< రాజులు~ మొదటి~ గ్రంథము 11 >
1 ౧ సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను అంటే ఫరో కూతుర్నిమాత్రమే గాక మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్ళిచేసుకున్నాడు.
Now King Solomon loved many foreign women including the daughter of Pharaoh—women of the Moabites, Ammonites, Edomites, Sidonians, and Hittites.
2 ౨ “ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.” అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు.
They were from the nations about which Yahweh said to the people of Israel, “You will not go among them to marry, neither will they come among you, for they will certainly turn your heart to their gods.” In spite of this command, Solomon was affectionate toward these women in love.
3 ౩ అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.
Solomon had seven hundred royal wives and three hundred concubines. His wives turned his heart away.
4 ౪ సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు.
For when Solomon grew old, his wives turned away his heart after other gods; his heart was not fully surrendered to Yahweh his God, as was the heart of David his father.
5 ౫ సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు.
For Solomon followed Ashtoreth, the goddess of the Sidonians, and he followed Molech, the disgusting idol of the Ammonites.
6 ౬ ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు.
Solomon did what was evil in the sight of Yahweh; he did not fully follow Yahweh as David his father had done.
7 ౭ సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు.
Then Solomon built a high place for Chemosh, the disgusting idol of Moab, on a hill east of Jerusalem, and also for Molech, the disgusting idol of the people of Ammon.
8 ౮ తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు.
He also built high places for all his foreign wives, who burned incense and sacrificed to their gods at them.
9 ౯ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి రెండు సార్లు ప్రత్యక్షమై,
Yahweh was angry with Solomon, because his heart had turned away from him, the God of Israel, even though he had appeared to him twice
10 ౧౦ నీవు ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించనందుకు ఆయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు.
and commanded him about this very thing, that he should not go after other gods. But Solomon did not obey what Yahweh commanded.
11 ౧౧ “నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు ఆచరించడం లేదు. కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండాా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను.
Therefore Yahweh said to Solomon, “Because you have done this and have not kept the covenant and my statutes that I have commanded you, I will surely tear the kingdom from you and give it to your servant.
12 ౧౨ అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలోనుండి దాన్ని తీసివేస్తాను.
However, for David your father's sake, I will not do it in your lifetime, but I will tear it out of the hand of your son.
13 ౧౩ రాజ్యమంతా తీసివేయను. నా దాసుడు దావీదు కోసం, నేను కోరుకొన్న యెరూషలేము కోసం ఒక్క గోత్రం నీ కొడుక్కి ఇస్తాను.”
Yet I will not tear away all the kingdom; I will give one tribe to your son for David my servant's sake, and for the sake of Jerusalem, which I have chosen.”
14 ౧౪ యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
Then Yahweh raised up an adversary to Solomon, Hadad the Edomite. He was from the royal family of Edom.
15 ౧౫ గతంలో దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే, హతమైన వాళ్ళను పాతిపెట్టించడానికి సైన్యాధిపతి యోవాబు వెళ్ళాడు.
When David was in Edom, Joab the captain of the army had gone up to bury the dead, every man who had been killed in Edom.
16 ౧౬ ఎదోములోని మగవారందరినీ చంపేసే వరకూ ఇశ్రాయేలీయులందరితో పాటు యోవాబు ఆరు నెలలు అక్కడే ఉన్నాడు.
Joab and all Israel remained there six months until he had killed every male in Edom.
17 ౧౭ అప్పుడు హదదు చిన్నవాడు. అతడూ అతనితో పాటు అతని తండ్రి సేవకుల్లో కొంతమంది ఎదోమీయులూ ఐగుప్తు దేశానికి పారిపోయారు.
But Hadad was taken with other Edomites by his father's servants into Egypt, since Hadad was still a little child.
18 ౧౮ వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలు దేరి పారాను ప్రాంతానికి వచ్చి, అక్కడినుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు.
They left Midian and came to Paran, from where they took men with them to Egypt, to Pharaoh king of Egypt, who gave him a house and land and food.
19 ౧౯ హదదు ఫరో దృష్టిలో చాలా మెప్పు పొందాడు. ఫరో తన భార్య తహపనేసు సోదరిని అతనికిచ్చి పెళ్లి చేసాడు.
Hadad found great favor in the sight of Pharaoh, so that Pharaoh gave him a wife, his own wife's sister, the sister of Tahpenes the queen.
20 ౨౦ ఈ తహపనేసు సోదరి హదదుకు గెనుబతు అనే కొడుకుని కన్నది. ఫరో ఇంట్లో తహపనేసు ఇతన్ని పెంచింది, కాబట్టి గెనుబతు ఫరో అంతఃపురంలోనే ఫరో పిల్లలతోపాటు పెరిగాడు.
The sister of Tahpenes gave birth to Hadad's son. They named him Genubath. Tahpenes raised him in Pharaoh's palace. So Genubath lived in Pharaoh's palace among the children of Pharaoh.
21 ౨౧ దావీదు తన పుర్వికులతో కన్నుమూశాడని, అతని సైన్యాధిపతి యోవాబు చనిపోయాడని ఐగుప్తు దేశంలో హదదు విన్నాడు. అతడు “నేను నా స్వదేశానికి వెళ్లడానికి సెలవివ్వండి” అని ఫరోతో మనవి చేశాడు.
While he was in Egypt, Hadad heard that David had lain down with his ancestors and that Joab the captain of the host was dead, Hadad said to Pharaoh, “Let me depart, so I may go to my own country.”
22 ౨౨ ఫరో “నీవు నీ స్వదేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాదగ్గర నీకేం తక్కువయింది?” అని అడిగాడు. అందుకు హదదు “నాకేమీ తక్కువ కాలేదు, కానీ మీరు నన్ను తప్పక వెళ్లనివ్వండి” అన్నాడు.
Then Pharaoh said to him, “But what have you lacked with me, that you now seek to go to your own country?” Hadad answered, “Nothing. Please let me go.”
23 ౨౩ దేవుడు సొలోమోను మీదికి ఎల్యాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. ఇతడు సోబా రాజు హదదెజరు అనే తన యజమాని దగ్గరనుండి పారిపోయినవాడు.
God also raised up another adversary to Solomon, Rezon son of Eliada, who had fled from his master Hadadezer king of Zobah.
24 ౨౪ దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు.
Rezon gathered men to himself and became captain over a small force, when David defeated the men of Zobah. Rezon's men went to Damascus and lived there, and Rezon controlled Damascus.
25 ౨౫ హదదు చేసిన ఈ కీడే గాక సొలొమోను బతికిన రోజులన్నీ రెజోను ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులను ద్వేషించాడు. ఇతడు అరాము దేశాన్ని పాలించాడు.
He was an enemy of Israel all the days of Solomon, along with the trouble that Hadad caused. Rezon abhorred Israel and reigned over Aram.
26 ౨౬ సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు.
Then Jeroboam son of Nebat, an Ephraimite of Zeredah, an official of Solomon, whose mother's name was Zeruah, a widow, also lifted up his hand against the king.
27 ౨౭ ఇతడు రాజు మీదికి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు.
He lifted up his hand against the king because Solomon had built up the place located at Millo and repaired the opening in the city wall of David his father.
28 ౨౮ యరొబాము మహా బలశాలి. యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి, యోసేపు వంశం వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు.
Jeroboam was a mighty man of valor. Solomon saw that the young man was industrious, so he gave him command over all the labor of the house of Joseph.
29 ౨౯ ఆ సమయంలో యరొబాము యెరూషలేములోనుండి బయటికి వెళ్ళగా షిలోనీయుడూ ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్తబట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరు తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు.
At that time, when Jeroboam went out of Jerusalem, the prophet Ahijah the Shilonite found him on the road. Now Ahijah had dressed in a new garment and the two men were alone in the field.
30 ౩౦ అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి పన్నెండు ముక్కలు చేసి, యరొబాముతో ఇలా అన్నాడు. “ఈ పది ముక్కలు నీవు తీసుకో.
Then Ahijah grabbed hold of the new garment that was on him and tore it into twelve pieces.
31 ౩౧ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే ప్రజలు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయాబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు.
He said to Jeroboam, “Take ten pieces, for Yahweh, the God of Israel, says, 'Look, I will tear the kingdom out of the hand of Solomon and I will give ten tribes to you
32 ౩౨ సొలొమోను తండ్రి దావీదు లాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు. నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు. నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు. కాబట్టి సొలొమోను చేతిలోనుండి రాజ్యాన్ని తీసేసి పది గోత్రాలను నీకిస్తాను.
(but Solomon will have one tribe, for my servant David's sake and for Jerusalem's sake—the city that I have chosen out of all the tribes of Israel),
33 ౩౩ అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను.
because they have forsaken me and have worshiped Ashtoreth the goddess of the Sidonians, Chemosh the god of Moab, and Molech the god of the people of Ammon. They have not walked in my ways, to do what is right in my eyes, and to keep my statutes and my decrees, as did David his father.
34 ౩౪ రాజ్యాన్ని సొలోమోను చేతిలోనుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకుని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను.
However, I will not take the whole kingdom out of Solomon's hand. Instead, I have made him ruler all the days of his life, for David my servant's sake whom I chose, the one who kept my commandments and my statutes.
35 ౩౫ అయితే అతని కొడుకు చేతిలోనుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు పది గోత్రాలు ఇస్తాను.
But I will take the kingdom out of his son's hand and I will give it to you, ten tribes.
36 ౩౬ నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదు కోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను.
I will give one tribe to Solomon's son, so that David my servant may always have a lamp before me in Jerusalem, the city in which I have chosen to put my name.
37 ౩౭ నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు.
I will take you, and you will rule to fulfill all that you desire, and you will be king over Israel.
38 ౩౮ నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్లు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని, నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు ఇస్తాను.
If you listen to all that I command you, and if you walk in my ways and do what is right in my eyes, to keep my statutes and my commandments, as David my servant did, then I will be with you and will build you a sure house, as I built for David, and will give Israel to you.
39 ౩౯ నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గానీ ఎల్లకాలం అలా చేయను.”
I will punish the descendants of David, but not forever.'”
40 ౪౦ సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి, ఐగుప్తు రాజు షీషకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకూ ఐగుప్తులోనే ఉన్నాడు.
So Solomon tried to kill Jeroboam. But Jeroboam got up and fled into Egypt, to Shishak king of Egypt, and he remained in Egypt until the death of Solomon.
41 ౪౧ సొలొమోను గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా అతని జ్ఞానం గురించి, సొలొమోను చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
As for the other matters concerning Solomon, all that he did and his wisdom, are they not written in the book of the events of Solomon?
42 ౪౨ సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ పాలించిన కాలం 40 ఏళ్ళు.
Solomon reigned in Jerusalem over all Israel for forty years.
43 ౪౩ సొలొమోను చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని తండ్రి దావీదు పురంలో అతన్ని పాతిపెట్టారు. తరువాత అతని కొడుకు రెహబాము అతనికి బదులు రాజయ్యాడు.
He slept with his ancestors and he was buried in the city of David his father. Rehoboam his son became king in his place.