< రాజులు~ మొదటి~ గ్రంథము 15 >
1 ౧ నెబాతు కొడుకు యరొబాము రాజు పరిపాలన 18 వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలెట్టాడు.
Léta pak osmnáctého království Jeroboáma syna Nebatova, kraloval Abiam nad Judou.
2 ౨ అతడు యెరూషలేములో మూడేళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు.
Tři léta kraloval v Jeruzalémě. A jméno matky jeho bylo Maacha, dcera Abissalomova.
3 ౩ అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.
Ten chodil ve všech hříších otce svého, kteréž páchal před oblíčejem jeho; a nebylo srdce jeho celé při Hospodinu Bohu jeho, jako srdce Davida otce jeho.
4 ౪ దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు.
A však pro Davida dal jemu Hospodin Bůh jeho svíci v Jeruzalémě, vzbudiv syna jeho po něm, a utvrdiv Jeruzalém,
5 ౫ అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు.
Proto že David činil to, což bylo dobrého před Hospodinem, a neuchýlil se od žádné věci z těch, kteréž jemu byl přikázal, po všecky dny života svého, kromě skutku při Uriášovi Hetejském.
6 ౬ రెహబాము బతికిన రోజులన్నీ అతనికీ యరొబాముకూ యుద్ధం జరుగుతూ ఉండేది.
A byl boj mezi Roboámem a Jeroboámem po všecky dny života jeho.
7 ౭ అబీయా యరొబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
Jiné pak věci Abiamovy, a všecko což činil, popsáno jest v knize o králích Judských, ano i o boji mezi Abiamem a Jeroboámem.
8 ౮ అబీయా చనిపోగా తన పూర్వీకులతో పాటు దావీదు పట్టణంలో అతన్ని సమాధిచేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు.
A když usnul Abiam s otci svými, pochovali ho v městě Davidově. I kraloval Aza syn jeho místo něho.
9 ౯ ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు.
A tak léta dvadcátého Jeroboáma, krále Izraelského, kraloval Aza nad Judou.
10 ౧౦ అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు.
Jedno a čtyřidceti let kraloval v Jeruzalémě. A jméno matky jeho bylo Maacha, dcera Abissalomova.
11 ౧౧ ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని
I činil Aza, což dobrého bylo před Hospodinem, jako David otec jeho.
12 ౧౨ మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు.
Nebo ohyzdné sodomáře vyplénil z země, a odjal všecky modly, kterýchž nadělali otcové jeho.
13 ౧౩ తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.
Nadto i Maachu matku svou ssadil, aby nebyla královnou; nebo byla udělala hroznou modlu v háji. Protož podťal Aza modlu tu ohyzdnou, a spálil při potoku Cedron.
14 ౧౪ ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు.
A ačkoli výsosti nebyly zkaženy, a však srdce Azovo bylo celé při Bohu po všecky dny jeho.
15 ౧౫ అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు.
Vnesl také ty věci, kteréž posvěceny byly od otce jeho, i ty věci, kterýchž sám posvětil, do domu Hospodinova, stříbro a zlato i nádoby.
16 ౧౬ ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.
Pročež byla válka mezi Azou a Bázou, králem Izraelským, po všecky dny jejich.
17 ౧౭ ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు.
Nebo Báza král Izraelský vytáhl proti Judovi, a stavěl Ráma, aby nedal žádnému vyjíti ani jíti k Azovi králi Judskému.
18 ౧౮ కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.
Ale vzav Aza všecko stříbro i zlato, kteréž pozůstalo v pokladích domu Hospodinova, a v pokladích domu královského, dal je v ruce služebníků svých, a poslal je král Aza k Benadadovi synu Tabremmon, syna Hezion, králi Syrskému, kterýž bydlil v Damašku, řka:
19 ౧౯ “మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”
Smlouva jest mezi mnou a mezi tebou, mezi otcem mým a mezi otcem tvým. Aj, teď posílám tobě dar, stříbro a zlato; jdi, zruš smlouvu svou s Bázou králem Izraelským, ať odtrhne ode mne.
20 ౨౦ కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.
I uposlechl Benadad krále Azy, a poslav knížata s vojsky svými proti městům Izraelským, dobyl Jon a Dan, též Abelbetmaachy, i všeho Ceneretu, a vší země Neftalím.
21 ౨౧ బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు.
To když uslyšel Báza, přestal stavěti Ráma, a zůstal v Tersa.
22 ౨౨ అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.
Tedy král Aza provolal po všem Judstvu, žádného nevyměňuje. I pobrali to kamení z Ráma, i dříví jeho, z něhož stavěl Báza, a vystavěl z toho král Aza Gabaa Beniaminovo a Masfa.
23 ౨౩ ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది.
Jiné pak všecky věci Azovy, i všecka síla jeho a cokoli dělal, i jaká města vystavěl, zapsáno jest v knize o králích Judských. Jen že v věku starosti své byl nemocný na nohy.
24 ౨౪ అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.
I usnul Aza s otci svými, a pochován jest s nimi v městě Davida otce svého. A kraloval místo něho Jozafat syn jeho.
25 ౨౫ యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు.
Nádab pak syn Jeroboámův, počal kralovati nad Izraelem léta druhého Azy, krále Judského, a kraloval nad Izraelem dvě létě.
26 ౨౬ అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.
A činil to, což zlého jest před očima Hospodinovýma, chodě po cestě otce svého, v hříších jeho, jimiž k hřešení přivodil lid Izraelský.
27 ౨౭ ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు.
I činil mu úklady Báza syn Achiášův z domu Izachar, a porazil ho Báza u Gebbeton, kteréž bylo Filistinských. Nádab zajisté a všickni Izraelští oblehli byli Gebbeton.
28 ౨౮ రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు.
A tak zabil ho Báza léta třetího Azy, krále Judského, a kraloval místo něho.
29 ౨౯ తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది.
I stalo se, když počal kralovati, že zahubil všecken dům Jeroboámův, a nepozůstavil žádné duše z Jeroboáma, až je i vyhladil vedlé řeči Hospodinovy, kterouž byl mluvil skrze služebníka svého Achiáše Silonského,
30 ౩౦ యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.
Pro hříchy Jeroboámovy, jimiž hřešil, a jimiž k hřešení přivodil lid Izraelský, pro dráždění jeho, kterýmž dráždil Hospodina Boha Izraelského.
31 ౩౧ నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.
Jiné pak věci Nádabovy a všecko, což činil, zapsáno jest v knize o králích Izraelských.
32 ౩౨ వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.
Byla tedy válka mezi Azou, a mezi Bázou králem Izraelským, po všecky dny jejich.
33 ౩౩ యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు.
Léta třetího Azy, krále Judského, kraloval Báza syn Achiášův nade vším Izraelem v Tersa za čtyřmecítma let.
34 ౩౪ ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.
A činil to, což zlého jest před Hospodinem, chodě po cestě Jeroboámově a v hříších jeho, jimiž k hřešení přivodil Izraele.