< రాజులు~ మొదటి~ గ్రంథము 13 >
1 ౧ ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.
Otu onye nke Chineke si Juda bịa Betel, site nʼokwu nke Onyenwe anyị oge Jeroboam guzo nʼebe ịchụ aja ka ọ chụọ aja.
2 ౨ ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.”
O tiri mkpu nʼoke olu megide ebe ịchụ aja ahụ dịka okwu Onyenwe anyị si dị, “Ebe ịchụ aja, ebe ịchụ aja! Otu a ka Onyenwe anyị na-ekwu: ‘A ga-amụ otu nwa nwoke nʼụlọ Devid, aha ya ga-abụ Josaya. Ọ ga-eji ndị nchụaja niile nke ebe dị elu, bụ ndị na-achụ aja nʼelu gị, chụọ aja nʼelu gị. A ga-esurekwa ọkpụkpụ ndị mmadụ ọkụ nʼelu gị.’”
3 ౩ అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు. “ఈ బలిపీఠం బద్దలై దానిమీదున్న బూడిద ఒలికి పోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.
Nʼụbọchị ahụ, onye nke Chineke ahụ kwuru okwu banyere ihe ịrịbama ga-emezu. O kwuru sị, “Nke a bụ ihe ịrịbama Onyenwe anyị ji emesi okwu ya ike: Ebe ịchụ aja a ga-agbawa ụzọ abụọ. Ntụ dị nʼelu ya ga-awụsasị nʼala.”
4 ౪ బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవ సేవకుడు ప్రకటించిన మాట యరొబామురాజు విని, బలిపీఠం మీదనుండి తన చెయ్యి చాపి “అతన్ని పట్టుకోండి” అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడి పోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు.
Mgbe eze Jeroboam nụrụ ihe onye nke Chineke ahụ kwuru megide ebe ịchụ aja Betel, o setịpụrụ aka ya site nʼebe ịchụ aja ahụ sị, “Jidenụ nwoke a!” Ma aka ahụ ọ setịpụrụ tụgide nwoke ahụ kpọnwụrụ na o nwekwaghị ike iweghachi ya azụ ọzọ.
5 ౫ యెహోవా మాట ప్రకారం దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై, దాని మీద నుండి బూడిద ఒలికి పోయింది.
Ọzọkwa, ebe ịchụ aja ahụ gbawara abụọ, ntụ dị nʼelu ya wụsịkwara nʼala dịka ihe ịrịbama nke onye amụma Chineke nyere, site nʼokwu Onyenwe anyị.
6 ౬ అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
Mgbe ahụ, eze sịrị onye nke Chineke ahụ, “Biko, rịọọ Onyenwe anyị Chineke gị, kpekwara m ekpere ka e nyeghachi m aka m.” Ya mere, onye nke Chineke ahụ rịọrọ Onyenwe anyị site nʼekpere, emekwara ka aka eze dịghachi dịkwa ka ọ dị na mbụ.
7 ౭ అప్పుడు రాజు “నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. నీకు బహుమతి ఇస్తాను” అని ఆ దైవసేవకుడితో చెప్పాడు.
Emesịa, eze gwara onye nke Chineke ahụ okwu sị, “Soro m gaa nʼụlọ m. Aga m enye gị ihe oriri, nyekwa gị onyinye.”
8 ౮ అప్పుడు దైవ సేవకుడు రాజుతో ఇలా అన్నాడు “నీవు నీ ఇంట్లో సగం నాకిచ్చినా నీతోబాటు నేను లోపలికి రాను. ఇక్కడ నేనేమీ తినను, తాగను.
Ma onye nke Chineke ahụ zara eze sị, “Ọ bụrụ na i nye m ọkara ihe niile i nwere, agaghị m eso gị baa nʼime ụlọ gị. Agaghị m erikwa nri gị maọbụ ṅụọ mmiri nʼebe a.
9 ౯ ఎందుకంటే, ఇక్కడేమీ తినొద్దనీ తాగొద్దనీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దనీ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.”
Nʼihi na-enyere m iwu site nʼokwu Onyenwe anyị, sị, ‘Erila nri, aṅụkwala mmiri, esitekwala ụzọ i si gaa laghachi.’”
10 ౧౦ అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిన కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు.
Ya mere, o sitere nʼụzọ ọzọ lawa, nke na-abụghị ụzọ o si bịa Betel.
11 ౧౧ బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవ సేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు.
Ma o nwere otu onye amụma bụ agadi bi na Betel. Onye ụmụ ya bịara kọọrọ ihe niile onye nke Chineke ahụ mere nʼụbọchị ahụ na Betel, ha kọkwaara nna ha ihe niile ọ gwara eze.
12 ౧౨ వారి తండ్రి “అతడు ఏ దారిన వెళ్ళాడు?” అని వారినడిగాడు. అతని కొడుకులు యూదాదేశాన్నుంచి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్ళాడో చెప్పారు.
Nna ha jụrụ ha, “Olee ụzọ ọ gara?” Ụmụ ya ndị ikom ziri ya ụzọ nke onye nke Chineke ahụ si Juda gara.
13 ౧౩ తరువాత అతడు తన కొడుకులను పిలిచి “నాకోసం గాడిద మీద జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదపై జీను వేశారు. అతడు దాని మీద ఎక్కి బయలుదేరాడు.
Mgbe ahụ, ọ sịrị ụmụ ya ndị ikom, “Jikekwaranụ m ịnyịnya ibu m.” Ha jikekwaara ya ịnyịnya ibu, ọ nọkwasịrị nʼelu ya.
14 ౧౪ సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి “యూదాదేశం నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.
Ọ gbasooro onye nke Chineke nʼazụ, ọ hụrụ ya ka ọ nọ ala nʼokpuru osisi ook, Ọ sịrị ya, “Ọ bụ gị bụ onye nke Chineke ahụ si Juda bịa?” Ọ zara, “E, ọ bụ mụ onwe m.”
15 ౧౫ అప్పుడు అతడు “నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి” అన్నాడు.
Onye amụma ahụ sịrị ya, “Soro m ka anyị gaa nʼụlọ m, ka i rie nri.”
16 ౧౬ అతడు “నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను.
Ma ọ sịrị, “Apụghị m iso gị laghachi azụ, maọbụ rie nri, ma ọ bụkwa ṅụọ mmiri ọbụla nʼebe a.
17 ౧౭ నీవు అక్కడ ఏదీ తినొద్దనీ తాగొద్దనీ నీవు వచ్చిన దారిలో వెళ్ళ వద్దనీ యెహోవా నాతో చెప్పాడు” అన్నాడు.
Nʼihi na a gwara m site nʼokwu Onyenwe anyị sị, ‘Erikwala nri maọbụ ṅụọ mmiri nʼebe ahụ, maọbụ soro ụzọ ị si gaa lọtakwa.’”
18 ౧౮ అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.
Ma onye nke ọzọ sịrị ya, “Mụ onwe m bụkwa onye amụma dịka gị, mmụọ ozi zikwara m ozi site nʼokwu Onyenwe anyị sị, ‘Kpọrọ ya ka o soro gị laghachi nʼụlọ gị, ka o rie nri, ṅụọkwa mmiri.’” (Ma ọ gwara ya okwu ụgha.)
19 ౧౯ అతడు ఆ ముసలి ప్రవక్త వెంట వెళ్లి అతని ఇంట్లో భోజనం చేశాడు.
Ya mere, nwoke nke Chineke ahụ soro ya laghachi rie nri, ṅụọkwa mmiri.
20 ౨౦ వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకొచ్చిన ఆ ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు.
Ma mgbe ha abụọ nọdụ na-eri ihe na tebul, okwu Onyenwe anyị rutere onye amụma agadi ahụ ntị, bụ onye mere ka ọ lọghachi azụ.
21 ౨౧ అతడు యూదాదేశాన్నుండి వచ్చిన దేవుని మనిషితో “యెహోవా ఇలా చెబుతున్నాడు, నీ దేవుడు యెహోవా నీకు చెప్పిన మాట వినక, ఆయన ఆజ్ఞాపించిన దాన్ని పాటించకుండా
Ọ kpọrọ onye nke Chineke ahụ si Juda bịa sị ya, “Otu a ka Onyenwe anyị na-ekwu, ‘Nʼihi na ị nupula isi nʼokwu ọnụ Onyenwe anyị, hapụ idebe iwu Onyenwe anyị Chineke gị nyere gị.
22 ౨౨ వెనక్కి వచ్చి, నీవు అక్కడ భోజనం చేయొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు” అని బిగ్గరగా చెప్పాడు.
Ị laghachikwara nʼebe a, rie nri, ṅụọkwa mmiri, bụ ebe ọ gwara gị sị gị, erila nri, aṅụkwala mmiri. Ya mere, agaghị eli ozu gị nʼala ili nna gị ha.’”
23 ౨౩ వారు భోజనం చేసిన తరువాత ఆ ప్రవక్త తాను వెనక్కి తీసుకు వచ్చిన ఆ దైవసేవకుని గాడిదపై జీను వేశాడు.
Mgbe onye nke Chineke ahụ risiri nri, ṅụọkwa ihe ọṅụṅụ, ha kwadooro ya ịnyịnya ibu nke onye amụma ahụ kpọghachiri ya azụ.
24 ౨౪ అతడు బయలుదేరి వెళ్లి పోతుంటే దారిలో ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. అతని శవం దారిలోనే పడి ఉంది. గాడిద దాని దగ్గర నిలబడి ఉంది, సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది.
Dịka ọ na-alaghachi, otu ọdụm zutere ya nʼụzọ, dọgbuo ya. Ma ọ hapụrụ ozu ya ka ọ tọgbọrọ nʼokporoụzọ, ma ịnyịnya ibu ya ma ọdụm ahụ dọgburu nwoke ahụ guzokwa nʼakụkụ ozu ya.
25 ౨౫ కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి, ఆ ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి ఆ విషయం చెప్పారు.
Ndị mmadụ na-agafe hụrụ ozu ahụ ka ọ tọgbọrọ nʼụzọ, hụkwa ka ọdụm ahụ guzo nʼakụkụ ya. Ndị a gara kọọ akụkọ ihe ha hụrụ nʼụzọ nʼobodo ebe onye amụma agadi ahụ bi.
26 ౨౬ దారిలో నుండి అతన్ని తీసుకు వచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని “యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవ సేవకుడు ఇతడే. యెహోవా సింహానికి అతన్ని అప్పగించేసాడు. యెహోవా చెప్పినట్టు, అది అతన్ని చీల్చి చంపేసింది” అని చెప్పాడు.
Mgbe onye amụma ahụ mere ka ọ laghachi azụ nụrụ ihe mere, ọ sịrị, “Ọ bụ onye nke Chineke ahụ nupuru isi nʼokwu Onyenwe anyị. Onyenwe anyị enyefeela ya nʼaka ọdụm, nke dọgburu ma gbukwaa ya, dịka okwu Onyenwe anyị dọrọ ya aka na ntị.”
27 ౨౭ తన కొడుకులను పిలిచి “నా కోసం గాడిదను ప్రయాణానికి సిద్ధం చేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదను సిద్ధ పరిచారు.
Mgbe ahụ, ọ sịrị ụmụ ya ndị ikom, “Jikekwaranụ m ịnyịnya ibu.” Ha mere otu a.
28 ౨౮ అతడు వెళ్లి అతని శవం దారిలో పడి ఉండడం, గాడిద, సింహం శవం దగ్గర నిలిచి ఉండడం, సింహం గాడిదను చీల్చివేయకుండా శవాన్ని తినకుండా ఉండడం చూసి
Ọ pụrụ gaa chọta ozu nwoke ahụ ka ọ tọgbọrọ nʼụzọ. Ịnyịnya ibu ya na ọdụm ahụ guzokwa nʼakụkụ ozu ahụ. Ọdụm erighị anụ nwoke ahụ, ọ dọgbukwaghị ịnyịnya ibu ahụ.
29 ౨౯ ఆ ముసలి ప్రవక్త అ దేవుని మనిషి శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని దుఃఖించడానికీ శవాన్ని పాతి పెట్టడానికీ తన స్వగ్రామం వచ్చాడు.
Onye amụma agadi ahụ buliri ozu onye nke Chineke ahụ dọkwasị ya nʼelu ịnyịnya ibu ya, buru ya bughachi ya nʼobodo, nʼihi iruru ya ụjụ, nakwa ili ya.
30 ౩౦ అతడు తన సొంత సమాధిలో ఆ శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు “అయ్యో! నా సోదరా” అంటూ ఏడ్చారు.
O liri ozu onye nke Chineke ahụ nʼili nke aka ya. Mgbe o liri ya, ọ kwara akwa sị, “Ewoo nwanna m!”
31 ౩౧ అతన్ని పాతిపెట్టిన తరువాత, ఆ ముసలి ప్రవక్త తన కొడుకులతో “నేను చనిపోయినప్పుడు ఆ ప్రవక్తను ఉంచిన సమాధిలోనే నన్నూ పాతిపెట్టండి. నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.
Mgbe o lisiri ya, ọ gwara ụmụ ya ndị ikom sị, “Mgbe m nwụrụ, lienụ m nʼotu ili a e liri onye nke Chineke; doonụ ọkpụkpụ m ka ọ dịrị nʼakụkụ ọkpụkpụ ya.
32 ౩౨ ఎందుకంటే యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణంలో ఉన్న ఉన్నత స్థలాల్లో ఉన్న మందిరాలన్నిటికీ వ్యతిరేకంగా అతడు ప్రకటించినది తప్పకుండా జరుగుతుంది” అని చెప్పాడు.
Nʼihi na ozi ahụ niile o ziri site nʼokwu Onyenwe anyị megide ebe ịchụ aja dị na Betel, na megidekwa ebe ụlọ arụsị niile dị nʼebe dị elu nʼobodo Sameria aghaghị imezu.”
33 ౩౩ ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.
Nʼagbanyeghị ihe ndị a niile, Jeroboam esiteghị nʼụzọ ọjọọ ya tụgharịa. Kama ọ gara nʼihu họpụta ndị nchụaja maka ebe niile dị elu site nʼetiti ndị mmadụ efu. Onye ọbụla chọrọ ị bụ onye nchụaja ka o doro nsọ maka ije ozi nʼebe niile dị elu.
34 ౩౪ యరొబాము వంశాన్ని నిర్మూలించి భూమి మీద లేకుండా చేయడానికి కారణమైన పాపం ఇదే.
Nke a bụ mmehie ezinaụlọ Jeroboam. Ọ bụ ya mere alaeze Jeroboam ji daa, meekwa ka e kpochapụ ya nʼelu ụwa.