< 1 యోహాను 4 >
1 ౧ ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.
Ta ishato ayana wursi amanopite. Gido attiin ayanati Xoossapekonne pacci beyte. Gasoykka daro wordo nabeti biitta bolla laletida.
2 ౨ ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది.
Inte Xoossa ayana erana ogey; “Yesuss Kirstossay asa asho maydi yides” giza ayanay wuri Xoossafeko.
3 ౩ యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది.
“Yesuss Kirstosay asa asho mayidi yides” gonta ayanay Xoossafe gidena. Kase izi yana gishin inte siyda Kirstossara eqetizaysa ayanay hessakko. Ha7ikka izi alame bolla dees.
4 ౪ పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.
Ta nayto inte Xoossita. Inte ista Xonidista gasoykka intenan dizay alamen dizaysafe adhees.
5 ౫ ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది.
Isti alame bagakko, hessa gish isti hasa7izay wuri alampe kezizaysakko. alame asay isti gizaysa siiyes.
6 ౬ మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
Nu qasse Xoossa bagakko, Xoosu erizay nu gizaz siyana shin Xoossa baga gidontadey gidiko nu gizaz siyena. Tumma ayananne wordo ayana nu shakki erizay hayssankko.
7 ౭ ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు.
Ta ishato, siqoy Xoossafe gidida gish nu nu garisa ane siqetos. Asa siqqiza asi wuri Xoossafe yelettidanne Xoosu erizadekko.
8 ౮ ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ.
Ase siqonta assi Xoosu erena. Azas giko Xoosi siqoko.
9 ౯ దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది.
Xossay nu garsan ba siqqo qonccsiday nu iza bagara deyo demanamala ba na isneza ha dugge ha alamezan yedidaysankko.
10 ౧౦ మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.
Nuni Xoossu siqqibeykko shin izi nuna siqides. Nu nagara dhaysana mala ba naza yeddides. Siqo gusikka hessakko.
11 ౧౧ ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
Ta ishato, Xoosi nuna hayssatho siqqiko nukka nu garsan siqistanas beses.
12 ౧౨ ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.
Xoosu be7ida uray oonikka deena. Nu nu garsan siqetiza gidiko Xoosi nunan dana. Iza siqoyka nuna pollistana.
13 ౧౩ దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు.
Izi nus ba ayana imida gish nu izan dizaysanne izikka nunan dizaysa nu hessan eros.
14 ౧౪ తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూశాము. దానికి మేము సాక్షులం.
Away ba naza hayssa ha alame asa ashanas yedidaysa nu beydosinne iza giish maarkatos.
15 ౧౫ యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు.
Yesussay Xoossa na gididaysa amanidi marikatiza wurson Xoossi deesinne, izadeykka Xoossan dees.
16 ౧౬ దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు.
Hesa gish, Xoossi nuna siqiza siqo nu eros. Nu iza siqqon amanetos. Xossi siqqo. Siqon diza uray Xoossan dees. Xoosikka he uran dees.
17 ౧౭ తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.
Nuni hayssa biitta bolla deyzay Kirstosay deydamala gidida gish nuus piirda galas baboy deena. Hesankka siqqoy nunan kumeth gides.
18 ౧౮ ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు.
Siiqo garsan baboy ba, tumu siqqoy gidiko babo kesi wora yeges. Baboy qixxatera isfe ooyketi des. Babiza ura siqqoy kumeth gidena.
19 ౧౯ దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.
Izi kassetidi nuna siqqda gish nukka iza siiqos.
20 ౨౦ “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు.
Oonikka Xoosu siqays giishe ba isha ixxiko he uray wordo. Be ayfera beyza ba isha siqonta uray ba ayfen beyonta Xoossa siqanas danda7ena.
21 ౨౧ దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.
“Xoossu siqiza assi wurikka ba isha siqanas beses” Giiza ha azazoza izi nuus imides.