< 1 యోహాను 1 >

1 ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం.
Ми [звіщаємо вам] про те, що було від початку, що ми чули, що бачили власними очима, що оглядали й до чого торкалися нашими руками, – про Слово Життя.
2 ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. (aiōnios g166)
Життя явилося, ми Його бачили, [про Нього] свідчимо й звіщаємо вам Життя вічне, яке було з Отцем і явилося нам. (aiōnios g166)
3 మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది.
Ми проголошуємо вам те, що ми бачили й чули, щоб і ви мали спільність із нами. А наша спільність – з Отцем та Його Сином Ісусом Христом.
4 మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.
Про це й пишемо вам, щоб наша радість була повною.
5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం.
Ось звістка, яку ми чули від Нього й звіщаємо вам: Бог – це світло, і в Ньому немає ніякої темряви.
6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.
Якщо ми кажемо, що маємо спільність із Ним, а ходимо в темряві, то обманюємо й не перебуваємо в істині.
7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
А якщо ходимо у світлі, як і Він є у світлі, то маємо спільність одне з одним, і кров Ісуса, Сина Божого, очищає нас від усякого гріха.
8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
Якщо ми кажемо, що не маємо гріха, то вводимо себе в оману і в нас немає істини.
9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.
Якщо ж ми визнаємо наші гріхи, то Він простить їх та очистить нас від усякої неправедності, бо Він вірний і праведний.
10 ౧౦ మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.
А коли кажемо, що ми не згрішили, то робимо Його неправдомовцем, і Його Слова немає в нас.

< 1 యోహాను 1 >