< 1 కొరింథీయులకు 9 >
1 ౧ నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా?
Нисам ли ја апостол? Нисам ли сам свој? Не видех ли ја Исуса Христа, Господа нашег? Нисте ли ви дело моје у Господу?
2 ౨ నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు.
Ако другима и нисам апостол, али вама јесам, јер сте ви печат мог апостолства у Господу.
3 ౩ నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే.
Мој одговор онима који ме успитају ово је:
4 ౪ తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా?
Еда ли немамо власти јести и пити?
5 ౫ మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా?
Еда ли немамо власти сестру жену водити, као и остали апостоли, и браћа Господња, и Кифа?
6 ౬ బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?
Или један ја и Варнава немамо власти ово чинити?
7 ౭ ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు?
Ко војује кад о свом трошку? Или ко сади виноград и од родова његових да не једе? Или ко пасе стадо и од млека стада да не једе?
8 ౮ ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా?
Еда ли ово говорим по човеку? Не говори ли ово и закон?
9 ౯ “ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది?
Јер је у Мојсијевом закону написано: Да не завежеш уста волу који врше. Еда ли се Бог брине за волове?
10 ౧౦ నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి.
Или јамачно говори за нас? Јер се за нас написа: Који оре треба у надању да оре; и који врше у надању да ће добити од оног што врше.
11 ౧౧ మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.
Када ми вама духовна сејасмо, је ли то шта велико ако ми вама телесна пожњемо?
12 ౧౨ వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.
Кад се други мешају у вашу власт, а камоли не би ми? Али не учинисмо по власти овој него све трпимо да не учинимо какву сметњу јеванђељу Христовом.
13 ౧౩ దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?
Не знате ли да они који чине свету службу од светиње се хране? И који олтару служе с олтаром деле?
14 ౧౪ అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు.
Тако и Господ заповеди да они који јеванђеље проповедају од јеванђеља живе.
15 ౧౫ అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు.
А ја то ниједно не учиних. И не пишем ово да тако буде за мене; јер бих волео умрети него да ко славу моју уништи.
16 ౧౬ నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
Јер ако проповедам јеванђеље, нема ми хвале: јер ми је за невољу; и тешко мени ако јеванђеља не проповедам.
17 ౧౭ దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు.
Ако дакле ово чиним од своје воље, плату имам; а ако ли чиним за невољу, служба ми је предата.
18 ౧౮ అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.
Каква ми је дакле плата? Да проповедајући јеванђеље учиним без плате јеванђеље Христово, да не чиним по својој власти у проповедању јеванђеља.
19 ౧౯ నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను.
Јер премда сам слободан од свих, свима себе учиних робом, да их више придобијем.
20 ౨౦ యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను.
Јеврејима сам био као Јеврејин да Јевреје придобијем; онима који су под законом био сам као под законом, да придобијем оне који су под законом;
21 ౨౧ దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.
Онима који су без закона био сам као без закона, премда нисам Богу без закона него сам у закону Христовом, да придобијем оне који су без закона.
22 ౨౨ బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను.
Слабима био сам као слаб, да слабе придобијем; свима сам био све, да какогод спасем кога.
23 ౨౩ సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
А ово чиним за јеванђеље, да бих имао део у њему.
24 ౨౪ పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
Не знате ли да они што трче на трку, сви трче, а један добије дар? Тако трчите да добијете.
25 ౨౫ అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
Сваки пак који се бори од свега се уздржава: они дакле да добију распадљив венац, а ми нераспадљив.
26 ౨౬ కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు.
Ја дакле тако трчим, не као на непоуздано; тако се борим, не као онај који бије ветар;
27 ౨౭ ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
Него морим тело своје и трудим да како сам другима проповедајући избачен не будем.