< రాజులు~ మొదటి~ గ్రంథము 17 >
1 ౧ గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
Un Elija no Tizbes, no Gileādas iedzīvotājiem, sacīja uz Ahabu: tik tiešām kā Tas Kungs, Israēla Dievs, dzīvo, kā priekšā es stāvu, šinīs gados nebūs nedz rasas nedz lietus, kā vien, kad es to sacīšu.
2 ౨ ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు.
Un Tā Kunga vārds uz to notika tā:
3 ౩ “నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో.
Ej no šejienes un griezies pret rītiem un paslēpies pie Krites upes, kas tek pret Jardāni.
4 ౪ ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు.
Un tur tu vari dzert no tās upes, un Es kraukļiem esmu pavēlējis, ka tiem tevi tur būs uzturēt.
5 ౫ అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు.
Un viņš nogāja un darīja pēc Tā Kunga vārda, un nogāja un palika pie Krites upes, kas tek pret Jardāni.
6 ౬ అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.
Un kraukļi viņam atnesa maizi un gaļu rītos un maizi un gaļu vakaros, un viņš dzēra no tās upes.
7 ౭ కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది.
Bet pēc kāda laika tā upe izsīka, jo lietus tai zemē nebija.
8 ౮ యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు.
Tad Tā Kunga vārds uz viņu notika tā:
9 ౯ నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.”
Celies un ej uz Sareptu, kas pie Sidones pieder, un paliec turpat; redzi, Es tur esmu pavēlējis vienai atraitnei, tevi uzturēt.
10 ౧౦ కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు.
Tad viņš cēlās un gāja uz Sareptu Un kad viņš nonāca pie pilsētas vārtiem, redzi, tad tur viena atraitne lasīja malku. Un viņš tai sauca un sacīja: atnes man traukā kādu ūdens malciņu, ko dzert.
11 ౧౧ ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు.
Un tā gāja to atnest. Un viņš tai sauca un sacīja: atnes man arī kumosu maizes savā rokā.
12 ౧౨ అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది.
Bet tā sacīja: tik tiešām kā Tas Kungs, tavs Dievs, dzīvo, man nekā cepta nav, un tik vien ir sauja miltu tīnē un maķenīt eļļas krūzē, un redzi, es esmu salasījusi kādu pāri malkas gabaliņu, un nu es iešu un sev un savam dēlam ko pataisīšu, ka ēdam un mirstam.
13 ౧౩ అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో.
Un Elija uz to sacīja: nebīsties, ej, pataisi to, kā tu sacījusi, bet man taisi no tiem papriekš mazu rausi un iznes man to ārā, un pēc tu arī varēsi taisīt sev un savam dēlam.
14 ౧౪ భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.”
Jo tā saka Tas Kungs, Israēla Dievs: milti tīnē neies galā un krūzē eļļas netrūks līdz tai dienai, kad Tas Kungs dos lietu virs zemes.
15 ౧౫ అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు.
Un tā nogāja un darīja pēc Elijas vārda; tā viņa ēda un viņš un viņas nams labu laiku;
16 ౧౬ యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
Milti tīnē negāja galā un krūzē eļļas netrūka pēc Tā Kunga vārda, ko viņš caur Eliju bija runājis.
17 ౧౭ కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు.
Un pēc tam notikās, ka šīs sievas, tās nama mātes, dēls palika slims un viņa slimība palika ļoti grūta, kamēr viņam dvašas vairs nebija.
18 ౧౮ ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది.
Un tā sacīja uz Eliju: kas man ar tevi, tu Dieva vīrs? Tu pie manis esi atnācis, lai mani grēki top pieminēti un mans dēls mirst.
19 ౧౯ అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు.
Un viņš uz to sacīja: dod man šurp savu dēlu. Un viņš to ņēma no viņas klēpja un to uznesa augšistabā, kur viņš mita, un to lika uz savu gultu.
20 ౨౦ “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు.
Un viņš piesauca To Kungu un sacīja: Kungs, mans Dievs! Vai tad Tu šai atraitnei, pie kuras es piemājoju, tik ļaunu esi darījis un nonāvējis viņas bērnu?
21 ౨౧ ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు.
Un viņš stiepās pār to bērnu trīs reizes un piesauca To Kungu un sacīja: Kungs, mans Dievs! Lai jel šā bērna dvēsele atkal nāk iekš viņa!
22 ౨౨ యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు.
Un Tas Kungs klausīja Elijas balsi, un tā bērna dvēsele atkal nāca iekš viņa, un tas atdzīvojās.
23 ౨౩ ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు.
Un Elija ņēma to bērnu un to nonesa no augšistabas namā un to deva viņa mātei; un Elija uz to sacīja: redzi še, tavs dēls dzīvs.
24 ౨౪ ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.
Tad tā sieva sacīja uz Eliju: nu es zinu, ka tu esi Dieva vīrs, un Tā Kunga vārds tavā mutē ir patiesība.