< రాజులు~ మొదటి~ గ్రంథము 1 >

1 దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. వారు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెచ్చదనం కలగడం లేదు.
А когато цар Давид бе остарял, в напреднала възраст, при все, че го покриваха с дрехи, не се стоплюваше.
2 కాబట్టి వారు అతనితో “మా యజమాని, రాజు అయిన నీ కోసం మంచి యవ్వనంలో ఉన్న కన్యను వెతకడం మంచిది. ఆమె నీ దగ్గర ఉండి నిన్ను కనిపెట్టుకుని నీకు వెచ్చదనం కలిగించడానికి నీ కౌగిలిలో పడుకుంటుంది” అని చెప్పారు.
Затова, слугите му казаха: Нека потърсят за господаря ни царя млада девица за да престоява пред царя и да му пригажда, и да спи на пазвата му, за да се топли господарят ни царят.
3 ఇశ్రాయేలు దేశం అంతటా వెతికి, షూనేము గ్రామానికి చెందిన అబీషగు అనే యువతిని చూసి ఆమెను రాజు దగ్గరికి తీసుకు వచ్చారు.
И тъй, потърсиха по всичките Израилеви предели красива девица, и намериха сунамката Ависага, и доведоха я при царя.
4 ఆమె చూడ చక్కనిది. ఆమె రాజును కనిపెట్టుకుని పరిచర్య చేస్తున్నది గాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.
Девицата бе много красива, и пригаждаше на царя и му слугуваше; но царят не я позна.
5 ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి “నేనే రాజునవుతాను” అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలనూ గుర్రపు రౌతులనూ తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులనూ ఏర్పాటు చేసుకున్నాడు.
Тогава Адония, Агитиният син, надуто си каза: Аз ще царувам. И приготви си колесници и конници и петдесет мъже, които да тичат пред него.
6 అతని తండ్రి దావీదు అతడు బాధ పడతాడేమోనని “నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?” అని ఎప్పుడూ అడగలేదు. అతడు చాలా అందగాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
А баща му никога не беше му досаждал с думите: Ти защо правиш това? А той беше и много хубав на глед; и роди се на Давида подир Авесалома.
7 అదోనీయా సెరూయా కొడుకు యోవాబుతో, యాజకుడు అబ్యాతారుతో సమాలోచన చేశాడు. వారు అతని పక్షాన చేరి అతనికి సహాయం చేశారు.
Той се сговори с Иоава Саруиния син и със свещеника Авиатара, и те последваха Адония и му помагаха.
8 అయితే యాజకుడు సాదోకు, యెహోయాదా కొడుకు బెనాయా, ప్రవక్త నాతాను, షిమీ, రేయీ, దావీదు అంగరక్షకులు అదోనీయాతో చేరలేదు.
Но свещеник Садок, Ванаия Иодаевият син, пророк Натан, Семей и Реий и Давидовите силни мъже не бяха с Адония.
9 అదోనీయా ఏన్‌రోగేలు దగ్గరలోని జోహెలేతు అనే బండ దగ్గర గొర్రెలనూ ఎడ్లనూ కొవ్విన దూడలనూ బలిగా అర్పించి, రాకుమారులైన తన సోదరులందరినీ, యూదావారైన రాజు సేవకులందరినీ పిలిపించాడు.
И Адония закла овци, говеда и угоени телци при скалата на Зоелет, която е при извора Рогих, и покани всичките си братя царските синове, и всичките Юдови мъже царските слуги.
10 ౧౦ అయితే అతడు నాతాను ప్రవక్తనూ బెనాయానూ దావీదు శూరులనూ తన సోదరుడు సొలొమోనునూ పిలవలేదు.
Обаче пророк Натана, Ванаия и силните мъже и брата си Соломона не покани.
11 ౧౧ అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబతో ఇలా చెప్పాడు. “హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు.
Тогава Натан говори на Соломоновата майка Витсавее, казвайки: Не си ли чула, че се е възцарил Адония Агитиният син, а господарят ни Давид не знае това?
12 ౧౨ కాబట్టి నీ ప్రాణాన్ని, నీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని రక్షించుకోడానికి నేను నీకొక ఆలోచన చెబుతాను విను.
Сега, прочее, ела, моля, да те съветвам, за да избавиш своя живот и живота на сина си Соломона.
13 ౧౩ నీవు దావీదు రాజు దగ్గరకి వెళ్ళి, ‘నా యేలినవాడా, రాజా, నీ కొడుకు సొలొమోను నా తరువాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడని నీ సేవకురాలినైన నాకు నీవు ప్రమాణం చేశావే, మరి ఇదేంటి, అదోనీయా ఏలుతున్నాడు?’ అని అడుగు.
Иди, влез при цар Давида и кажи му: Господарю мой царю, не закле ли се ти на слугинята си, казвайки: Синът ти Соломон непременно ще царува подир мене, и той ще седи на престола ми? Защо, прочее, се възцари Адония?
14 ౧౪ రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను.”
И ето, докато ти още говориш там с царя, ще дойда и аз подир тебе и ще потвърдя думите ти.
15 ౧౫ కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు దగ్గరికి వచ్చింది. చాలా ముసలివాడైన రాజుకి షూనేమీయురాలు అబీషగు పరిచర్య చేస్తూ ఉంది.
И така, Витсавее възлезе при царя, в спалнята, като беше царят много стар, и сунамката Ависага му слугуваше.
16 ౧౬ బత్షెబ వచ్చి రాజు ముందు సాగిలపడి నమస్కారం చేసింది. రాజు “నీకేమి కావాలి?” అని అడిగాడు. అందుకు ఆమె ఇలా మనవి చేసింది.
И Витсавее се наведе та се поклони на царя. И царят рече: Какво желаеш?
17 ౧౭ “నా యేలిన వాడా, నీవు ‘నా దేవుడైన యెహోవా తోడు, నిశ్చయంగా నీ కొడుకు సొలొమోను నా తరవాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడు’ అని నీ సేవకురాలినైన నాకు ప్రమాణం చేశావు.
А тя му каза: Господарю мой, ти се закле в Господа твоя Бог на слугинята си и каза: Твоят син Соломон непременно ще царува подир мене, и той ще седи на престола ми.
18 ౧౮ కానీ ఇప్పుడు అదోనీయా పరిపాలిస్తున్నాడు. ఈ సంగతి నా యజమానివీ, రాజువీ అయిన నీకు ఇప్పటి వరకూ తెలియలేదు.
Но сега, ето, Адония се е възцарил; а ти, господарю мой царю, не знаеш това.
19 ౧౯ అతడు ఎడ్లనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ, యాజకుడు అబ్యాతారునూ సైన్యాధిపతి యోవాబునూ ఆహ్వానించాడు గానీ నీ సేవకుడు సొలొమోనుని ఆహ్వానించలేదు.
И той е заклал говеда, угоени телци и овци в изобилие, и е поканил всичките царски синове, и свещеника Авиатара, и военачалника Иоава; обаче, слугата ти Соломона не е поканил.
20 ౨౦ నా యజమానీ, నా రాజా, నీ తరవాత ఎవరు సింహాసనం అధిష్టిస్తారో అని ఇశ్రాయేలీయులంతా కనిపెట్టి చూస్తున్నారు.
Но към тебе, господарю мой царю, към тебе са обърнати очите на целия Израил, за да им известиш кой ще седне на престола на господаря ми царя подир него.
21 ౨౧ అంతేగాక, నా యేలినవాడివీ, రాజువూ అయిన నీవు నీ పూర్వికులతో కూడ కన్ను మూసిన తరవాత నన్నూ నా కొడుకు సొలొమోనునూ వారు రాజద్రోహులుగా ఎంచుతారు.”
Иначе, когато господарят ми царят заспа с бащите си, аз и синът ми Соломон ще се считаме за оскърбители.
22 ౨౨ ఆమె రాజుతో మాటలాడుతూ ఉండగానే నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. “నాతాను ప్రవక్త వచ్చాడు” అని సేవకులు రాజుకు తెలియజేశారు.
А докато тя още говореше с царя, ето, дойде и пророк Натан.
23 ౨౩ అతడు రాజు ఎదుటకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశాడు.
И известявайки на царя, рекоха: Ето пророк Натан. И той, като влезе пред царя, поклони му се с лице до земята.
24 ౨౪ అతడు “నా యజమానీ, రాజా! అదోనీయా నీ తరవాత నీ సింహాసనమెక్కి రాజ్యాన్ని పాలిస్తాడని నీవు చెప్పావా?
И Натан каза: Господарю мой царю, рекъл ли си ти, Адония ще царува подир мене, и той ще седи на престола ми?
25 ౨౫ ఎందుకంటే, ఈ రోజు అతడు అసంఖ్యాకంగా ఎద్దులనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ సైన్యాధిపతులనూ యాజకుడు అబ్యాతారునూ పిలిచాడు. వారంతా అతని దగ్గర ఉండి అన్నపానాలు తీసుకుంటూ, ‘రాజైన అదోనీయా చిరంజీవి అవుతాడు గాక’ అని పలుకుతున్నారు.
Защото той слезе днес та закла говеда, угоени телци, и овци в изобилие, и покани всичките царски синове, и военачалниците, и свещеника Авиатара; и, ето, ядат и пият пред него, и думат: Да живее цар Адония!
26 ౨౬ అయితే నీ సేవకుడినైన నన్నూ యాజకుడు సాదోకునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నీ సేవకుడు సొలొమోనునూ అతడు పిలవలేదు.
А мене, мене слугата ти, и свещеника Садока, и Ванаия Иодаевия син, и слугата ти Соломона не покани.
27 ౨౭ నా యజమాని రాజు తన తరువాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడౌతాడో తన సేవకులతో చెప్పకుండానే ఇలా చేసాడా” అని అడిగాడు.
От господаря ми царя ли стана това нещо, без да си обявил на слугите си, кой ще седне на престола на господаря ми царя подир него?
28 ౨౮ దావీదు “బత్షెబను పిలవండి” అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది.
Тогава цар Давид в отговор рече: Повикайте ми Витсавее. И тя влезе при царя и застана пред него.
29 ౨౯ అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా “అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు,
И царят се закле, казвайки: В името на живия Господ, Който е избавил душата ми от всяко бедствие,
30 ౩౦ ‘తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరవాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు’ అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను” అని చెప్పాడు.
непременно, както ти се заклех в Господа Израилевия Бог и рекох, че синът ти Соломон ще царува подир мене, и че той ще седи вместо мене на престола ми, непременно така ще направя днес.
31 ౩౧ అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి “నా యజమాని, రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక” అంది.
Тогава Витсавее се наведе с лице до земята та се поклони на царя, и каза: Да живее господарят ми цар Давид до века!
32 ౩౨ అప్పుడు రాజైన దావీదు “యాజకుడు సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి పిలవండి” అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు.
Тогава рече цар Давид: Повикайте ми свещеника Садока, пророка Натана и Ванаия Иодаевия син. И те дойдоха пред царя.
33 ౩౩ రాజు “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకు వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకు వెళ్ళండి.
И царят им рече: Вземете със себе си слугите на вашия господар, качете сина ми Соломона на моята мъска, и заведете го долу в Гион;
34 ౩౪ యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి’ అని ప్రకటన చేయాలి.
и свещеник Садок и порок Натан нека го помажат там за цар над Израиля; и засвирете с тръба и кажете: Да живее цар Соломон!
35 ౩౫ తరువాత, ఇశ్రాయేలు వారి మీదా యూదా వారి మీదా నేను అతణ్ణి అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానంలో రాజవుతాడు” అని ఆజ్ఞాపించాడు.
Тогава качете се тук подир него, и нека дойде и седне на престола ми, защото той ще царува вместо мене, и аз го назначих да бъде вожд на Израиля и на Юда.
36 ౩౬ అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు. “ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక.
А Ванаия Иодаевият син, в отговор на царя, рече: Амин! така да повели и Господ Бог на господаря ми царя!
37 ౩౭ యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి, నా యజమానివీ రాజువీ అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక.”
Както е бил Господ с господаря ми царя, така да бъде и със Соломона, и да направи престола му още по-велик от престола на господаря ми цар Давида.
38 ౩౮ కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకు వచ్చారు.
И така, свещеник Садок пророк Натан и Ванаия Иодаевият син, с херетците и фелетците, слязоха та качиха Соломона на цар Давидовата мъска и доведоха го в Гион.
39 ౩౯ సాదోకు గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా “రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి” అని కేకలు వేశారు.
И свещеник Садок взе рога с мирото от шатъра, за срещане та помаза Соломона. И засвириха с тръба, и всичките люде рекоха: Да живее цар Соломон!
40 ౪౦ ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు.
И всичките люде отидоха нагоре подир него; и людете свиреха с кавали и веселяха се с голямо веселие, така че земята се цепеше от виковете им.
41 ౪౧ అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా ఆ కోలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని “పట్టణంలో ఈ సందడి ఏమిటి?” అని అడిగాడు.
А Адония и всичките му гости чуха шума, като свършиха яденето си. И когато Иоав чу тръбният звук рече: Защо е тоя шум и градът развълнуван?
42 ౪౨ అంతలో, యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా “లోపలికి రా, నీవు యోగ్యుడివి. మంచి వార్తతో వస్తావు” అన్నాడు.
Докато още говореше, ето, Ионатан, син на свещеника Авиатара дойде; и Адония рече: Влез, защото ти си достоен мъж и носиш дори известия.
43 ౪౩ అప్పుడు యోనాతాను అదోనీయాతో “మన యజమాని, రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు.
А Ионатан в отговор рече на Адония: Наистина господарят ни цар Давид направи Соломона цар;
44 ౪౪ రాజు యాజకుడైన సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతీయులనూ పెలేతీయులనూ అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు.
и царят прати с него свещеника Садока, пророка Натана и Ванаия Иодаевия син, с херетците и фелетците, та го възкачиха на царевата мъска;
45 ౪౫ యాజకుడైన సాదోకూ ప్రవక్త నాతానూ గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే.
И свещеникът Садок и пророк Натан го помазаха за цар в Гион; и от там отидоха нагоре веселящи се, така щото градът екна. Това е шумът, който сте чули.
46 ౪౬ అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు.
При това, Соломон седна на престола на царството.
47 ౪౭ పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. ‘దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక’ అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి
Освен туй, и царските слуги влязоха да честитят на господаря ни цар Давида, и рекоха: Бог да направи името на Соломона по-светло и от твоето име, и да направи престола му по-велик и от твоя престол. И царят се поклони както беше на леглото си.
48 ౪౮ ‘నేను బతికి ఉండగానే ఈ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కళ్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగు గాక’ అన్నాడు” అని యోనాతాను చెప్పాడు.
Царят още говори така: Благословен да бъде Господ Израилевият Бог, Който ми даде днес син да седи на престола ми, докато очите ми го гледат.
49 ౪౯ అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు.
Тогава всичките гости на Адония се уплашиха, и ставайки отидоха всеки в пътя си.
50 ౫౦ అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.
А Адония, понеже се уплаши от Соломона, стана и отиде да се хване за роговете на олтара.
51 ౫౧ అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని “రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి” అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది.
И известиха на Соломона, казвайки: Ето, Адония се бои от Цар Соломона, и, ето, хванал се е за роговете на олтара и казва: Нека ми се закълне днес цар Соломон, че няма да убие слугата си с меч.
52 ౫౨ అందుకు సొలొమోను “అతడు తనను నిర్దోషిగా కనపరచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. కాని అతడు దోషి అని తేలితే అతనికి మరణశిక్ష తప్పదు” అని చెప్పి,
И рече Соломон: Ако се покаже достоен мъж, ни един от космите му няма да падне на земята; но ако се намери зло в него, ще се умъртви.
53 ౫౩ బలిపీఠం దగ్గర నుండి అతణ్ణి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినపుడు సొలొమోను అతనితో “ఇక నీ ఇంటికి వెళ్ళు” అన్నాడు.
И тъй, цар Соломон прати, та го свалиха от олтара; и той дойде да се поклони на цар Соломона. А Соломон му рече: Иди у дома си.

< రాజులు~ మొదటి~ గ్రంథము 1 >