< రాజులు~ మొదటి~ గ్రంథము 18 >

1 చాలా రోజులు గడిచిన తరువాత కరువు కాలంలో మూడో సంవత్సరం యెహోవా ఏలీయాతో “నేను భూమ్మీద వాన కురిపిస్తాను. నీవు వెళ్లి అహాబుకు కనబడు” అన్నాడు.
After many days, the word of the Lord came to Elijah, in the third year, saying, “Go and show yourself to Ahab, so that I may grant rain upon the face of the earth.”
2 అహాబును కలుసుకోడానికి ఏలీయా వెళ్ళాడు. షోమ్రోనులో కరువు తీవ్రంగా ఉంది.
Therefore, Elijah went to show himself to Ahab. For there was a severe famine in Samaria.
3 అహాబు తన కార్యనిర్వాహకుడు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్యా యెహోవా పట్ల చాలా భయభక్తులు గలవాడు.
And Ahab called Obadiah, the manager of his household. Now Obadiah feared the Lord greatly.
4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఉన్నప్పుడు గుహకు యాభై మంది చొప్పున రెండు గుహల్లో వంద మందిని దాచి, అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాడు.
For when Jezebel was killing the prophets of the Lord, he took one hundred prophets, and concealed them, fifty and fifty, in caves. And he fed them with bread and water.
5 అహాబు ఓబద్యాతో “దేశంలోని నీటి ఊటలనూ వాగులనూ చూడడానికి వెళ్ళు. మన గుర్రాలూ కంచర గాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు. అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం” అన్నాడు.
Then Ahab said to Obadiah, “Go into the land, to all fountains of water, and to all the valleys, for perhaps we will be able to find plants, and save the horses and mules, so that the beasts of burden may not perish entirely.”
6 కాబట్టి వాళ్ళు నీళ్ళ కోసం దేశమంతా తిరగి చూడడానికి బృందాలుగా వెళ్ళారు. అహాబు ఒక్కడే ఒక వైపూ ఓబద్యా మరొక వైపూ వెళ్ళారు.
And they divided the regions among themselves, so that they might travel through them. Ahab went one way alone, and Obadiah went another way by himself.
7 ఓబద్యా దారిలో వెళుతుంటే అనుకోకుండా ఏలీయా ఎదురు పడ్డాడు. ఓబద్యా అతన్ని గుర్తు పట్టి సాష్టాంగ నమస్కారం చేసి “మీరు నా యజమాని ఏలీయా గదా” అని అడిగాడు.
And while Obadiah was on the way, Elijah met him. And when he had recognized him, he fell on his face, and he said, “Are you not my lord Elijah?”
8 అతడు “నేనే. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పు” అన్నాడు.
And he responded to him: “I am. Go and tell your lord that Elijah is here.”
9 అందుకు ఓబద్యా “అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడినైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను?
And he said: “How have I sinned that you would deliver me, your servant, into the hand of Ahab, so that he would put me to death?
10 ౧౦ నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించని దేశం గానీ రాజ్యం గానీ లేదు. ‘ఏలీయా ఇక్కడ లేడు’ అని ఆ దేశం గానీ రాజ్యం గానీ అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు.
As the Lord your God lives, there is no nation or kingdom to which my lord has not sent, seeking you. And when all responded, ‘He is not here,’ he swore each kingdom and nation to an oath, because you were not found at all.
11 ౧౧ నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పమని నాకు చెబుతున్నావే!
And now, you say to me, ‘Go and tell your lord that Elijah is here.’
12 ౧౨ నేను నీ దగ్గరనుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ, నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్లి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటి నుంచి యెహోవాపట్ల భయభక్తులు గలిగిన వాణ్ణి.
And when I will have departed from you, the Spirit of the Lord will transport you to a place that I do not know. And entering, I will report to Ahab. And he, not finding you, will put me to death. Yet your servant has feared the Lord from his infancy.
13 ౧౩ యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తుంటే నేనేం చేశానో నీకు తెలియదా? నేను యెహోవా ప్రవక్తల్లో వందమందిని, గుహకు యాభై మంది చొప్పున దాచి, భోజనం పెట్టి వారిని పోషించాను.
Has it not been revealed to you, my lord, what I did when Jezebel was killing the prophets of the Lord: how I hid one hundred men from the prophets of the Lord, fifty and fifty, in caves, and how I fed them with bread and water?
14 ౧౪ ఇప్పుడు ఏలీయా ఇక్కడున్నాడని నీ యజమానికి చెప్పు అంటున్నావే, అహాబు నన్ను చంపేస్తాడు” అని మనవి చేశాడు.
And now you say: ‘Go and tell your lord that Elijah is here,’ so that he may kill me!”
15 ౧౫ అప్పుడు ఏలీయా “ఎవరి సన్నిధిలో నేను నిలుచున్నానో దూతల సైన్యాల అధిపతి అయిన యెహోవా జీవం తోడు, కచ్చితంగా ఈ రోజు నేను అహాబును కలుసుకుంటాను” అన్నాడు.
And Elijah said, “As the Lord of hosts lives, before whose face I stand, this day I will appear to him.”
16 ౧౬ కాబట్టి ఓబద్యా అహాబును కలుసుకుని ఈ విషయం తెలియచేశాడు. వెంటనే ఏలీయాను కలుసుకోడానికి అహాబు బయలుదేరాడు.
Therefore, Obadiah went away to meet Ahab, and he reported to him. And Ahab went to meet Elijah.
17 ౧౭ అహాబు ఏలీయాను చూడగానే “ఇశ్రాయేలు ప్రజా కంటకుడా, నువ్వేనా” అన్నాడు.
And when he had seen him, he said, “Are you the one who is disturbing Israel?”
18 ౧౮ ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలను కష్ట పెట్టేది నేను కాదు, నువ్వూ నీ తండ్రి వంశం వాళ్ళు. మీరు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలు విగ్రహాలను అనుసరించారు.
And he said: “I have not troubled Israel. But it is you, and the house of your father, who have abandoned the commandments of the Lord, and have followed the Baals.
19 ౧౯ అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలు దేవుడి ప్రవక్తలు 450 మందినీ అషేరాదేవి ప్రవక్తలు 400 మందినీ నా దగ్గరికి కర్మెలు పర్వతానికి పిలిపించు” అన్నాడు.
Yet truly now, send and gather to me all of Israel, on Mount Carmel, with the four hundred and fifty prophets of Baal, and the four hundred prophets of the sacred groves, who eat from the table of Jezebel.”
20 ౨౦ అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు.
Ahab sent to all the sons of Israel, and he gathered together the prophets on mount Carmel.
21 ౨౧ ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు.
Then Elijah, drawing near to all the people, said: “How long will you waver between two sides? If the Lord is God, follow him. But if Baal is, then follow him.” And the people did not respond a word to him.
22 ౨౨ అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు.
And Elijah said again to the people: “I alone remain as a prophet of the Lord. But the prophets of Baal are four hundred and fifty men.
23 ౨౩ మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను.
Let two oxen be given to us. And let them choose one ox for themselves, and, cutting it into pieces, let them set it on the wood. But they may not place fire under it. And I will prepare the other ox, and set it on the wood. But I will not place fire under it.
24 ౨౪ తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు.
Call upon the names of your gods. And I will call on the name of my Lord. And the God who will have heeded with fire, let him be God.” And in response, all the people said, “Excellent proposition.”
25 ౨౫ అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు.
Then Elijah said to the prophets of Baal: “Choose for yourselves one ox, and prepare it first. For you are many. And call on the names of your gods, but do not place fire under it.”
26 ౨౬ వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.
And when they had taken an ox, which he had given to them, they prepared it. And they called on the name of Baal, from morning even until midday, saying, “O Baal, heed us.” And there was no voice, nor did anyone respond. And so they leaped upon the altar that they had made.
27 ౨౭ మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు.
And when it was now midday, Elijah ridiculed them, saying: “Cry out with a louder voice. For he is a god, and perhaps he is talking, or at an inn, or on a journey, or certainly he may be asleep, and must be awakened.”
28 ౨౮ వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు.
Then they cried out with a loud voice, and they cut themselves, in accord with their ritual, with knives and lancets, until they were entirely covered in blood.
29 ౨౯ ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు.
Then, after midday had passed, and they were prophesying, the time had arrived when the sacrifice is usually offered. And there was no voice heard, neither did anyone heed or respond to the praying.
30 ౩౦ అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు.
Elijah said to all the people, “Draw near to me.” And as the people were drawing near to him, he repaired the altar of the Lord, which had been torn down.
31 ౩౧ “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు.
And he took twelve stones, in accord with the number of the tribes of the sons of Jacob, to whom the word of the Lord came, saying, “Israel shall be your name.”
32 ౩౨ ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు.
And he built from the stones an altar to the name of the Lord. And he made a trench for water, like two furrows of plowed land, all around the altar.
33 ౩౩ కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు.
And he arranged the wood, and he cut the ox into pieces, and he placed it on the wood.
34 ౩౪ తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు.
And he said, “Fill four containers with water, and pour it over the holocaust, and over the wood.” And again, he said, “Do this a second time.” And when they had done it a second time, he said, “Do it also a third time.” And they did so a third time.
35 ౩౫ అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు.
And the water was running down around the altar, and the pit of the trench was filled with water.
36 ౩౬ సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు.
And when it was now time for the holocaust to be offered, the prophet Elijah, drawing near, said: “O Lord, God of Abraham, and Isaac, and Israel, reveal this day that you are the God of Israel, and that I am your servant, and that I have acted, in all these things, in accord with your precept.
37 ౩౭ యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు.
Heed me, O Lord, heed me, so that this people may learn that you are the Lord God, and that you have converted their heart again.”
38 ౩౮ అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది.
Then the fire of the Lord fell down and devoured the holocaust, and the wood, and the stones, and even the dust, and it absorbed the water that was in the trench.
39 ౩౯ ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు.
And when all the people had seen it, they fell upon their face, and they said: “The Lord himself is God! The Lord himself is God!”
40 ౪౦ అప్పుడు ఏలీయా “బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు” అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.
And Elijah said to them, “Apprehend the prophets of Baal, and do not let even one of them escape.” And when they had apprehended them, Elijah led them down to the torrent Kishon, and he put them to death there.
41 ౪౧ ఏలీయా “పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది. నీవు వెళ్లి భోజనం చెయ్యి” అని అహాబుతో చెప్పాడు.
And Elijah said to Ahab “Ascend; eat and drink. For there is the sound of an abundance of rain.”
42 ౪౨ అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.
Ahab ascended, so that he might eat and drink. But Elijah ascended to the top of Carmel, and bending down to the ground, he placed his face between his knees.
43 ౪౩ తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి “నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి “ఏమీ కనబడ్డం లేదు” అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు “వెళ్లి చూడు” అన్నాడు.
And he said to his servant, “Ascend, and gaze out toward the sea.” And when he had ascended, and had contemplated, he said, “There is nothing.” And again, he said to him, “Return seven times.”
44 ౪౪ ఏడో సారి అతడు చూసి “అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం, సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది” అన్నాడు. అప్పుడు ఏలీయా “నీవు అహాబు దగ్గరికి వెళ్లి, నీ రథాన్ని సిద్ధ పరచుకో, వానలో చిక్కుకుపోక ముందే వెళ్ళిపో” అని చెప్పమని అతన్ని పంపాడు.
And at the seventh time, behold, a little cloud ascended from the sea like the footstep of a man. And he said: “Ascend, and say to Ahab, ‘Yoke your chariot, and descend; otherwise, the rain may prevent you.’”
45 ౪౫ అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడైంది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలు పట్టణం వెళ్లిపోయాడు.
And as he was turning himself this way and that, behold, the heavens were darkened, and there were clouds and wind, and a great rainstorm occurred. And so Ahab, going up, went away to Jezreel.
46 ౪౬ అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రెయేలు చేరుకున్నాడు.
And the hand of the Lord was upon Elijah. And cinching his waist, he ran before Ahab, until he arrived at Jezreel.

< రాజులు~ మొదటి~ గ్రంథము 18 >