< రాజులు~ మొదటి~ గ్రంథము 2 >
1 ౧ దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు,
a det led mot den tid at David skulde dø, bød han sin sønn Salomo og sa:
2 ౨ “మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు.
Jeg går all jordens vei; så vær du sterk og vær en mann!
3 ౩ నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు.
Og ta vare på hvad Herren din Gud vil ha varetatt, så du vandrer på hans veier og holder hans forskrifter, hans bud og hans lover og hans vidnesbyrd, som der er skrevet i Mose lov, så du kan gå viselig frem i alt det du gjør og i alt du gir dig i ferd med,
4 ౪ అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.
forat Herren må opfylle sitt ord, det som han talte om mig da han sa: Dersom dine sønner akter vel på sin vei så de vandrer for mitt åsyn i sannhet, av hele sitt hjerte og av hele sin sjel, så skal det - sa han - aldri fattes en mann av din ætt på Israels trone.
5 ౫ అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు.
Du vet og hvad Joab, Serujas sønn, har gjort mot mig - hvad han gjorde mot begge Israels hærførere, Abner, Ners sønn, og Amasa, Jeters sønn, hvorledes han drepte dem og utøste blod i fredstid som om det var krig, og lot det komme blod på beltet han hadde om sine lender, og på skoene han hadde på sine føtter, som om det var krig.
6 ౬ అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు. (Sheol )
Gjør derfor som din visdom lærer dig, og la ikke hans grå hår fare med fred ned i dødsriket. (Sheol )
7 ౭ నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు.
Men gileaditten Barsillais sønner skal du gjøre vel imot, og de skal være blandt dem som eter ved ditt bord; for på samme måte kom de mig i møte da jeg flyktet for din bror Absalom.
8 ౮ ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను.
Så har du og benjaminitten Sime'i fra Bahurim, sønn av Gera, hos dig; det var han som bante mig så stygt den dag jeg drog til Mahana'im; men siden kom han mig i møte ned til Jordan, og jeg tilsvor ham ved Herren og sa: Jeg skal ikke la dig dø for sverdet.
9 ౯ అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.” (Sheol )
Men la ham nu ikke bli ustraffet! Du er en vis mann og vil nok vite hvad du skal gjøre med ham, så du lar hans grå hår fare med blod ned i dødsriket. (Sheol )
10 ౧౦ ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు.
Så la David sig til hvile hos sine fedre og blev begravet i Davids stad.
11 ౧౧ దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు.
Den tid David var konge over Israel, var firti år; i Hebron regjerte han i syv år og i Jerusalem i tre og tretti år.
12 ౧౨ అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.
Og Salomo satt på sin far Davids trone, og hans kongedømme blev meget sterkt.
13 ౧౩ అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది. అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి,
Men Adonja, Haggits sønn, kom inn til Batseba, Salomos mor. Hun spurte: Kommer du med fred? Han svarte: Ja!
14 ౧౪ తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు. ఆమె “ఏమిటో చెప్పు” అంది.
Så sa han: Jeg har noget å tale med dig om. Hun sa: Tal!
15 ౧౫ అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది.
Da sa han: Du vet at riket var mitt, og at hele Israel hadde festet sine øine på mig og ventet at jeg skulde bli konge; men kongedømmet gikk fra mig og over til min bror; det var Herren som gav ham det.
16 ౧౬ ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.
Og nu er det en ting jeg vil be dig om; du må ikke vise mig bort! Hun svarte: Tal!
17 ౧౭ ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
Da sa han: Bed kong Salomo - for dig viser han ikke bort - at han vil gi mig Abisag fra Sunem til hustru!
18 ౧౮ బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
Batseba svarte: Godt, jeg skal tale til kongen for dig.
19 ౧౯ బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
Så gikk Batseba inn til kong Salomo for å tale til ham for Adonja, og kongen stod op og gikk henne i møte og bøide sig dypt for henne. Derefter satte han sig på sin trone, og det blev satt frem en trone for kongens mor, og hun satte sig ved hans høire side.
20 ౨౦ ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది. రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.
Hun sa: Det er bare en eneste liten ting jeg vil be dig om; du må ikke vise mig bort! Kongen svarte: Kom du med din bønn, mor! Jeg skal ikke vise dig bort.
21 ౨౧ అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.
Da sa hun: La din bror Adonja få Abisag fra Sunem til hustru!
22 ౨౨ అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.
Men kong Salomo svarte sin mor: Hvorfor ber du om Abisag fra Sunem for Adonja? Bed da like så godt om riket for ham - han er jo min eldre bror - ja både for ham og for presten Abjatar og for Joab, Serujas sønn!
23 ౨౩ అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక.
Og kong Salomo svor ved Herren og sa: Herren la det gå mig ille både nu og siden om ikke dette ord skal koste Adonja hans liv.
24 ౨౪ నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు.
Så sant Herren lever, han som har gitt mig denne makt og satt mig på min far Davids trone, og som har bygget mig et hus, således som han har talt: Adonja skal late livet idag!
25 ౨౫ అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.
Så sendte kong Salomo Benaja, Jojadas sønn, avsted, og han hugg ham ned så han døde.
26 ౨౬ తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను” అని చెప్పాడు.
Og til presten Abjatar sa kongen: Gå til Anatot, til din gård, for du har fortjent døden; men idag vil jeg ikke la dig dø, fordi du har båret Herrens, Israels Guds ark foran min far David, og fordi du har lidt med i alt hvad min far måtte lide.
27 ౨౭ తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది.
Så drev Salomo Abjatar bort og lot ham ikke få være Herrens prest lenger, forat Herrens ord skulde bli opfylt, det som han hadde talt mot Elis hus i Silo.
28 ౨౮ యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.
Da Joab fikk høre om dette, flyktet han til Herrens telt og grep fatt i alterets horn; for Joab hadde holdt med Adonja, om han enn ikke hadde holdt med Absalom.
29 ౨౯ యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి “నీవు వెళ్లి అతని మీద పడి చంపు” అని ఆజ్ఞాపించాడు.
Men det blev meldt kong Salomo at Joab var flyktet til Herrens telt og stod ved alteret. Da sendte Salomo Benaja, Jojadas sønn, avsted og sa: Gå og hugg ham ned!
30 ౩౦ బెనాయా యెహోవా గుడారానికి వచ్చి “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని యోవాబుతో చెప్పాడు. అతడు “రాను, నేనిక్కడే చనిపోతాను” అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.
Da Benaja kom til Herrens telt, sa han til ham: Så sier kongen: Gå bort herfra! Men han sa: Nei, her vil jeg dø. Og Benaja bar bud tilbake til kongen og sa: Så sa Joab, og så svarte han mig.
31 ౩౧ అందుకు రాజు ఇలా అన్నాడు. “అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి.
Da sa kongen til ham: Gjør som han sier, og hugg ham ned og begrav ham! Så frir du mig og min fars hus fra det uskyldige blod som Joab har utøst.
32 ౩౨ నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు.
Og Herren skal la hans blod komme tilbake på hans hode fordi han hugg ned to menn som var rettferdigere og bedre enn han, og drepte dem med sverdet, så min far David ikke visste om det, Abner, Ners sønn, Israels hærfører, og Amasa, Jeters sønn, Judas hærfører.
33 ౩౩ అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”
Deres blod skal komme tilbake på Joabs hode og på hans efterkommeres hode til evig tid; men David og hans efterkommere og hans hus og hans trone skal Herren gi lykke til evig tid.
34 ౩౪ కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు.
Så gikk Benaja, Jojadas sønn, op og hugg ham ned og drepte ham, og han blev begravet ved sitt hus i ørkenen.
35 ౩౫ రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.
Og kongen satte Benaja, Jojadas sønn, over hæren i hans sted, og presten Sadok satte kongen i Abjatars sted.
36 ౩౬ తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. “నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు.
Så sendte kongen bud efter Sime'i og sa til ham: Bygg dig et hus i Jerusalem og bo der og gå ikke ut derfra, hverken til det ene sted eller det annet.
37 ౩౭ నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.”
For det skal du vite for visst, at den dag du går ut og går over bekken Kidron, skal du dø; ditt blod skal komme på ditt eget hode.
38 ౩౮ అప్పుడు షిమీ “మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను” అని రాజుతో చెప్పాడు. షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు.
Da sa Sime'i til kongen: Det er rett det du sier; som min herre kongen har sagt, så skal din tjener gjøre. Og Sime'i blev boende i Jerusalem en lang tid.
39 ౩౯ అయితే మూడు సంవత్సరాల తరవాత షిమీ పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరకి చేరారు. అప్పుడు “నీ మనుషులు గాతులో ఉన్నారు” అని షిమీకి వార్త వచ్చింది.
Men da tre år var gått, hendte det at to av Sime'is tjenere rømte til kongen i Gat, Akis. sønn av Ma'aka. og det blev meldt Sime'i: Dine tjenere er i Gat.
40 ౪౦ షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరకి వెళ్ళి, అక్కడి నుండి తన పనివారిని తీసుకువచ్చాడు.
Da gjorde Sime'i sig rede og salte sitt asen og drog til Akis i Gat for å lete efter sine tjenere; Sime'i drog da dit og hadde sine tjenere med sig tilbake fra Gat.
41 ౪౧ షిమీ యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది.
Men Salomo fikk vite at Sime'i var reist fra Jerusalem til Gat og var kommet tilbake.
42 ౪౨ రాజు షిమీని పిలిపించి అతనితో “నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి, నీచేత ప్రమాణం చేయించాను గదా? పైగా, ‘మీరు చెప్పిందే మంచిది’ అని నీవు కూడా ఒప్పుకున్నావు.
Da sendte kongen bud efter Sime'i og sa til ham: Har jeg ikke svoret ved Herren og høitidelig sagt dig: Det skal du vite for visst at den dag du går ut og drar til noget annet sted, skal du dø? Og du svarte: Det er rett det du sier; jeg har hørt det.
43 ౪౩ కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు?” అని అడిగాడు.
Hvorfor har du da ikke holdt dig efter den ed som var svoret ved Herren, og det bud jeg gav dig?
44 ౪౪ “నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పిస్తాడు.
Og kongen sa til Sime'i: Du kjenner selv alt det onde som ditt hjerte vet om at du har gjort mot min far David, og Herren lar nu din ondskap komme tilbake på ditt eget hode.
45 ౪౫ అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలం సుస్థిరమౌతుంది” అని షిమీతో చెప్పి
Men kong Salomo skal være velsignet, og Davids trone skal stå fast for Herrens åsyn til evig tid.
46 ౪౬ రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది.
Så gav kongen Benaja, Jojadas sønn, sin befaling, og han gikk ut og hugg ham ned så han døde. Og kongedømmet lå trygt og fast i Salomos hånd.