు.
Тада дозва цар Израиљев све старешине земаљске и рече: Гледајте и видите како овај тражи зло; јер посла к мени по мене и по синове моје и по сребро моје и по злато моје, и ја му не браних.
8 ౮ “నీవతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు” అని ఆ పెద్దలూ ప్రజలంతా అతనితో చెప్పారు.
А све старешине и сав народ рекоше му: Не слушај га и не пристај.
9 ౯ కాబట్టి అహాబు అ వార్తాహరులతో “మీరు రాజైన నా యజమానితో ఇలాచెప్పండి. ‘నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని, ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చేయలేను’” అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్లి ఆ జవాబు తెలియచేశారు.
И рече посланицима Вен-Ададовим: Кажите цару господару мом: Што си прво поручио слузи свом све ћу учинити; али ово не могу учинити. Тако отидоше посланици и однесоше му тај одговор.
10 ౧౦ బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి “నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక” అని చెప్పి పంపాడు.
А Вен-Адад посла к њему и поручи: Тако да ми учине богови и тако додаду! Неће бити доста праха од Самарије да свему народу који иде за мном допадне по једна грст.
11 ౧౧ అందుకు ఇశ్రాయేలు రాజు “తన యుద్ధ కవచాన్ని ధరించకుండానే దాన్ని విప్పి, తీసేసిన వాడిలాగా అతిశయపడకూడదని బెన్హదదుతో చెప్పండి” అన్నాడు.
А цар Израиљев одговори и рече: Кажите: Нека се хвали онај који се опасује као онај који се распасује.
12 ౧౨ తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి “యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.
А кад он то чу пијући с царевима под шаторима, рече слугама својим: Дижите се. И дигоше се на град.
13 ౧౩ అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈ రోజే దాన్ని నీ చేతిలో పెడతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
Тада гле, приступи један пророк к Ахаву цару Израиљевом, и рече: Овако вели Господ: Видиш ли све ово мноштво? Ево, ја ћу ти га дати у руке данас да познаш да сам ја Господ.
14 ౧౪ “ఇది ఎవరివల్ల అవుతుంది?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త “రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు. “యుద్ధాన్ని ఎవరు మొదలెట్టాలి?” అని రాజు అడిగాడు. అతడు “నువ్వే” అని జవాబిచ్చాడు.
А Ахав рече: Преко кога? А он рече: Овако вели Господ: Преко момака кнезова земаљских. Опет рече: Ко ће заметнути бој? А он рече: Ти.
15 ౧౫ అప్పుడు అహాబు రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల లెక్క చూశాడు. వారు 232 మంది ఉన్నారు. తరువాత సైనికులను, అంటే ఇశ్రాయేలు సైన్యాన్నంతా లెక్కిస్తే ఏడు వేలమంది అయ్యారు.
Тада преброја момке кнезова земаљских, и беше их двеста и тридесет и два; после њих преброја сав народ, све синове Израиљеве, и беше их седам хиљада.
16 ౧౬ వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.
И изиђоше у подне; а Вен-Адад пијући опи се у шаторима с тридесет и два цара који му дођоше у помоћ.
17 ౧౭ రాజ్యాధిపతుల్లో ఉన్న యువకులు మొదటగా బయలుదేరారు. విషయం తెలుసుకుందామని బెన్హదదు కొంతమందిని పంపించాడు. సమరయ నుంచి కొంతమంది వచ్చారని అతనికి తెలిసింది.
И изиђоше прво момци кнезова земаљских; а Вен-Адад посла, и јавише му и рекоше: Изиђоше људи из Самарије.
18 ౧౮ బెన్హదదు “వారు శాంతంగా వచ్చినా యుద్ధం చేయడానికి వచ్చినా వారిని ప్రాణాలతో పట్టుకు రండి” అని ఆజ్ఞాపించాడు.
А он рече: Ако су изашли мира ради, похватајте их живе; ако су изашли на бој, похватајте их живе.
19 ౧౯ రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడ ఉన్న సైన్యం, పట్టణంలో నుంచి బయలు దేరారు.
И изиђоше из града момци кнезова земаљских, и војска за њима.
20 ౨౦ వారిలో ప్రతివాడూ తనకెదురు వచ్చిన శత్రువుని చంపేశాడు. కాబట్టి సిరియా వారు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరిమారు. సిరియా రాజు బెన్హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతోపాటు తప్పించుకుపోయాడు.
И сваки уби с којим се сукоби, те Сирци побегоше, а Израиљци их потераше. И Вен-Адад, цар сирски побеже на коњу с коњицима.
21 ౨౧ అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రాలనూ రథాలనూ పట్టుకుని చాలామంది సిరియా వారిని చంపేశాడు.
И цар Израиљев изиђе и поби коње и кола, и учини велик покољ међу Сирцима.
22 ౨౨ అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీవు ధైర్యం తెచ్చుకో. నీవు చేయాల్సిందేదో కనిపెట్టి చూడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం సిరియారాజు నీ మీదికి మళ్ళీ వస్తాడు” అని అతనితో చెప్పాడు.
Потом дође пророк к цару Израиљевом и рече му: Иди, буди храбар; и промисли и види шта ћеш чинити, јер ће до године опет доћи цар сирски на те.
23 ౨౩ అయితే సిరియా రాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు. “వాళ్ళ దేవుడు కొండల దేవుడు. అందుకే వాళ్ళు మన కంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం.
А цару сирском рекоше слуге његове: Њихови су богови горски богови, зато нас надјачаше; него да се бијемо с њима у пољу, за цело ћемо их надјачати.
24 ౨౪ ఇంకా నువ్విలా చెయ్యి. ఈ రాజులందరినీ తీసేసి, వారికి బదులు సైన్యాధిపతులను నియమించు.
Учини дакле овако: Уклони те цареве с места њихових, и постави војводе место њих.
25 ౨౫ నీవు పోగొట్టుకున్న సైన్యమంత మరో సైన్యాన్నీ గుర్రానికి గుర్రాన్నీ రథానికి రథాన్నీ సిద్ధం చెయ్యి. అప్పుడు మనం మైదానంలో వారితో యుద్ధం చేసి, తప్పకుండా గెలుస్తాం.” అతడు వారి సలహా విని, వాళ్ళు చెప్పినట్టు చేశాడు.
Па скупи војску каква је била она која је изгинула, и коње какви су били они коњи, и кола као она кола; па да се побијемо с њима у пољу; зацело ћемо их надјачати. И послуша их, и учини тако.
26 ౨౬ కొత్త సంవత్సరం మొదట్లో, బెన్హదదు సిరియనులను సిద్ధం చేసి లెక్క చూసి బయలుదేరి, ఇశ్రాయేలువారితో యుద్ధం చేయడానికి ఆఫెకు వచ్చాడు.
А кад прође година, Вен-Адад преброја Сирце, и пође у Афек да војује на Израиља.
27 ౨౭ ఇశ్రాయేలు వారంతా సిద్ధపడి వాళ్ళని ఎదుర్కోడానికి బయలుదేరారు. ఇశ్రాయేలు వారు రెండు మేకల మందల్లాగా వాళ్ళ ఎదుట దిగారు. ఆ ప్రాంతమంతా సిరియా వాళ్ళతో నిండిపోయింది.
А синови Израиљеви пребројаше се, и понесавши хране изиђоше пред њих. И стадоше у логор синови Израиљеви према њима, као два мала стада коза, а Сирци беху прекрилили земљу.
28 ౨౮ అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు’ అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.”
Тада дође човек Божји, и проговори цару Израиљевом, и рече: Овако вели Господ: Што Сирци рекоше да је Господ горски Бог а није Бог пољски, зато ћу ти дати у руке све ово мноштво велико да знате да сам ја Господ.
29 ౨౯ వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఏడు రోజులున్నారు. ఏడో రోజున యుద్ధం మొదలయింది. ఇశ్రాయేలు వారు ఒక్క రోజులోనే సిరియను సైన్యంలోని లక్షమంది కాల్బలాన్ని చంపేశారు.
И стајаху у логору једни према другима седам дана; а седмог дана побише се, и синови Израиљеви побише Сираца сто хиљада пешака у један дан.
30 ౩౦ మిగతావారు ఆఫెకు పట్టణంలోకి పారిపోతే, పట్టణ గోడ కూలి 27,000 మంది చనిపోయారు. బెన్హదదు కూడా ఆ పట్టణంలోకి పారిపోయి ఒక ఇంట్లో లోపలి గదిలో దాక్కున్నాడు.
А остали побегоше у град Афек, и паде зид на двадесет и седам хиљада људи који беху остали. И Вен-Адад побегав у град уђе у најтајнију клет.
31 ౩౧ అతని సేవకులు “ఇశ్రాయేలు వారి రాజులు దయగల వారని మేము విన్నాం. కాబట్టి నీకు అనుకూలమైతే, మేము నడుం చుట్టూ గోనెపట్టాలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోతాం. అతడు నీ ప్రాణాన్ని కాపాడతాడేమో” అని రాజుతో అన్నారు. రాజు అందుకు ఒప్పుకున్నాడు.
А слуге му рекоше: Ево чули смо да су цареви дома Израиљевог милостиви цареви; да вежемо кострет око себе и да метнемо узице себи око вратова, па да изиђемо пред цара Израиљевог, да ако остави у животу душу твоју.
32 ౩౨ కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు” అని చెప్పారు. అతడు “బెన్హదదు నా సోదరుడు. అతడింకా బతికే ఉన్నాడా” అని అడిగాడు.
И везаше кострет око себе, и метнуше узице себи око вратова, и дођоше к цару Израиљевом и рекоше: Слуга твој Вен-Адад вели: Остави у животу душу моју. А он рече: Је ли још жив? Брат ми је.
33 ౩౩ అప్పుడు వాళ్ళు అహాబు దగ్గర్నుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి, అతడా మాట అనగానే వెంటనే “అవును, బెన్హదదు మీ సోదరుడే” అన్నారు. అప్పుడు అహాబు “మీరు వెళ్లి అతన్ని తీసుకు రండి” అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు, అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు.
А људи узеше то за добар знак, и одмах да би га ухватили за реч рекоше: Брат је твој Вен-Адад. А он рече: Идите, доведите га. Тада Вен-Адад изиђе к њему; а он га посади на своја кола.
34 ౩౪ బెన్హదదు అహాబుతో “మీ తండ్రి చేతిలోనుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు, దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు” అన్నాడు. అహాబు జవాబిస్తూ “అలా చేస్తే ఈ ఒప్పందంతో నిన్ను వదిలేస్తాను” అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు.
Тада му рече Вен-Адад: Градове које је узео отац мој твом оцу, вратићу, и начини себи улице у Дамаску као што је отац мој учинио у Самарији. А он одговори: С том вером отпустићу те. И учини веру с њим, и отпусти га.
35 ౩౫ ప్రవక్తల బృందంలో ఒకడు, యెహోవా ద్వారా ప్రేరణ పొంది, తన తోటి ప్రవక్తతో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు.
Тада један између синова пророчких рече другом по речи Господњој: Биј ме. Али га онај не хте бити.
36 ౩౬ అప్పుడా ప్రవక్త తన తోటి ప్రవక్తతో “నీవు యెహోవా మాట వినలేదు. కాబట్టి నీవు నా దగ్గరనుంచి వెళ్లిపోగానే సింహం నిన్ను చంపేస్తుంది” అన్నాడు. అతడు వెళ్లిపోతుంటే సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది.
А он му рече: Што не послуша глас Господњи, зато, ево кад отидеш од мене, лав ће те заклати. И кад отиде од њега, сукоби га лав и закла га.
37 ౩౭ తరువాత ఆ ప్రవక్త మరొకనితో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరచాడు.
Опет, нашав другог рече му: Биј ме. А онај га изби и израни га.
38 ౩౮ అప్పుడా ప్రవక్త వెళ్లి, రాజు కోసం దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. తననెవరూ గుర్తుపట్టకుండా తన కళ్ళకు గుడ్డ కట్టుకున్నాడు.
Тада отиде пророк и стаде на пут куда ће цар проћи, и нагрди се пепелом по лицу.
39 ౩౯ రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “నీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, ‘ఇతన్ని చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి. లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి’ అన్నాడు.
А кад цар пролажаше, он викну цара и рече: Твој слуга беше изашао у бој, а један дошавши доведе ми човека и рече: Чувај овог човека; ако ли га нестане, биће твоја душа за његову душу, или ћеш платити таланат сребра.
40 ౪౦ అయితే నీ సేవకుడనైన నేను పనిమీద అటూ ఇటూ తిరుగుతుంటే వాడు తప్పించుకు పోయాడు.” అప్పుడు ఇశ్రాయేలు రాజు “నీకిదే శిక్ష. దాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు” అన్నాడు.
А кад твој слуга имаше посла тамо амо, њега неста. Тада му рече цар Израиљев: То ти је суд, сам си одсудио.
41 ౪౧ ఆ ప్రవక్త వెంటనే తన కళ్ళమీదున్న గుడ్డ తీసేశాడు. అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు గుర్తించాడు.
А он брже убриса пепео с лица, и цар Израиљев позна га да је један од пророка.
42 ౪౨ ప్రవక్త రాజుతో “యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి. అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు” అన్నాడు.
А он му рече: Овако вели Господ: Што си пустио из руку човека ког сам ја осудио да се истреби, душа ће твоја бити за његову душу и народ твој за његов народ.
43 ౪౩ ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంగా సమరయలోని తన భవనానికి వెళ్ళిపోయాడు.
И отиде цар Израиљев кући својој зловољан и љутит, и дође у Самарију.