< 1 యోహాను 3 >
1 ౧ మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
Глядїть, яку любов дав нам Отець, щоб ми дїти Божі звались. Тим то не знає нас сьвіт, що не пізнав Його.
2 ౨ ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
Любі, ми тепер дїти Божі; та ще не явилось, що ми будемо; знаємо ж, що, коди явить ся, подібні Йому будемо, бо побачимо Його, яко ж єсть.
3 ౩ ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.
І всякий, що має сю надію на Нього, очищує себе, яко і Він чистий.
4 ౪ పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
Кожен, хто робить гріх, робить також беззаконнє, і гріх єсть беззаконнє.
5 ౫ మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు.
Знаєте ж, що Він явив ся, щоб гріхи наші взяти, і що гріха нема у Ньому.
6 ౬ ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.
Кожен, хто у Ньому пробуває, не грішить; кожен, хто, грішить, не бачив Його, ні пізнав Його.
7 ౭ పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు.
Дїточки, нехай нїхто вас не обманює: хто робить правду, той праведний, яко ж Він праведний,
8 ౮ పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
хто робить гріх, той від диявола, бо від почину диявол грішить. На се явив ся Син Божий, щоб зруйновати дїла диявола.
9 ౯ దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
Кожен, хто родив ся з Бога, гріха не робить, бо насїннє Його в ньому пробуває; і не може грішити, бо він з Бога родив ся.
10 ౧౦ నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
По сьому явні дїти Божі, і дїти дияволські. Кожен, хто не робить правди, не від Бога, так само й хто не любить брата свого.
11 ౧౧ మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.
Се бо віщаннє, котре ви чули від почину, щоб ми любили один одного,
12 ౧౨ సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
не яко ж Каїн, що від лихого був, і забив брата свого; та й за що забив його? тому, що дїла його лихі були, а (дїла) брата його праведні.
13 ౧౩ నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
Не дивуйтесь, брати мої, коли ненавидить вас сьвіт.
14 ౧౪ మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
Ми знаєм, що перейшли від смерти у життє, бо любимо братів; хто не любить брата, пробуває в смертї.
15 ౧౫ తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు. (aiōnios )
Кожен, хто ненавидить брата свого, той чоловікогубець; а ви знаєте, що жоден чоловікогубець не має життя вічнього, в ньому пробуваючого. (aiōnios )
16 ౧౬ యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి.
У сьому пізнали ми любов, що Він за нас душу свою положив; і ми повинні за братів душі класти.
17 ౧౭ ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
Хто ж має прожиток у сьвітї, і видить брата свого, що в потребі, та й зачинить серце своє перед ним, то як любов Божа пробуває у ньому?
18 ౧౮ నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
Дїточки мої, не любім словом, анї язиком, а ділом і правдою.
19 ౧౯ దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.
І по сьому пізнаємо, що ми від, правди, і перед Ним втихомирюєм серця наші;
20 ౨౦ మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
бо коли винує нас серце, (то о скільки більше Бог); бо більший Бог, ніж серце наше, і знає все.
21 ౨౧ ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
Любі, коли серце наше не винуе нас, одвагу маєм перед Богом,
22 ౨౨ అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం.
і, коли що просимо, приймаємо від Нього, бо хоронимо заповіді Його, і угодне перед Ним робимо.
23 ౨౩ ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
А се заповідь Його, щоб вірували в імя Сина Його Ісуса Христа, й любили один одного, яко ж і дав заповідь нам.
24 ౨౪ దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.
І, хто хоронить заповіді Його, у тому Він пробуває, а той в Ньому. І по сьому пізнаємо, що пробуває в нас, - по Духові, котрого дав нам.