< 1 యోహాను 3 >

1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
Vone, mufutanzi we ilato Ishetu lya vahi kwetu, kuti tu sumpwe vana va Ireza, mi nji chona chi tuli. Cheli vaka, i nkanda ka itwizi, kakuti kana iva mwizi.
2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
Vasakiwa, hanu cheli tu vana va Ireza, mi kakwini ku patululwa chese ni tuve kacho. Twizi kuti Kirisite cha voneka, katuve sina iye, kakuti ka tu muvone sina uvu mwe kalile.
3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.
Yense wina iyi insepo kuya cha vuhalo vwa ku vusu vu lolete hali u lishanza mwine sina mwe kalile ku jololola.
4 పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
Yense yo zwila havusu u chita chisena mulao, kakuti chivi ku vula mulao.
5 మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు.
Mwizi kuti Kirisite ava patululwa ku pangila ku zwisa zivi. Mi mwali ka mwina chivi, ka kakwina yo shala mwali yo zwila havusu ni chivi.
6 ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.
Ka kwina yo zwila havusu muchivi ya va muvoni kapa ku mwi ziva.
7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు.
Vana vasakiwa, kanzi mu siyi yense ku mi zwisa mu nzila. Iye yo panga zilukite u lukite, sina uvu Kirisite ha lukite.
8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
Iye yo panga chivi uzwa kwa javulusi, kakuti javulusi ava fosi ku zwa ku matangilo. Cheli vaka Mwana wa Ireza ava patululwa, kuti za sinyenge misevezi ya javulusi.
9 దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
Yense ya va zalwa kwa Ireza katendi chivi kakuti lutanga lwa Ireza lushala mwali. Kawoli ku zwila havusi na chita chivi kakuti uzelwe cha Ireza.
10 ౧౦ నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
Mwe chi vana va Ireza ni vana va javulusi va patululwile. Yense ya sa pangi chi lukite ka zwi kwa Ireza; kapa njozo ya sa saki mwakwe.
11 ౧౧ మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.
Ili njeli iñusa li muvazuwi ku matangilo: kuti tulisakane tuvonse.
12 ౧౨ సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
Isiñi uvu Kaine, ya vali kuzwa ku muvilala ni kwi haya mwa nchakwe. Mi chinzi ha va mwi hai? Kakuti misevezi ya kwe ivali mivilala, mi ya mwakwe iva lukite.
13 ౧౩ నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
Kanzi mu komokiswa, va kwetu, haiva inkanda imi toya.
14 ౧౪ మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
Twizi kuti tu va hitilili ku zwa mwifu ku ya mukuhala, kakuti tusaka vakwetu. Yense ya suni ushala mwifu.
15 ౧౫ తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు. (aiōnios g166)
Yense yo toyete mwakwe chi hayi. Mi mwizi kuti uvu vuhalo vusa mani ka vushali mu chihayi. (aiōnios g166)
16 ౧౬ యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి.
Kache chi mwizi kuti ilato, kakuti Kirisite ava la ziki vuhalo bwakwe hansi chetu. Na swe tuswanela ku lazika vuhalo vwetu cha va mwetu.
17 ౧౭ ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
Kono yense yokwete zintu ze nkanda, na vona mwakwe yo vulite mi wi yala inkulo yense ku zwa kwali, linu ilato lye Ireza ka lishale vule mwali?
18 ౧౮ నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
Vana vangu va sakahala, kanzi tu saki mwi inzwi kapa mu lulimi, kono mu zimpangaliko ni initi.
19 ౧౯ దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.
Nji ka chezi twizi kuti tuzwa ku niti, mi tulizuwi vuvi inkulo zetu ha li.
20 ౨౦ మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
Mi haiva inkulo zetu zi tunyansa, Ireza mukando ku hita inkulo zetu, mi wizi zintu zonse.
21 ౨౧ ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
Vasakiwa, haiva inkulo zetu ka zi tunyansi, twina insempo kwa Ireza.
22 ౨౨ అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం.
Zonse zitu kumbila katuzi tambule kuzwa kwali, kakuti tu vika milao ya kwe mi tupanga zintu zi kondwa hali.
23 ౨౩ ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
Uwu nji mulao wakwe: kuti tu zumine mwi zina lya Mwana Jesu Kirisite, mi ni kulisaka mu vonse, sina mwa vatuheli uwu mulao.
24 ౨౪ దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.
Iye uzo yo vika milao ya Ireza ushala mwali, mi Ireza ushala mwali. Che chi twizi kuti ushala mwetu, cha Luhuho lu vahewa kwetu.

< 1 యోహాను 3 >